మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? | Men Hot Water Baths Can Reduce Fertility Sperm Count | Sakshi
Sakshi News home page

మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Tue, Jan 23 2024 2:15 PM | Last Updated on Tue, Jan 23 2024 2:17 PM

Men Hot Water Baths Can Reduce Fertility Sperm Count - Sakshi

చలికాలం వచ్చినా లేదా కొందరి మగవాళ్లకు వేడినీటితోనే స్నానం చేయడం నచ్చుతుంది. అంతేగాదు కొందరికి అలా వేడినీటితో స్నానం చేస్తే హాయిగా రిలీఫ్‌ ఉంటుంది. నిద్ర కూడా గమ్మున పడుతుందన్న భావన కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవాళ్లు రోజంతా బయట తిరిగి అలసటతో ఇంటికి వస్తారు కాబట్టి.. కాసేపు అలా వేడినీటితో స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉన్నట్లు ఫీలవ్వుతారు. కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో చెయొద్దని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పైగా రోజూ మగవాళ్లు వేడినీటి స్నానాలు చేయకపోవడమే మంచిదని చెబతున్నారు. ఎందుకని? రీజన్‌ ఏంటీ?

వేడినీటి స్నానం ఇష్టపడే పురుషులకు సంతానోత్పత్తి అవకాశాలను తక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దీని కారణంగా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం లేదా వాటి నాణ్యత తగ్గి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. వారానికి కనీసం 30 నిమిషాల పాటు అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీటితో స్నానం చేసిన పురుషుల వీర్యాన్ని నమనాలను పరీక్షించగా..వాటి చలనశీలత రేటు పేలవంగా ఉండటమే గాక తక్కువ స్పెర్మ్‌ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యూనివిర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా యూరాలజిస్ట్‌లు సంతోనోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పురుషులు వేడినీటితో ఎక్కువగా స్నానం చేయడం కారణంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిర్థారించారు. 

ఇదేలా స్పెర్మ్‌ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందంటే..
పరిశోధనల్లో ఉష్ణోగ్రత, టెస్టోస్టెరాన్‌, వృషణాలు, స్క్రోటమ్‌తో బంధన సంబధాన్ని కలిగి ఉంటుందని తేలింది. బాహ్యంగా ఉండే వృషణాలు సుమారు 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సెర్మ్‌ , ఇతర హార్మోనలను విడుదల చేయగలదు. అయితే శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలోనే ఈ వృషణాల్లోని జెర్మ్‌ కణాలు ఉంటాయి. కాబట్టి కొద్ది మోతాదులోని ఉష్ణోగ్రత పెరుగుదలే స్పెర్మ్‌, టెస్టోస్టెరాన్‌ల రెండింటిపే గణనీయమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎప్పుడైతే అధిక వేడికి వృషణాలు గురవ్వుతాయో అప్పుడూ..డీఎన్‌ఏ నిర్మాణం, స్పెర్మ్‌ నాణ్యతపై ప్రభావం చూపి వాటి పరిమాణాలలో అసాధారణతలకు దారితీస్తుంది. దీంతో స్పెర్మ్‌ సమర్థవంతంగా కదలక ఫలదీకరణం చెందించలేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఫలదీకరణం చెంది గర్భం దాల్చినా..పుట్టబోయే సంతానంలో జన్యుపరమైన లోపాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లో వేడినీటితో పదే పదే స్నానం చేయడం మగవాళ్లలోని వృషణాలపై అధిక ప్రభావం చూపి సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అంతేగాదు మగవాళ్లలోని వంధ్యత్వం అనే సమస్యకు పూర్తిస్థాయిలో చికిత్స లేనప్పటికీ ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మార్గాలు మాత్రం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

వాటిలో కొన్ని.. 

  • క్రమం తప్పకుండా వ్యాయామం
  • విటమిన్‌ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి. 
  • ఒత్తిడి మీ లైంగిక సామర్థ్యంపై అధికంగా ప్రభాం చూపిస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. 
  • జింక్‌ ఉండే మాంసం, చేపలు, గుడ్లు, షెల్ఫిష్‌ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ స్థాయిలను , స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే జింక్‌ సప్లిమెంట్‌లను తీసుకోవాలి.
  • అధిక బరువు కూడా వంధ్యత్వానికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు
  • మద్యం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

తదితర జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించగలరిని వైద్యులు చెబుతున్నారు. 

(చదవండి: అక్కినేని ఫ్యామిలీ కిచెన్‌ గార్డెన్‌..వాళ్ల గ్లామర్‌ రహస్యం ఇదేనా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement