woman complaint
-
మహిళను వంచించి.. పెళ్లొద్దన్న ఎంపీ కుమారుడు!
సాక్షి,బళ్లారి: బళ్లారి లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప తనయుడు రంగనాథ్‌పై వంచన కేసు నమోదైంది. శుక్రవారం బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్– 420, 417, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. వివరాలు.. మైసూరు మహారాజా కాలేజీలో ఎంపీ తనయుడు రంగనాథ్ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకుని వదిలేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని తెలిపింది. నాకూ ఫోన్ చేసింది: ఎంపీ ఈ ఘటనపై ఎంపీ దేవేంద్రప్ప దావణగెరె జిల్లా అరసికెరెలో స్పందించారు. తన కుమారుడిపై కుట్రతో కేసు నమోదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం ఓ మహిళ తనకు కూడా ఫోన్ చేసి తన కొడుకు గురించి ఫోన్లో చెప్పిందన్నారు. అయితే తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టులు ఉన్నాయని సూచించానన్నారు. ఆమె డబ్బు కోసం బెదిరిస్తోంది: రంగనాథ్ మైసూరు: డబ్బుల కోసం యువతి ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తోందని మైసూరులోని మహారాజ కళాశాల లెక్చరర్ రంగనాథ్ (42) విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. తన స్నేహితుడు అయిన కల్లేష్ అనే వ్యక్తి నుంచి దేవిక (24) అనే యువతి పరిచయమైంది. 2, 3 సార్లు ఆమె కలిసిన తరువాత ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ నేను ప్రేమించడం లేదని చెప్పినట్లు రంగనాథ్ అన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసగించాడు బనశంకరి: బళ్లారి ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ అమ్మనాన్నకు పరిచయం చేస్తానని తెలిపి ప్రైవేటు హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నారని ఓ యువతి ఆరోపించింది. వివాహం చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశాడని శుక్రవారం బెంగళూరు బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. తరువాత ఆమె విలేకరులతో మాట్లాడింది. అతనికి గతంలోనే వివాహమైనట్లు తనకు తెలియదన్నారు. పెళ్లి చేసుకోవాలని నేను ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు, డబ్బు ఇస్తాను, నన్ను వదిలి వెళ్లిపో అని ఒత్తిడి చేశాడని ఆమె పేర్కొంది. -
ఆగిన మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లి
తమిళ సినిమా(చెన్నై): బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం శనివారం అర్థంతరంగా నిలిచిపోయింది. ఓ యువతిని రేప్, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో విచారణ కోసం పోలీసులు ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని బాధితురాలు ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. తాను గర్భం దాల్చడంతో గర్భస్రావమయ్యేలా ఏవో మందులు ఇచ్చాడని వెల్లడించింది. తన కుమారుడ్ని వదిలేయకుంటే తీవ్ర పర్యావసానాలు ఉంటాయని మహాక్షయ్ తల్లి యోగితా బాలీ తనను బెదిరించినట్లు వాపోయింది. దీంతో ప్రాణాలు రక్షించుకోవడం కోసం ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయివచ్చినట్లు పేర్కొంది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుపై మిథున్ కుటుంబాన్ని విచారించేందుకు పోలీసులు శనివారం తమిళనాడులోని ఊటీలో ఉన్న వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. -
పిల్లల్ని చంపేస్తానంటూ లైంగిక దాడి చేశాడు
పంజగుట్ట:నన్ను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన బాధితురాలు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని కొద్దిరోజుల తరువాత సింగరేణి ఉద్యోగి, సింగరేణి అధికార సంఘం నాయకుడు సుంకరి ప్రతాప్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు.పెళ్లి చేసుకోకుంటే తనను, తన పిల్లల్ని చంపేస్తానంటూ బెదిరించాడని వాపోయింది. ఫిబ్రవరి 20న ప్రతాప్ అతని కారులో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల తన కూతురును కారులో ఎక్కించుకొని ఫోన్ చేసి బెదిరించి వచ్చి కారులో కూర్చోవాలని బెదిరించాడని పేర్కొంది. అతను చెప్పినట్లు చేయగా కొండగట్టుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించి సత్రంలో బంధించి లైంగికదాడి చేశాడన్నారు. అలాగే వేముల వాడ, భద్రాచలం తిప్పాడన్నారు. తరువాత గోదావరిఖనికి తీసుకెళ్లి స్నేహితుల ఇంట్లో ఉంచి డ్యూటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. న్యాయంచేయాలని వారింటికి వెళితే ప్రతాప్ కొడుకులు సుంకరి కిరణ్, సుంకరి కిశోర్ నన్ను, నా కూతురును చితకబాది రూమ్‌లో బంధించి ఈ విష యం బయటకు చెబితే చంపేస్తానని అర్థరాత్రి విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. హైకోర్టు న్యాయవాది టీవీ నాగమణి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌పై చర్చ.. 'చెడు దృష్టితో వదంతులు..'
సాక్షి, టీ.నగర్: రాష్ట్రంలో ఇటీవల గవర్నర్‌పై ఏర్పడిన చర్చకు రాజ్‌భవన్ శనివారం వివరణ ఇచ్చింది. రాష్ట్ర గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్ పదవి చేపట్టిన నాటి నుంచి రాజకీయాలలో సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. ప్రస్తుతం ఫుల్‌టైం గవర్నర్‌గా నియమించబడడంతో ఆయనపై అన్ని వర్గాలు ఎన్నో అంచనాలు పెంచుకున్నాయి. ఆరంభంలో ఆయన రాజ్‌భవన్‌కే పరిమితమయి అధికారుల ద్వారా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల పరిశీలన చేపట్టారు. ఆ తర్వాత కన్యాకుమారి వెళ్లి బాధితుల స్థితిగతుల గురించి తెలుసుకుని పరామర్శించారు. ఢిల్లీలో తుపాను నష్టాన్ని గురించి నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇలాఉండగా శుక్రవారం గవర్నర్ పురోహిత్ కడలూరును సందర్శించి పరిశీలన చేపట్టారు. అక్కడ గవర్నర్ పరిశీలనకు వ్యతిరేకత తెలుపుతూ డీఎంకే, వీసీకే పార్టీలు ఆందోళనలు జరిపాయి. మహాబలిపురం సమీపాన గవర్నర్‌ను సాగనంపి వెనుదిరిగిన పోలీసు వాహనం ఢీకొనడంతో ముగ్గురు బలిౖయెన సంఘటన, గవర్నర్ మరుగుదొడ్డిని తిలకించిన సంఘటనలు కొత్త వివాదానికి దారితీశాయి. ఇందుకు రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. గవర్నర్ కాన్వాయ్ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇందులో వాస్తవాలు లేవని తెలిపింది. స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించే ప్రాంతాన్ని తిలకించినట్లు, దీన్ని చెడు దృష్టితో పలువురు వదంతులు వ్యాపింపజేశారని పేర్కొన్నారు. మరుగుదొడ్డి ఖాళీగా ఉన్నట్లు ధ్రువపరచుకున్న తర్వాతనే మహిళా డీఆర్వో వెనుక కలెక్టర్, గవర్నర్ మరుగుదొడ్డి వద్దకు వెళ్లినట్లు రాజ్‌భవన్ వివరించింది. ఇలావుండగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మీడియాపై గవర్నర్ పురోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి దాదాపై చర్యలకు కిరణ్‌బేడీ ఆదేశాలు: రూ.22 కోట్ల ఇళ్ల స్థలాల అపహరణకు సంబంధించి పుదుచ్చేరి దాదాపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్ కిరణ్‌బేడి ఆదేశాలిచ్చారు. చెన్నై పెరుంగుడి తిరుమలైనగర్‌కు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి రత్నవేలు (59) సహా మరికొందరు తాము కొనుగోలు చేసిన రూ.22 కోట్ల ఇళ్ల స్థలాలను పుదుచ్చేరికి చెందిన దాదా తట్టాంజావడి సెంథిల్ కబ్జా చేసినట్లు కిరణ్‌బేడికి ఫిర్యాదు అందింది. దాదాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షాకింగ్ : నేను స్నానం చేస్తుంటే గవర్నర్ చూశారు..! -
'ఆమెకు కేసులు పెట్టడం అలవాటు'
విజయవాడ: విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ పక్కదారి పట్టే వ్యక్తి అని ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్‌పై కేసు పెట్టిన మహిళ ‘పర్వర్టెడ్ ఫెమినిస్టు’ అని వ్యాఖ్యానించారు. ఆవిడకు కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఢిల్లీ రెస్టారెంట్లో కాలు తగిలిందని 70 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు పెట్టిన చరిత్ర ఆమెకు ఉందని చెప్పారు. 55 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారనడం నమ్మశక్యంగా లేదన్నారు. దీన్ని పట్టుకుని మహిళా సంఘాలు దుమ్మెత్తిపోయడం దారుణమని అన్నారు. -
కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు
హైదరాబాద్: విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసుపై ఆయన వివరణ కోరుతున్నట్లు డీసీపీ చెప్పారు. ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చంటిబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
'టీడీపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి'
► టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ధర్నా ► విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్ ► మేయర్ కారును అడ్డుకున్న మహిళా సంఘాలు ► అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం, అరెస్ట్ ► సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు వ్యతిరేకంగా శనివారం మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా కార్పొరేటర్ చంటిబాబు ప్రవర్తించడంతో మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. మేయర్ కారును మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. తక్షణమే కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చంటిబాబుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు
