హైదరాబాద్ : తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులపై పెట్టిన కేసును ఉపషంహరించుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మార్చి 13లోపు నివేదిక ఇవ్వాలని అల్వాల్ ఏసీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే అల్వాల్ కు చెందిన ఓ మహిళ (27) భర్తతో గొడవలు జరగటంతో కొద్దికాలం నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది.
ఇదే అదనుగా భావించిన అల్వాల్ ఎస్ఐ నర్సింహ అనుచరులు నరేష్, సురేందర్లు జనవరి 26న ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయంపై 28న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా... నరేష్, సురేందర్లపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్ఐ నర్సింహా పలుమార్లు ఆమె సెల్కు ఫోన్ చేసి బెదిరించాడు. ఎస్ఐ నుంచి తన ప్రాణాలకు హాని ఉందని, తనకు వెంటనే రక్షించడంతో పాటు ఎస్ఐతో పాటు అత్యాచారయత్నం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కరింది. అల్వాల్ ఏసీపీ విచారణ చేస్తున్నారు.