అనంతపురం సప్తగిరి సర్కిల్:
జిల్లా బాల, బాలికల జూనియర్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు తెలిపారు. ఈ ఎంపిక స్థానిక అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ డీ పాల్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు.ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు 1999 జనవరి 1 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఆర్డీటీ క్రీడా మైదానంలో కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు.