న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖేహర్ నియామకాన్ని అడ్డుకునేందుకు ఎన్ జేఏసీ తీర్పును సాకుగా చూపడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘ఎన్ జేఏసీ తీర్పు’లో జస్టిస్ ఖేహర్ కీలక పాత్ర పోషించినందున సీజేఐగా ఆయన నియామకం చెల్లదంటూ పలువురు లాయర్లు వేసిన పిటిషన్ ను జస్టిస్ ఆర్‌కే అగర్వాల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేసింది.
నాడు తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఖేహర్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అందులో నలుగురు ఎన్ జేఏసీకి వ్యతిరేకించగా, ఒక జడ్జి ఎన్ జేఏసీకి మద్దతిచ్చినట్లు పేర్కొంది.