సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | Softboll tournament begin | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Published Sat, Sep 10 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

మాచర్ల: పట్టణంలోని సాగర్‌ రోడ్డులో సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో రాష్ట్రస్థాయి సీనియర్‌ అంతర జిల్లా సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీ లు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు జిల్లా సాఫ్ట్‌బాల్‌ అధ్యక్షుడు సీహెచ్‌ శివశంకరరెడ్డి, కార్యదర్శి పి.నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా మున్సిపల్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ ఎన్‌.మంగమ్మ, సెయింట్‌ఆన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల హెచ్‌ఎం సిస్టర్‌ ఎంఎల్‌ పుష్పమేరీ, ఎంఈవో వేముల నాగయ్య, రూరల్‌సీఐ శివశంకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసశర్మ, వికాస్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎంలు ఐవీ నాగమణి, ఎ.ఇన్నమ్మ, సాఫ్ట్‌బాల్‌ పోటీల నిర్వాహకులు సంతోష్‌కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు గాదె శ్రీనివాసరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement