
సెల్లు వచ్చే.. పని సులువాయే..
కాలం మారిపోయింది.. సెల్‌ఫోన్ దేహంలో భాగమైపోయింది.. ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు.. అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! నాలుగు వీధులు తిరిగి చిత్తుకాగితాలు ఏరుకునేవారు సైతం సెల్‌ఫోన్‌లోనే పనులు చక్కబెడుతున్నారు. కోఠి ప్రాంతంలో వీధుల్లో చెత్త ఏరుకునే మహిళ ఇలా సెల్‌లో మాట్లాడుతూ వెళుతోంది.