
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్-14 ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు.
టీమ్ విభాగంలో భరత్ సుబ్రమణ్యం, రాహిల్, సాహిల్ డే, దేవ్ షా, సౌహార్దో బసక్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు 15 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. 14 పాయింట్లతో ఇరాన్ ‘ఎ’ రన్నరప్‌గా... వి.ప్రణీత్, తన్మయ్ జైన్, కదమ్ ఓం మనీశ్, రోహిత్, శ్రేయస్‌లతో కూడిన భారత్ ‘బి’ జట్టుకు మూడో స్థానం లభించింది. మొత్తం 32 ఆసియా దేశాలు ఈ టోరీ్నలో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment