
మిశ్రాపై కేసు ఉపసంహరణ
బెంగళూరు: భారత క్రికెటర్ అమిత్ మిశ్రా తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసిన మహిళ ఆ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్‌లో మిశ్రా తనపై దాడి చేశాడని మూడు రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ‘మేమిద్దరం స్నేహితులం. గొడవ పడ్డాం. తిరిగి కలిసిపోతాం. తనని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే కేసును ఉపసంహరించుకుంటున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడి, బలవంతం లేదు’ అని ఆమె తెలిపింది.