న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ఖరారులో జరుగుతున్న ఆలస్యంపై ఇద్దరు జడ్జీల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ఇలాంటి వాటిపై న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోకూడదని, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) కేసులోనే రాజ్యంగ ధర్మాసనం ఇందుకు సంబంధించిన చట్టానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఎంఓపీ అంశాన్ని న్యాయ వ్యవస్థ తరఫు నుంచి పరిశీలిస్తామని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 27న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment