
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు ఐదు గంటలు మించి టీవీ చూసే పురుషులను తాజా అథ్యయనం హెచ్చరించింది. అతిగా టీవీ చూసే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 35 శాతం పైగా తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అతిగా టీవీ చూడటం అధిక క్యాలరీలతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడానికి, సోమరితనానికి దారితీస్తుందని పేర్కొంది. టీవీలకు అడిక్ట్ వాయిన వారి వీర్యకణాల సంఖ్య చురుకుగా ఉండే వారితో పోలిస్తే 38 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
వారానికి కనీసం 15 గంటల వ్యాయామం లేదా ఆటల్లో పాల్గొనే వారిలో శారీరకంగా చురుకుగా లేనివారి కన్నా వీర్యకణాల సంఖ్య మెరుగ్గా ఉన్నట్టు తేలిందని నిపుణులు చెప్పారు. అయితే అధిక వ్యాయామంతో పాటు అతిగా టీవీ చూడటం శరీరంలో ఫ్రీ రాడికల్స్ వ్యాప్తి చెంది మృత కణాలు పేరుకుపోతాయని, వీర్యకణాలు తగ్గి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని అథ్యయనం హెచ్చరించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment