under 14
-
ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్‌లో ప్రణీత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు. టీమ్ విభాగంలో భరత్ సుబ్రమణ్యం, రాహిల్, సాహిల్ డే, దేవ్ షా, సౌహార్దో బసక్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు 15 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. 14 పాయింట్లతో ఇరాన్ ‘ఎ’ రన్నరప్‌గా... వి.ప్రణీత్, తన్మయ్ జైన్, కదమ్ ఓం మనీశ్, రోహిత్, శ్రేయస్‌లతో కూడిన భారత్ ‘బి’ జట్టుకు మూడో స్థానం లభించింది. మొత్తం 32 ఆసియా దేశాలు ఈ టోరీ్నలో పాల్గొన్నాయి. -
అండర్–14 చాంప్స్ అర్జున్, జిషిత
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జిషిత ఆకట్టుకున్నారు. అండర్–14 ఓపెన్ విభాగంలో అర్జున్... అండర్–14 బాలికల విభాగంలో జిషిత అగ్రస్థానాన్ని సంపాదించారు. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అర్జున్ తొమ్మిది రౌండ్లకుగాను 6.5 పాయింట్లు సంపాదించి ఓవరాల్‌గా 16వ స్థానంలో... తన విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. జిషిత 5.5 పాయింట్లు సంపాదించింది. ఆమె ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయింది. అండర్–14 ఓపెన్ విభాగంలో హైదరాబాద్‌కే చెం దిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–20 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. -
విజేత ఆల్‌సెయింట్స్
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆల్సెరుుంట్స్ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్‌సెయింట్స్ జట్టు 79 పరుగుల తేడాతో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పి. శివ (78) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. జఫర్ (37 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రణవ్ వర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌ను అద్భుతమైన బౌలింగ్‌తో శివ (5/13)కట్టడి చేశాడు. శివ ధాటికి ఆ జట్టు 33 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ప్రణవ్ వర్మ (27), రోహిత్ రెడ్డి (23) పర్వాలేదనిపించారు. ఈ టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శివకు ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలు లభించగా... హెచ్‌పీఎస్, రామాంతపూర్ జట్టు బౌలర్ దుర్గబాలాజీకి ‘బెస్ట్ బౌలర్’ అవార్డు దక్కింది. -
గెలుపే లక్ష్యంగా ఆడండి
కణేకల్లు : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గెలుపే లక్ష్యంగా ఆడాలని తహసీల్దార్ ఆర్.వెంకటశేషు క్రీడాకారులకు సూచించారు. అండర్–14, అండర్–17 క్రీడాకారులకు జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా జట్టుకు కణేకల్లులో ప్రత్యేకశిక్షణ ఇచ్చింది. శుక్రవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ శిక్షణలో ఎటువంటి లోటుపాట్లురాకుండా చూసిన పీడీ గోపాల్‌రెడ్డి కషిని అభినందించారు. ఎస్ఐ యువరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, పీడీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వేలూరు మరియప్ప, సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ జిల్లా ట్రెజరర్ కేశవమూర్తి, సాఫ్ట్‌బాల్ కోచింగ్ పర్యవేక్షకులు సత్యనారాయణ, హెచ్ఎం సూర్యనారాయణ, ఆర్డీటీ ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ హనుమంతరాయుడు, ఏటీఎల్ సురేంద్ర, కోచ్‌లు షాకీర్, మల్లికార్జునలు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పూర్తి
ఉయ్యూరు : సాఫ్ట్‌బాల్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పురుషోత్తమ్ తెలిపారు. స్థానిక ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో 2016–17 సంవత్సరానికి ఎస్జీఎఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక శనివారం నిర్వహించారు. అండర్ 14, 17 విభాగాల్లో జట్ల వివరాలను పురుషోత్తమ్ వెల్లడించారు. అండర్ 14లో.. బాలుర విభాగంలో : జి.గోపీకృష్ణ, కె.హేమంత్, ఎ.మణికంఠ, ఎం.శశికుమార్, ఎస్.వంశీ, బి.రమేష్, సీహెచ్ వీరనారాయణ, కె.సురేంద్రబాబు, బి.నాగవరప్రసాద్, జె.భరత్, ఎస్.మహేష్, డి.అశ్విత్, జీఆర్‌వీ సుభాష్, బి.జాష్వ, పి.గోపి, బి.సాల్మన్ విక్టర్, స్టాండ్‌బైగా డి.యశ్వంత్ కుమార్, కె.భాస్కర్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో : కె.పల్లవి, డి.గౌతమి, ఎస్.మానస, ఆర్.నాగలక్ష్మి, కె.పవత్రి, కె.కనకదుర్గ, ఎన్.సారిక, కె.సింధుజ, టి.నాగలక్ష్మి, కె.సింధు, ఎస్.పూర్ణిమ, జి.షీభారాణి, కె.లక్ష్మి, వి.శివపార్వతి, ఎస్.శ్రీచైతన్య, వి.నందిని, ఎస్.లిఖిత, జి.రమ్య, కె.పావనిని ఎంపిక చేశారు. అండర్ 17లో.. బాలుర విభాగంలో : కేవీవీ నాగమల్లేశ్వరరావు, కేవీవీఎన్వై ప్రసాద్, డీఎన్టీ గణేష్, పి.ప్రవీణ్‌బాబు, టి.రవితేజ, టి.లక్ష్మణ్‌రాజు, కె.సురేష్, జి.నందకుమార్, వి.శ్రీనివాసరావు, డి.ఆకాష్, పి.మహేష్, ఎన్.హరికృష్ణ, ఎస్.వినయ్, ఎ.శివరామకృష్ణ, జె.రవితేజ, పూర్ణగణేష్, స్టాండ్‌బైగా బి.లక్ష్మీనరసింహ, ఎస్.రాహుల్, వి.రవికుమార్ స్థానం సాధించారు. బాలికల విభాగంలో : కె.మనీషా, యు.శిరీషా, ఎన్.సాహితీ, కె.నళిని, ఎన్.నందిని, సీహెచ్ మానస, పి.మాధురిశ్రీ, పి.పద్మప్రణిత, బి.కోమలి, టి.ప్రత్యూష, టి.రాజేశ్వరి, ఆర్.కళ్యాణి, ఎల్.నాగమాధురి, వి.నవ్య, ఎస్.దేవిశ్రీ, టి.జయశ్రీ, స్టాండ్‌బైగా సీహెచ్ లావణ్య, టి.కనకదుర్గ, పి.సునీత ఎంపికయ్యారు. -
తైక్వాండో విజేతలకు అభినందనలు
♦ ఏడు పతకాలు సాధించిన జిల్లా జట్టు అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన అండర్–14,17 తైక్వాండో పోటీల్లో జిల్లా జట్టు 7 బంగారు పతకాలు సాధించిందని ఏపీ స్కూల్ గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నారాయణ తెలిపారు. పతకాలు సాధించిన లాసీరెడ్డి, ధరణీ, రోజా, సాయిదీప్తి, హర్షితారెడ్డి, నాగగుర్రప్ప, దత్తుసాయి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు సోమవారం నుంచి 7 వరకు వరంగల్‌లో నిర్వహిస్తారని తెలిపారు.