విజయవాడ :విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజ్ఞాన యాత్రకు వెళ్లిన టీడీపీ కార్పొరేటర్ చంటిబాబు విమానంలో చేసిన పోకిరీ చేష్టలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. గత నెల 29న విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం ఢిల్లీ నుంచి శుక్రవారం తిరుగు ప్రయాణం కట్టారు. కొందరు టీడీపీ కార్పొరేటర్లు విమానం, మరికొందరు రైల్లో బయలుదేరారు. అయితే చంటిబాబు విమానంలో పక్క సీట్లో ఓ మహిళ ఉన్నారు. తనతో చంటిబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గన్నవరం సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగింది. విమానం గన్నవరం చేరుకోగానే సదరు కార్పొరేటర్‌ను సెక్యూరిటీ అధికారులు చుట్టుముట్టారు. అనూహ్య పరిణామంతో టీడీపీ కార్పొరేటర్లు కంగుతిన్నారు. అందరూ కలిసి ఉంటే బుక్కైపోతామని భావించారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును చంటిబాబు వద్ద ఉంచి మిగితా వారంతా బయటకు వచ్చేశారు. అనంతరం ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి చంటిబాబును అక్కడ నుంచి తప్పించారు. గతనెల 30వ తేదీన పూణే లో ఓ కార్పొరేటర్ ట్రయిన్లో మద్యం సేవించి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కార్పొరేటర్ల ఆగడాలతో తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు కనీసం ఖండన ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే చంటిబాబును వదిలేశారని గన్నవరం పోలీసులపై విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావటం వల్లే అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. మహిళలతో టీడీపీ కార్పొరేటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏంటా యాపారం !?
ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుపై శ్రీకాకుళంలో మహిళ ఫిర్యాదు దీనిపై జిల్లాలో విస్తృతమైన చర్చ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏంటీ ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ ప్రాజెక్టు? ఆ వ్యాపారం మతలబేంటి? ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి చేసిన ఫిర్యాదు వెనక సీరియసేంటి? అందులో ఎమ్మెల్యే కేఏ నాయుడు పాత్రేంటి? వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడిదే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిపై శ్రీకాకుళం ఎస్పీకి ఛాయాకుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఈ జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. ఇప్పటికే చెక్‌బౌన్స్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజా కేసు ఇరుకున పెట్టేదిలా కనిపిస్తోంది. అన్నిట్లోనూ... ఆయనే... జిల్లాలో చాలా దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేగా కె.ఎ.నాయుడిపై ముద్ర ఉంది. అంగన్వాడీ నియామకాలు... విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో ఆయనదే పైచేయి. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాల్లోనూ ఆయన హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. దారికి తెచ్చుకునే వ్యూహంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జెడ్పీ సమావేశాల్లో గళమెత్తుతారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఆయనపై చెక్‌బౌన్స్ కేసులున్నాయి. కొంతకాలం నుంచి ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. టీడీపీ గ్రూపు రాజకీయాల్లోనూ ఆయనది కీలకపాత్రే. ఇలా...అన్నింటికీ కేంద్రబిందువు అవుతున్న ఆయనపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీకి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఇందులోనూ ఈయన హస్తముందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పినందునే రెండు విడతలుగా రూ. 10లక్షలు వరకు బ్యాంకు ఖాతాలో వేశానని, ఆయనతో పలు పర్యాయాలు ఫోన్లో మాట్లాడానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనడంపై ఎంతమేరకు నిజముందో తెలీదుగానీ, విషయం విన్న అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
మహిళకు లైంగిక వేధింపులు.. నలుగురి అరెస్ట్
కుత్బుల్లాపూర్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు ఆకతాయిలు ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... భాగ్యలక్ష్మీ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఇంట్లో పైఅంతస్తులో అద్దెకు ఉండే నలుగురు యువకులు ఈ నెల 18న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తలుపులు తెరచుకుని లోపలికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మిశ్రాపై కేసు ఉపసంహరణ
బెంగళూరు: భారత క్రికెటర్ అమిత్ మిశ్రా తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసిన మహిళ ఆ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్లో మిశ్రా తనపై దాడి చేశాడని మూడు రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ‘మేమిద్దరం స్నేహితులం. గొడవ పడ్డాం. తిరిగి కలిసిపోతాం. తనని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే కేసును ఉపసంహరించుకుంటున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడి, బలవంతం లేదు’ అని ఆమె తెలిపింది. -
యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు
బెర్లిన్: ఇదో విచిత్ర సంఘటన. జర్మనీలో జరిగిన అత్యంత అరుదైన దృశ్యం. వినేవాళ్లు హవ్వా అనాల్సిందే. ఎందుకంటే నేరం చేసిన వాళ్లనే పట్టుకునేందుకు చేతగాని పోలీసులు ఓ ఆటవిక ప్రాణిని అరెస్టు చేశారు. పోని ఓ భారీ ప్రాణినా అంటే అది కూడా కాదు. ఒక్కసారి చేయి విదిలేస్తే పారిపోయి చెట్టెక్కి కూర్చునే అల్పప్రాణిని. మరోసారి ఆ ఆ దిక్కు చూస్తే అదిరిపోయి గుండెచేతపట్టుకుని పారిపోయే చిన్నజీవిని. మనకు అత్యంత సుపరిచితమైన జీవిని. ఇంకా చెప్పాలంటే శ్రీరాముడికి తనకు చేతనైనంత సాయం చేసి ఆయన చేతి స్పర్శను తాకిన గొప్ప ప్రాణిని. అదే.. ఉడుత. అసలు విషయానికి వస్తే జర్మనీలో ఓ ఉడుత ఇప్పుడు జైలు పాలయింది. చక్కగా అక్కడా ఇక్కడా గెంతులు పెడుతూ హుషారుగా తిరగాల్సిన అది చెరసాలలో బిక్కుబిక్కుమంటూ తిండీతిప్పలు మాని కూర్చుంది. నార్త్ రైన్ వెస్ట ఫాలియాలోని బోట్రాప్ నగరంలో ఓ యువతి చేసిన ఫిర్యాదే దానికి శిక్షగా మిగిలింది. ఓ ఉడుత తనను బాగా ఫాలో అవుతుందని, తాను ఎటు వెళితే అటువస్తుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ముందు లైట్‌గా తీసుకున్న పోలీసులు ఆమె నాన్ స్టాఫ్‌గా ఫోన్ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో వెళ్లి దానిని బంధించారు. అనంతరం తీసుకొచ్చి జైలు బోనులో పెట్టారు. అది చిక్కిపోయినట్లు కనిపించడంతో దానికోసం ప్రత్యేకంగా పోలీసు కాపలా ఉండి దానికి ఆహారం పెట్టి పోషిస్తున్నారు. -
'ఎస్ఐ నుంచి రక్షణ కల్పించండి'
హైదరాబాద్ : తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులపై పెట్టిన కేసును ఉపషంహరించుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మార్చి 13లోపు నివేదిక ఇవ్వాలని అల్వాల్ ఏసీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే అల్వాల్ కు చెందిన ఓ మహిళ (27) భర్తతో గొడవలు జరగటంతో కొద్దికాలం నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. ఇదే అదనుగా భావించిన అల్వాల్ ఎస్ఐ నర్సింహ అనుచరులు నరేష్, సురేందర్‌లు జనవరి 26న ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయంపై 28న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా... నరేష్, సురేందర్లపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్ఐ నర్సింహా పలుమార్లు ఆమె సెల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. ఎస్ఐ నుంచి తన ప్రాణాలకు హాని ఉందని, తనకు వెంటనే రక్షించడంతో పాటు ఎస్ఐతో పాటు అత్యాచారయత్నం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కరింది. అల్వాల్ ఏసీపీ విచారణ చేస్తున్నారు.