సాక్షి, హైదరాబాద్: మినీ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజామాబాద్ విజేతగా నిలవగా... వరంగల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు మూడోస్థానం దక్కింది.
బాలికల విభాగంలో నిజామాబాద్ టైటిల్‌ను కై వసం చేసుకోగా... హైదరాబాద్, ఆదిలాబాద్ వరుసగా రెండు, మూడు స్థానాల్ని సంపాదించుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్ సాంబశివరావు, సెక్రటరీ శోభన్ బాబు పాల్గొన్నారు.