ప్యాంట్ జేబులో సెల్ 'బాంబ్'
ప్యాంట్ జేబులో సెల్ 'బాంబ్'
Published Tue, Jun 10 2014 2:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
మీరు సెల్ ఫోన్ ప్యాంట్ జేబులో స్టయిలిష్ గా పెట్టుకుని తిరుగుతున్నారా? అయితే ఆ పనిని తక్షణమే మానేయండి. ఎందుకంటే సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మగవారికి వంధ్యత్వం వస్తుంది.
ఈ విషయం బ్రిటన్ లో జరిగిన ఒక పరిశోధన లో వెల్లడైంది. ఈ రేడియేషన్ వీర్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ కి చెందిన బయో సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ ఫియోనా మాథ్యూస్ ఈ విషయాన్ని తెలియచేశారు.
ఇప్పటికే ఎంతో కొంత వంధ్యత్వం ఉన్న వారికి, ప్రారంభ దశలో ఉన్న వారికి సెల్ ఫోన్ రేడియేషన్ మరింత చేటు చేస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా 14 శాతం మంది పురుషుల్లో సంతాన హీనత సమస్య ఉంది. సెల్ రేడియేషన్ కూడాదీనికి ఒక ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొంటోంది.
ఈ పరిశోధనలో వీర్య కణాల కదలికలు, అవి జీవించే కాలం, వీర్యకణాల సంఖ్య ఆదారంగా వీర్యం నాణ్యతను అంచనా వేశారు. సెల్ ఫోన్ జేబులో ఉంచుకునే వారిలో, ఉంచని వారిలో స్పెర్మ్ క్వాలిటీ ఎలా ఉందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. సెల్ ఫోన్ రేడియేషన్ వీటిని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాథ్యూస్ చెబుతున్నారు.
Advertisement