అనంతపురం జిల్లా కణేకల్ సమీపంలో ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం బైక్ కల్వర్ట్లో పడిపోయింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా ఆ యువకులు అప్పటికే మరణించారు.
దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకులు మృతదేహలను పోస్ట్మార్టం నిర్వహించేందుకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.