సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. నెల నెల పెన్షన్లలో కోతలు విధిస్తోంది ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడుతోంది.
గత నెల కంటే ఈ నెల పెన్షన్లు మళ్లీ తగ్గాయి. అక్టోబర్ నెలకి 64,38,884కు పెన్షన్లను తగ్గించింది ప్రభుత్వం. సెప్టెంబర్‌లో 64,61,485 మందికి పెంషన్లు మంజూరు చేయగా.. ఈ నెల 64,38,884కే పెన్షన్లు అందించింది. ఈ ఏడాది మేలో 65,49,864 పెన్షన్లు ఉండగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 11 వేలు మంది పెన్షన్లను తొలగించేసింది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకుండా ఉన్నవాటిని ప్రభుత్వం తగ్గిస్తుండటంపై పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment