sperm count
-
మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా?
చలికాలం వచ్చినా లేదా కొందరి మగవాళ్లకు వేడినీటితోనే స్నానం చేయడం నచ్చుతుంది. అంతేగాదు కొందరికి అలా వేడినీటితో స్నానం చేస్తే హాయిగా రిలీఫ్ ఉంటుంది. నిద్ర కూడా గమ్మున పడుతుందన్న భావన కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవాళ్లు రోజంతా బయట తిరిగి అలసటతో ఇంటికి వస్తారు కాబట్టి.. కాసేపు అలా వేడినీటితో స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉన్నట్లు ఫీలవ్వుతారు. కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో చెయొద్దని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పైగా రోజూ మగవాళ్లు వేడినీటి స్నానాలు చేయకపోవడమే మంచిదని చెబతున్నారు. ఎందుకని? రీజన్ ఏంటీ? వేడినీటి స్నానం ఇష్టపడే పురుషులకు సంతానోత్పత్తి అవకాశాలను తక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం లేదా వాటి నాణ్యత తగ్గి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. వారానికి కనీసం 30 నిమిషాల పాటు అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీటితో స్నానం చేసిన పురుషుల వీర్యాన్ని నమనాలను పరీక్షించగా..వాటి చలనశీలత రేటు పేలవంగా ఉండటమే గాక తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యూనివిర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూరాలజిస్ట్లు సంతోనోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పురుషులు వేడినీటితో ఎక్కువగా స్నానం చేయడం కారణంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిర్థారించారు. ఇదేలా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందంటే.. పరిశోధనల్లో ఉష్ణోగ్రత, టెస్టోస్టెరాన్, వృషణాలు, స్క్రోటమ్తో బంధన సంబధాన్ని కలిగి ఉంటుందని తేలింది. బాహ్యంగా ఉండే వృషణాలు సుమారు 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సెర్మ్ , ఇతర హార్మోనలను విడుదల చేయగలదు. అయితే శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలోనే ఈ వృషణాల్లోని జెర్మ్ కణాలు ఉంటాయి. కాబట్టి కొద్ది మోతాదులోని ఉష్ణోగ్రత పెరుగుదలే స్పెర్మ్, టెస్టోస్టెరాన్‌ల రెండింటిపే గణనీయమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడైతే అధిక వేడికి వృషణాలు గురవ్వుతాయో అప్పుడూ..డీఎన్ఏ నిర్మాణం, స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపి వాటి పరిమాణాలలో అసాధారణతలకు దారితీస్తుంది. దీంతో స్పెర్మ్ సమర్థవంతంగా కదలక ఫలదీకరణం చెందించలేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఫలదీకరణం చెంది గర్భం దాల్చినా..పుట్టబోయే సంతానంలో జన్యుపరమైన లోపాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లో వేడినీటితో పదే పదే స్నానం చేయడం మగవాళ్లలోని వృషణాలపై అధిక ప్రభావం చూపి సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అంతేగాదు మగవాళ్లలోని వంధ్యత్వం అనే సమస్యకు పూర్తిస్థాయిలో చికిత్స లేనప్పటికీ ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మార్గాలు మాత్రం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. క్రమం తప్పకుండా వ్యాయామం విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి. ఒత్తిడి మీ లైంగిక సామర్థ్యంపై అధికంగా ప్రభాం చూపిస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. జింక్ ఉండే మాంసం, చేపలు, గుడ్లు, షెల్ఫిష్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను , స్పెర్మ్ కౌంట్ పెంచే జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. అధిక బరువు కూడా వంధ్యత్వానికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు మద్యం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించగలరిని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్..వాళ్ల గ్లామర్ రహస్యం ఇదేనా!) -
ప్రమాదంలో ‘పునరుత్పత్తి’.. జీవనశైలిలో మార్పులే కారణమా?
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో శుక్ర కణాలు భారీ సంఖ్యలో తగ్గుతున్నాయి. వీర్యకణాల చిక్క దనం తగ్గిపోతోంది. నలభై ఐదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చితే...పురుషుల్లో వీర్యకణాల చిక్కదనంలో 50 శాతానికి పైగా, స్పెర్మ్‌కౌంట్ (శుక్ర కణాలు)లో 62.3% క్షీణత నమోదైనట్టు పేర్కొంటున్నాయి. తగ్గుదల రేటు గత కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కారణమని పరిశోధనలు స్పష్టం చే స్తున్నాయి. రాత్రివేళ పని, అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 53 దేశాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఏడాదికి 1.16% చొప్పున..! 1972 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఏడాదికి 1.16 శాతం చొప్పున శుక్రకణాల చిక్కదనంలో తగ్గుదల నమోదైనట్టు గుర్తించారు. ఇక 2000 సంవత్సరం తర్వాత సేకరించిన డేటాను మాత్రమే పరిశీలించినపుడు ఆ తగ్గుదల ఏడాదికి 2.64 శాతంగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి తాజా పరిశోధన ‘హ్యుమన్ రీ ప్రొడక్షన్ అప్డేట్’ జర్నల్‌లో ప్రచురితమైంది. గతంలో వీర్యకణాల చిక్క దనం, కౌంట్ ఒక మిల్లీగ్రామ్ (ఎంఎల్)లో 40 మిలియన్ల కంటే తగ్గితే పునరుత్పత్తికి దోహదపడవని అంచనా వేశారు. అయి తే తాజా అంచనాలు, డేటా చూశాక దీని కంటే కూడా కౌంట్ పడిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగినట్టు స్పష్టమైంది. పునరుత్పత్తి సామర్ధ్యంలో తగ్గుదల స్పెర్మ్‌కౌంట్ తగ్గుదల జనాభా పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుదలను స్పష్టం చేస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెరూసలెం హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లీవైన్ పేర్కొన్నారు. స్పెర్మ్‌కౌంట్ అనేది ‘హ్యుమన్ ఫెర్టిలిటీ’కే కాకుండా మగవారి ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వీర్యకణాల తగ్గుదల దీర్ఘకాలిక వ్యాధులకు, టెస్టిక్యూలర్ (వృషణాల) కేన్సర్లకు దారితీయడంతో పాటు ఆయురార్దం తగ్గుదలకూ దోహదపడుతుందని తేలింది. వయసు, శృంగార సామర్థ్యం ఇతర అంశాల ప్రాతిపదికగా వివిధ కేటగిరీలుగా విభజించి ఈ పరిశోధన నిర్వహించారు. భారత్‌లో సుస్పష్టం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా మన దేశంలోనూ దీనిపై పరిశీలన నిర్వహించారు. భారత్‌లో వివిధ కేటగిరీల వారీగా డేటా సేకరించారు. ‘భారత్‌లోని మగవారిలో శుక్రకణాల తగ్గుదల అనేది స్పష్టంగా గమనించాం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఒకేవిధమైన పరిస్థితి ఉంది. అత్యాధునిక సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, జీవనశైలి మార్పులు, పర్యావరణంలో రసాయనాల వ్యాప్తి వంటివి దీనికి ›ప్రధానకారణం’ అని లీవైన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోనూ తక్కువగా.. హైదరాబాద్ మహానగరంలో ఐటీతో పాటు వివిధరంగాల్లో ముఖ్యంగా రాత్రి పూట పనిచేసే వారిని, 30 ఏళ్లు ఆ పై వయసు పైబడ్డాక పెళ్లి చేసుకున్న వారిని, జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్న రోగుల్ని డాక్టర్లు పరిశీలించారు. వారికి తగిన పరీక్షలు చేసి, పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ట్రీట్మెంట్ ఇచ్చారు. ►పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత 32 ఏళ్ల వయసున్న సురేష్ కుమార్, 30 ఏళ్ల వయసున్న లక్ష్మీ (పేర్లు మార్చాం) తమకు పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ వద్దకు వెళ్లారు. వారికి ఇన్ఫెర్టిలిటీ ఎవల్యూయేషన్ చెకప్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా వారికి విడివిడిగా క్లినికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్‌లు నిర్వహించి సెమన్ అనాలిసిస్‌కు (వీర్యకణాల విశ్లేషణ) పంపించారు. సురేష్‌లో శుక్రకణాలు ఉండాల్సిన దాని కంటే చాలా తక్కు వగా ఉన్నట్టు ‘వలిగొ స్పెర్మటోజువా’ ద్వారా గుర్తించారు. జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. సరైన సమయానికి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సరైన నిద్ర, ఒత్తిళ్లను దూరం చేసే విధానాలు, తగిన వ్యాయామం వంటి వాటితో గణనీయమైన మార్పులు సాధించవచ్చునని సూచించారు. ►29 ఏళ్ల వెంకటేశ్వరరావు (పేరు మార్చాం)కు రెండేళ్ల క్రితమే పెళ్లి అయినా పిల్లలు పుట్టలేదు. ఇతను ప్రతిరోజూ రాత్రి 10, 11 గంటల దాకా వ్యాపారరీత్యా పనిలోనే ఉంటారు. ఆ తర్వాత అలసటకు గురికావడం, ఆలస్యంగా తిండి తిన డం, నిద్రపోవడం వల్ల వీర్యకణాలు అవసరమైన వాటికంటే చాలా తక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ముఖ్యమని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నందువల్ల వీలైనంత మేర ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మిగతా వారితో పోల్చితే 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నవారిలో వీర్యకణాల కౌంట్ బాగా తక్కువగా ఉంటోంది. వీరు నైట్ డ్యూటీల్లో పనిచేస్తుండడం, ఆహార అలవాట్లు మారడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతూకం కోల్పోయి మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో స్పెర్మ్‌కౌంట్ తగ్గడాన్ని మా పరిశీలనల్లో గమనించాం. ఒకవేళ కౌంట్ కావాల్సినంత ఉన్నా చురుకైన కదలికలు లేని వీర్యకణాలే ఎక్కువగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదు. – డా.కేవీ భార్గవ్‌రెడ్డి, మంగళగిరి ఎయిమ్స్. ఒత్తిళ్లు..ఊబకాయం అన్ని రంగాలు, వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జీవితం గడుపుతున్నారు. జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. 30 ఏళ్లలోపు వారికే షుగర్, బీపీ వస్తున్నాయి. దీనివల్ల రానురాను ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో, బయటా, పనిప్రదేశాల్లో వివిధ రూపాల్లో రేడియేషన్, యూవీ రేస్, కాలుష్య ప్రభావాలు పెరిగిపోయి కావాల్సిన సంఖ్యలో వీర్యకణాల ఉత్పత్తి జరగడం లేదు. – డా.ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ -
Health: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! డోనర్ స్పెర్మ్ ద్వారా
మాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. పిల్లల్లేరు. టెస్ట్స్ చేయించుకుంటే మా వారికి స్పెర్మ్ కౌంట్ తక్కువ అని తేలింది. డాక్టర్లు ఐవీఎఫ్ సూచించారు. మావారి స్పెర్మ్ కౌంట్ తగినంత లేదు కాబట్టి.. డోనర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు. – జి. మాలిని, బెంగళూరు Sperm Donor: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే కౌంట్‌ను పెంచడానికి కొన్ని మందులను డాక్టర్ సూచిస్తారు. అవి వాడిన మూడు నెలల తర్వాత మళ్లీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేస్తారు. అయితే అరుదుగా కొన్ని కేసెస్‌లో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా అంటే మంచి స్ట్రక్చర్ లేని స్పెర్మ్ ఉన్నప్పుడు వాటి మొటిలిటీ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు మందులతోటి ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతాయి. అలాంటి కేసెస్‌లో డోనర్ స్పెర్మ్‌ను సజెస్ట్ చేస్తారు. చాలాసార్లు స్పెర్మ్ డీఎన్ఏలో లోపాలు ఉన్నప్పుడు డోనర్ స్పెర్మ్‌ను సూచిస్తారు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో సక్సెస్ రేట్స్‌కి చాలా ఫ్యాక్టర్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ స్పెర్మ్ డీటైల్డ్ ఎనాలిసిస్ విత్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్టడీస్ వల్ల స్పెర్మ్ మార్ఫాలజీ కనిపెట్టవచ్చు. పదేపదే గర్భస్రావం అవుతుంటే ఈ స్పెర్మ్ స్ట్రక్చర్‌లో సమస్య ఉండొచ్చు. భర్తకు ఏదైనా జెనెటిక్ మెడికల్ కండిషన్ ఉన్నా.. స్పెర్మ్ క్వాలిటీ తగ్గినా.. డోనర్ స్పెర్మ్‌ను సూచిస్తారు. స్పెర్మ్ డోనర్స్ స్క్రీనింగ్ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. అని వైరల్ ఇన్ఫెక్షన్స్ స్క్రీనింగ్ చేస్తారు. స్పెర్మ్ 750 శాతం మొటైల్ 74 శాతం నార్మల్ మార్ఫాలజీ ఉండి కౌంట్ 39 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ 15 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, డీఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ 30 శాతం కంటే తక్కువ ఉంటే డోనర్ స్పెర్మ్ అవసరం ఉండదు. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త -
Corona Vaccine: లైంగిక సామర్థ్యం తగ్గుతోందా?
కొవిడ్-19 వ్యాక్సిన్లతో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోందనే నివేదికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకపక్క కరోనా నుంచి కోలుకున్న వాళ్ల కేసుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోందని, మగవాళ్లలో లైంగిక పటుత్వం.. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందన్న కథనాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లపై పరిశోధన చేసిన సైంటిస్టులు.. కంగారుపడాల్సిన అవసరం లేదని, అదంతా ఉత్త ప్రచారమేనని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన మియామి యూనివర్సిటీ ఈ మధ్యే 45 మంది వలంటీర్ల మీద అధ్యయనం నిర్వహించింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వీళ్లు ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నారు. వీళ్ల వీర్యకణాల్ని పరీక్షించిన పరిశోధకులు.. వ్యాక్సిన్‌తో సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం, వీర్యకణాలు తగ్గడం లాంటి ప్రచారాలను ఉత్తదేనని తేల్చారు. డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్స్ ప్రకారం జరిగిన ఈ స్టడీలో.. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు తీసుకున్నా వాళ్ల లైంగిక సామర్థ్యంలో ఎలాంటి మార్పులు కలగలేదని మియామీ పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ‘జామా’లో ఈ నివేదిక వివరాల్ని ప్రచురించారు. వ్యాక్సిన్‌తో మారిందా? టీకాకు ముందు, తర్వాత లైంగిక సామర్థ్య పరీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైజర్(బయోఎన్‌టెక్) టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాలను ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేసినవేకాగా, ఆ వ్యక్తుల వీర్యకణాల్లో బేస్‌లైన్ స్పెర్మ్ కాన్సెంట్రేషన్, టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియన్లు/ఎంఎల్, 36 మిలియన్లు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇక రెండో డోసు తర్వాత వారిలో వీర్యకణాల సంఖ్య స్వల్పంగా 30 మిలియన్లు/ఎంఎల్, టోటల్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగింది. టీకా తీసుకున్న తర్వాత ఎంత పరిమాణంలో వీర్యం ఉత్పత్తి అవుతున్నది, వీర్యకణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో ఈ స్టడీ ద్వారా నిర్ధారించారు. సిమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు. ఫ్యాక్ట్ చెక్.. చైనా నివేదిక వల్లే.. కరోనా మొదటి వేవ్ విజృంభణ టైంలో.. చైనా సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన నివేదిక రిలీజ్ చేశారు. కోవిడ్ జబ్బు సోకిన వాళ్లకు లైంగిక సామర్థ్యం తగ్గుతోందని, క్రమంగా వంధత్వం వస్తోందని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వృషణాల వాపును గుర్తించామని, మరికొందరిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిందని, ఇంకొందరిలో వీర్యకణాల్లో తెల్లరక్త కణాల సంఖ్య పెరగడం గమనించామని తెలిపారు. ఈ రిపోర్టుపై అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే కేవలం ఆరుగురు పేషెంట్ల మీద జరిగిన అధ్యయనం ఆధారంగా విడుదల చేసిన రిపోర్ట్‌కు శాస్త్రీయతను ఆపాదించడం సరికాదని పలువురు చైనీస్ సైంటిస్టులే ఆ సమయంలో ఆ నివేదికను తోసిపుచ్చారు కూడా. ఇప్పుడు ఆ నివేదికను అటు ఇటుగా మార్చేసిన కొందరు వ్యాక్సినేషన్‌పై ఉత్త ప్రచారాలతో బెదరగొడుతున్నారు. ఇక రష్యాలోనూ ఇలాంటి నివేదిక ఒకటి(ఫేక్) ప్రచారం కాగా.. నిర్ధారణ చేసుకోకుండా ఓ ప్రముఖ బ్రిటిష్ పత్రిక కథనం ప్రచురించడం మరింత గందరగోళానికి దారి తీసింది. చదవండి: వ్యాక్సిన్‌తో రెండేళ్లలో చావు గ్యారెంటీ! -
సంతాన యోగం!
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మరీ ముఖ్యంగా పురుషులు యోగా సాధన చేసేందుకు మరో బలమైన కారణాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న పురుషుల వీర్యం నాణ్యత పెంచేందుకు యోగా ఉపయోగపడుతుందని సీసీఎంబీ, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సంయుక్తంగా చేసిన పరిశోధన స్పష్టం చేసింది. మానవ జన్యు వ్యవస్థపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అనారోగ్యకర జీవనశైలి, దురలవాట్ల కారణంగా డీఎన్ఏలో రసాయన మార్పులు చో టుచేసుకుని వీర్యం నాణ్యత తగ్గుతుందని కూ డా వింటుంటాం. ఈ మార్పులను యోగాతో అ ధిగమించొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. ఆండొలోగియా జర్నల్ తాజా సంచికలో ప్ర చురితమైన దాని ప్రకారం వంధ్యత్వ సమస్యల తో బాధపడుతున్న పురుషులు యోగా ఆధారిత జీవనశైలి అలవర్చుకుంటే వీర్యకణాలు చురు గ్గా మారడంతో పాటు వీర్యంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు ఉన్న అవకాశాలు పెరుగుతాయి. సీసీఎంబీలో పరిశీలన.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో వంధ్యత్వ సమస్యలకు చికిత్స పొందుతున్న కొంతమందిని ఎంచుకుని తాము అధ్యయనం చేశామని సీసీఎంబీ శాస్త్రవేత్త సురభి శ్రీవాత్సవ తెలిపారు. వీరు రోజుకు గంట చొప్పున వేర్వేరు ఆసనాలు వేయడంతో పాటు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగా క్రియలను అనుసరించారు. యోగా కార్యక్రమంలో చేరే ముందు.. ఆ తర్వాత వీరి వీర్యాన్ని పరిశీలించగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయని శ్రీవాత్సవ వివరించారు. 400 జన్యువులు ఆన్/ఆఫ్ అయ్యేందుకు కీలకమైన మిథైలోమ్ను యోగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు. వీటిల్లో పురుషుల సంతాన లేమికి వీర్య ఉ త్పత్తికి ఉపయోగపడే జన్యువులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో గుర్తించిన జన్యువులపై మరి న్ని పరిశోధనలు జరపడం, వీర్యంపై యోగా ప్రభావంపై విస్తృత అధ్యయనం ద్వారా వంధ్య త్వ సమస్యలను అధిగమించేందుకు మెరుగైన మార్గం లభిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. యోగా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు ఏడాది తిరగకుండానే తండ్రులు అవుతుండటం విశేషం. -
జంక్‌ఫుడ్‌తో వీర్యకణాల తగ్గుదల!
జంక్‌ఫుడ్ కారణంగా ఎన్నో రకాల అనర్థాలు వస్తాయన్న సంగతి ఇప్పటికే చాలా పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. అయితే జంక్‌ఫుడ్ కారణంగా వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) తగ్గుతుందని ఇటీవలి తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్(యూఎస్)లోని హార్వర్డ్ టీ.హెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 3,000 మందికి పైగా యువకుల్లో ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 19 ఏళ్లు పైబడిన యువకులను నాలుగు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూపునకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు. వారి ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పండ్లు, నట్స్, గుడ్లు, తృణధాన్యాలు ఉండేలా చూశారు. అలాగే మరో గ్రూపునకు ఒకింత తక్కువ ఆరోగ్యకరమైన ఆహారం సమకూర్చారు. ఇలా మొదటి గ్రూపు మినహా ప్రతి గ్రూపునకూ కొంత పోషకాహారాన్ని తగ్గిస్తూ, జంక్‌ఫుడ్‌ను పెంచుతూ పోయారు. ఈ నాలుగు గ్రూపుల వీర్యనమూనాలను సేకరించి పరీక్షించగా... జంక్‌ఫుడ్‌ను తీసుకున్న గ్రూపుతో పోలిస్తే... పూర్తిగా అన్ని పోషకాలు ఉన్న మంచి సమతుహారాన్ని తీసుకున్న గ్రూపులోని యువకులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు చాలా బాగున్నట్లు తేలింది. జంక్‌ఫుడ్ తీసుకున్న గ్రూపుతో పోలిస్తే, మంచి ఆహారం తీసుకున్న గ్రూపులోని యువకుల వీర్యంలో వీర్యకణాల సంఖ్య దాదాపు 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంటే... జంక్‌ఫుడ్ తీసుకోవడం అన్న అంశం సంతానలేమికి ఎంతో కొంత దోహదం చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ వైజ్ఞానిక జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. -
నట్స్‌తో ఆ సమస్యలకు చెక్
లండన్ : రోజూ గుప్పెడు బాదం, వాల్నట్స్ వంటి గింజలతో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు 60 గ్రాముల పలు రకాల నట్స్ తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 16 శాతం పెరుగుతుందని ఈ అథ్యయనం పేర్కొంది. వీటితో వీర్య కణాల కదలికలు సైతం ఆరు శాతం మేర మెరుగవుతాయని ఫలితంగా పురుషుల్లో సంతాన సాఫల్యతకు ఉపకరిస్తాయని పరిశోధన తెలిపింది. నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో వీర్యకణాల వృద్ధి జరుగుతుందని పేర్కొంది. కాలుష్యం, పొగతాగడం, పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరడంతో స్ర్తీ, పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజా అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న 119 మందిని 14 వారాల పాటు పరిశీలించిన అనంతరం అథ్యయనం చేపట్టిన స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ రొవిర విర్గిల్ పరిశోధకులు ఈ అంశాలను గుర్తించారు. మరోవైపు రోజూ గుప్పెడు నట్స్ తీసుకోవడం ద్వారా వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతిని పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గడాన్ని నివారించవచ్చని వెల్లడైందని అథ్యయన రచయిత డాక్టర్ అల్బర్ట్ సలాస్ హ్యుటోస్ చెప్పారు. -
అతిగా టీవీ చూస్తే అంతే..
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు ఐదు గంటలు మించి టీవీ చూసే పురుషులను తాజా అథ్యయనం హెచ్చరించింది. అతిగా టీవీ చూసే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 35 శాతం పైగా తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అతిగా టీవీ చూడటం అధిక క్యాలరీలతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడానికి, సోమరితనానికి దారితీస్తుందని పేర్కొంది. టీవీలకు అడిక్ట్ వాయిన వారి వీర్యకణాల సంఖ్య చురుకుగా ఉండే వారితో పోలిస్తే 38 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. వారానికి కనీసం 15 గంటల వ్యాయామం లేదా ఆటల్లో పాల్గొనే వారిలో శారీరకంగా చురుకుగా లేనివారి కన్నా వీర్యకణాల సంఖ్య మెరుగ్గా ఉన్నట్టు తేలిందని నిపుణులు చెప్పారు. అయితే అధిక వ్యాయామంతో పాటు అతిగా టీవీ చూడటం శరీరంలో ఫ్రీ రాడికల్స్ వ్యాప్తి చెంది మృత కణాలు పేరుకుపోతాయని, వీర్యకణాలు తగ్గి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని అథ్యయనం హెచ్చరించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
ప్యాంట్ జేబులో సెల్ 'బాంబ్'
మీరు సెల్ ఫోన్ ప్యాంట్ జేబులో స్టయిలిష్ గా పెట్టుకుని తిరుగుతున్నారా? అయితే ఆ పనిని తక్షణమే మానేయండి. ఎందుకంటే సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మగవారికి వంధ్యత్వం వస్తుంది. ఈ విషయం బ్రిటన్ లో జరిగిన ఒక పరిశోధన లో వెల్లడైంది. ఈ రేడియేషన్ వీర్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ కి చెందిన బయో సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ ఫియోనా మాథ్యూస్ ఈ విషయాన్ని తెలియచేశారు. ఇప్పటికే ఎంతో కొంత వంధ్యత్వం ఉన్న వారికి, ప్రారంభ దశలో ఉన్న వారికి సెల్ ఫోన్ రేడియేషన్ మరింత చేటు చేస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా 14 శాతం మంది పురుషుల్లో సంతాన హీనత సమస్య ఉంది. సెల్ రేడియేషన్ కూడాదీనికి ఒక ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొంటోంది. ఈ పరిశోధనలో వీర్య కణాల కదలికలు, అవి జీవించే కాలం, వీర్యకణాల సంఖ్య ఆదారంగా వీర్యం నాణ్యతను అంచనా వేశారు. సెల్ ఫోన్ జేబులో ఉంచుకునే వారిలో, ఉంచని వారిలో స్పెర్మ్ క్వాలిటీ ఎలా ఉందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. సెల్ ఫోన్ రేడియేషన్ వీటిని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాథ్యూస్ చెబుతున్నారు.