మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు
పంజగుట్ట:నన్ను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన బాధితురాలు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని కొద్దిరోజుల తరువాత సింగరేణి ఉద్యోగి, సింగరేణి అధికార సంఘం నాయకుడు సుంకరి ప్రతాప్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు.పెళ్లి చేసుకోకుంటే తనను, తన పిల్లల్ని చంపేస్తానంటూ బెదిరించాడని వాపోయింది.
ఫిబ్రవరి 20న ప్రతాప్ అతని కారులో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల తన కూతురును కారులో ఎక్కించుకొని ఫోన్ చేసి బెదిరించి వచ్చి కారులో కూర్చోవాలని బెదిరించాడని పేర్కొంది. అతను చెప్పినట్లు చేయగా కొండగట్టుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించి సత్రంలో బంధించి లైంగికదాడి చేశాడన్నారు. అలాగే వేముల వాడ, భద్రాచలం తిప్పాడన్నారు. తరువాత గోదావరిఖనికి తీసుకెళ్లి స్నేహితుల ఇంట్లో ఉంచి డ్యూటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. న్యాయంచేయాలని వారింటికి వెళితే ప్రతాప్ కొడుకులు సుంకరి కిరణ్, సుంకరి కిశోర్ నన్ను, నా కూతురును చితకబాది రూమ్‌లో బంధించి ఈ విష యం బయటకు చెబితే చంపేస్తానని అర్థరాత్రి విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. హైకోర్టు న్యాయవాది టీవీ నాగమణి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment