అండర్‌–14 చాంప్స్‌ అర్జున్, జిషిత | under 14 champains14 arjun, jishitha | Sakshi
Sakshi News home page

అండర్‌–14 చాంప్స్‌ అర్జున్, జిషిత

Published Mon, Jan 8 2018 4:32 AM | Last Updated on Mon, Jan 8 2018 4:45 AM

under 14  champains14 arjun, jishitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జిషిత ఆకట్టుకున్నారు. అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో అర్జున్‌... అండర్‌–14 బాలికల విభాగంలో జిషిత అగ్రస్థానాన్ని సంపాదించారు. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అర్జున్‌ తొమ్మిది రౌండ్లకుగాను 6.5 పాయింట్లు సంపాదించి ఓవరాల్‌గా 16వ స్థానంలో... తన విభాగంలో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అర్జున్‌ అజేయంగా నిలిచాడు. జిషిత 5.5 పాయింట్లు సంపాదించింది. ఆమె ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయింది. అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో హైదరాబాద్‌కే చెం దిన రాజా రిత్విక్‌ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్‌–20 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement