'ఆమెకు కేసులు పెట్టడం అలవాటు' | tdp mlc yvb rajendra prasad comments over vijayawada corporator allegations | Sakshi
Sakshi News home page

'ఆమెకు కేసులు పెట్టడం అలవాటు'

Published Mon, May 16 2016 8:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

tdp mlc yvb rajendra prasad comments over vijayawada corporator allegations

విజయవాడ:  విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ పక్కదారి పట్టే వ్యక్తి అని ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్‌పై కేసు పెట్టిన మహిళ ‘పర్వర్టెడ్ ఫెమినిస్టు’ అని వ్యాఖ్యానించారు. ఆవిడకు కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఢిల్లీ రెస్టారెంట్లో కాలు తగిలిందని 70 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు పెట్టిన చరిత్ర ఆమెకు ఉందని చెప్పారు. 55 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారనడం నమ్మశక్యంగా లేదన్నారు. దీన్ని పట్టుకుని మహిళా సంఘాలు దుమ్మెత్తిపోయడం దారుణమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement