begin
-
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
Andhra Premier League 2023 - Sreeleela: విశాఖలో ఘనంగా ఏపీఎల్-2 ప్రారంభం.. శ్రీలీల సందడి (ఫొటోలు)
-
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
వేద పరీక్షలు ప్రారంభం
రాజమహేంద్రవరం కల్చరల్ : వేదశాస్త్రపరిషత్ ఆధ్వర్యంలో టి.నగÆర్Šలోని హోతావారి భవనంలో బుధవారం వేదపరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడునుంచి కూడా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. దుర్భాకుళ గురునాథ ఘనపాఠి, విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి, కడియాల సీతారామావధాని ఘనపాఠి, మంగిపూడి వేంకట శాస్త్రి ఘనపాఠి పరీక్షాధికారులుగా వ్యవహరించారు. తొలిరోజున అధర్వవేదంలో ఇద్దరు విద్యార్థులు, కృష్ణయజుర్వేదంలో సుమారు 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈనెల 13వ తేదీ వరకు జరుగుతాయి. సంయుక్త కార్యదర్శి పీసపాటి వేంకట సత్యనారాయణశాస్త్రి, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాల్, సభ్యులు కల్లూరి శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ‘క్రమ’పరీక్షకు హాజరవుతున్నాను మాది తమిళనాడుకు చెందిన కుంభకోణం పట్టణం. నా వయసు 18 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదంలో క్రమ పరీక్షకు హాజరవుతున్నాను. వేదవిద్యను బోధించాలన్నది నా లక్ష్యం. -శివరామకృష్ణన్ ‘సంహిత’ పరీక్షకు హాజరవుతున్నాను మాది చెన్నయ్. నా వయసు 13 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదం ‘సంహిత పరీక్ష’కు హాజరవుతున్నాను. వేదపండితుని కావాలని, వేదవిద్యను ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. -వారణాసి శ్రీనాథ్ -
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
గురజాల రూరల్: గురజాల శ్రీముక్కంటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో జె.ఎం.ఎం.ఎం ఫ్రెడ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వంటూరి వెంకటప్పారెడ్డి, టీడీపీ నాయకులు సఖిల బాలకోటిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొత్తం 32 జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పీఈటీలు బి.బాలాజి నాయక్, జి.కోటేశ్వరావు, కె.కోటిబాబు పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన వారికి ఎనుముల మురళీధర్‌రెడ్డి ప్రథమ బహుమతి రూ.12,000 లు, ద్వితీయబహుమతిని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వంటూరి వెంకటప్పారెడ్డి రూ.7,000, తృతీయ బహుమతిని శ్రీకాంత్ నర్సింగ్ హోం రూ. 5,000, నాల్గవ బహుమతిని సాంబశివ నర్సింగ్ హోం రూ. 3,000 అందిస్తున్నట్లు తెలిపారు. షీల్డులను యూటీఎఫ్ నాయకుడు టి.అరుణ్ కుమార్ అందిస్తారన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మువ్వా మల్లికార్జునరావు, మంచి కాటంరాజు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీ సంబరాలు ఆరంభం
తొలిరోజున మొక్కలు నాటిన కేడెట్లు, అధికారులు తెనాలి అర్బన్: ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా స్థానిక అయితానగర్‌లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలులో మూడురోజుల ఎన్సీసీ సంబరాలు శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమానికి ఎన్సీసీ 22 (ఎ) బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ జె.ఎ.మిర్ హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయిని ఎస్.అలివేలుమంగమ్మ, ఎన్సీసీ అధికారులు బెల్లంకొండ వెంకట్, అనసూయ, ఎన్సీసీ కేడెట్లు తొలుత మొక్కలు నాటారు. స్కూలు గార్డెన్‌ను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మిర్ మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయరాదనీ, వీటికి రోజూ నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. శనివారం 500 మందితో వ్యర్థాల నిర్వహణపై ర్యాలీ జరుగుతుందనీ, బాయ్నెట్ ఫైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పీఈటీ నాగయ్య, కోటిరెడ్డి, శ్రీను, శరత్‌బాబు, ఎస్ఎం బ్రిజ్‌లాల్, పీఐ స్టాఫ్ నాగేశ్వరరావు, సోమశేఖర్ పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ బీవీ రమణ పర్యవేక్షించారు. శ్రీ చైతన్య స్కూల్లో.. దేవిచౌక్‌లోని శ్రీ చైతన్య స్కూల్లో శుక్రవారం సోషల్ విక్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన అమరవీరుల వేషధారణాలతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి అందరిని అలరించారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయులు ఉదయ్చంద్రిక, పూర్ణిమ, మహేష్ పాల్గొన్నారు. -
లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్ 14 సింగిల్స్, డబుల్స్ లాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొన సాగనున్న పోటీలను ఎన్టీఆర్‌స్టేడియం సెక్రటరీ శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంథొని మాట్లాడుతూ లాన్ టెన్నిస్ క్రీడలు తమ పాఠశాలలో నిర్వహించటం ఆనందంగా ఉందని, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం నిర్వహించేందుకు తాము సిద్ధమేనన్నారు. మొదటిరోజు బాలుర సింగిల్స్ విభాగంలో 64 మంది, బాలికల సింగిల్స్ విభాగంలో 16 మంది పోటీ పడుతున్నారన్నారు. -
అమెచ్యూర్ చెస్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అమెచ్యూర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ 2300 లోపు ఎలోరేటెడ్ క్రీడాకారులు 50 మంది టోర్నమెంట్లో పాల్గొన్నారని చెప్పారు. మొదటి, రెండవ స్థానం సాధించిన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్లో క్రీడాకారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు. -
టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం, జిల్లా టెన్నిస్ సంఘం, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో అండర్–14, 16 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలుత అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకొని టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి చారి, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, రాష్ట్ర పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ సంఘం కార్యదర్శి సంగీతరావు పాల్గొన్నారు. -
ఆర్థిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభించిన శ్రీలంక ప్రధాని
న్యూఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న భారత ఆర్ధిక శిఖరాగ్ర సదస్పును శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ప్రాంతీయ ఆర్థిక సమగ్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. భారతదేశంలోని నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారుల ఇబ్బందులు, అంకుర పరిశ్రమలపై చర్చించనున్నారు. వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు వివిధ రంగాల ప్రముఖులు 500 మంది రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు. -
రోటో ఫెస్ట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం రోటో ఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత విద్యార్థులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ జె.భాస్కర్ రావు క్రీడాకారుల నుంచి క్రీడా వందనం స్వీకరించారు. అనంతర బెలూన్లను వదిలి రోటో ఫెస్ట్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ చిన్నారులలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సంస్కృతి విభాగాలలో పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న రోటరీ సేవలను కొనియాడారు. శాప్ ఓఎస్డి పి.రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల స్ఫూర్తితో సింధూ లాంటి క్రీడాకారులు తయారవుతారని చెప్పారు. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. క్లబ్ అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో 35 క్రీడా, విద్యా, సంసృ ్కతిక విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈనెల 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తొలిరోజు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్ జంప్, హైజంప్, స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రొటేరియన్లు కె.ఎస్.రమేష్, కొల్లా శ్రీనివాస్, న్యూజనరేషన్ డైరెక్టర్ ఎస్.అంకమ్మరావు, కోశాధికారి కాలేషావలి, భాస్కరరావు, శౌరయ్య, హరికృష్ణ, ధామస్, ఎం.వి.ప్రకాష్, బ్రహ్మ, యలమంచిలి వేణు, నంబూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్ర ప్రారంభం
మక్కా: సౌదీ అరేబియాలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు. మక్కా నగరంలోని ప్రధాన మసీదులో ఈ వారం మత ప్రాథమిక సంప్రదాయాలు నిర్వహించిన తరువాత యాత్రికులు మీనాకు బయల్దేరారు.ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బస్సుల్లో, కొందరు కాలినడకన బయల్దేరారు. ఆదివారం పవిత్ర మౌంట్ అరాఫత్‌కు చేరుకుంటారు. సైతానుపై రాళ్లు రువ్వే కార్యక్రమం మీనాలో సోమవారం మొదలవుతుంది. -
టాంగ్‌సూడో పోటీలు ప్రారంభం
తెనాలి టౌన్: తెనాలిలో రాష్ట్రస్థాయి టాంగ్‌సూడో పోటీలు శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ప్రారంభమయ్యాయి. మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను తెనాలి మొదటి ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి జి.ప్రభాకర్, రెండవ ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి సీహెచ్.పవన్‌కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా టాంగ్‌సూడో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ప్రారంభోత్సవ సభకు డాన్ బ్లాక్ బెల్ట్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభలో న్యాయమూర్తి ప్రభాకరరావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మసై ్థర్యం పెరుగుతుందని, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. కరాటే నేర్చుకునే విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఆడపిల్లలు ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం ఈ క్రీడలను నేర్చుకోవాలన్నారు. మరో న్యాయమూర్తి పవన్‌కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. త్రీటౌన్ సీఐ ఎ.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కరాటే, కుంగ్‌ఫూ లాంటి పోటీలను నిర్వహించాలన్నారు. ఆత్మరక్షణకు సంబంధించిన విద్యను నేర్చుకోవడం నేటి సమాజంలో తప్పనిసరి అని అన్నారు. సభ అధ్యక్షత వహించిన నిర్వాహకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలుర, బాలికల విభాగంలో అండర్–11, అండర్–14, అండర్–17, 18 సంవత్సరాలకు పైబడిన క్రీడాకారులకు స్పారింగ్, ప్లామ్స్, వెపన్స్, బ్రేకింగ్ ఈవెంట్లలో పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా గత ఏడాది పోటీలు నిర్వహించామని, ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో రాష్ట్రానికి మూడు వెండి, ఒక రజత పతకం వచ్చినట్లు చెప్పారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24న గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ వి.నాగరాజు, కన్వీనర్ కె.శ్రీనివాసరావు, ఇండియా టెక్నికల్ డైరెక్టర్ బీవీ రమణయ్య, వివిధ జిల్లాల ప్రతినిధులు గోపినాయుడు, రవిబాబు, శంకరరావు, కరిముల్లా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మాచర్ల: పట్టణంలోని సాగర్ రోడ్డులో సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రాష్ట్రస్థాయి సీనియర్ అంతర జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీ లు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్షుడు సీహెచ్ శివశంకరరెడ్డి, కార్యదర్శి పి.నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ ఎన్.మంగమ్మ, సెయింట్‌ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల హెచ్ఎం సిస్టర్ ఎంఎల్ పుష్పమేరీ, ఎంఈవో వేముల నాగయ్య, రూరల్‌సీఐ శివశంకర్, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసశర్మ, వికాస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ లక్ష్మీనారాయణ, హెచ్ఎంలు ఐవీ నాగమణి, ఎ.ఇన్నమ్మ, సాఫ్ట్‌బాల్ పోటీల నిర్వాహకులు సంతోష్‌కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు గాదె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ప్రో కబడ్డీపోటీలు ప్రారంభం
చిలుకూరు: చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మొత్తం 80 జట్టు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత గడ్డం శ్రీను, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నెల్లూరి నాగేశ్వరరావు, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, డైరక్టర్ బెల్లంకొండ నాగయ్య, క్రీడల నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అండర్–19 చెస్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరి గార్డెన్స్ లో ఆకారపు రాజా చెన్న విశ్వేశ్వరరావు స్మారక అండర్–19 జిల్లా స్థాయి చెస్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెస్‌తో ఆలోచన శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు చెస్‌లో శిక్షణ ఇప్పిం చడం మంచిదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీని వాస్, ఎండీ.ఆయుద్, చిప్ప వెంకటేశ్వర్లు, కుర్శీద్, కె.రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి బి.సంపత్ తెలిపారు. పోటీలకు ఆర్బిటర్లుగా భాస్కర్, అనిల్, రవి, రవీందర్, సునిల్‌లు వ్యవహరించారు. సాయంత్రం వరకు జరిగిన నాలుగు రౌండ్లలో జ్ఞానేశ్వర్, సాత్విక్, రితేష్, ఆశివ్, వర్శిత్, అల్లెన్‌థామస్, ఉదయ్‌కిరణ్‌లు గెలిచి ముందంజలో ఉన్నారని తెలిపారు. -
సృజన వెలికి తీసేందుకే పోటీలు
‘గురుకుల’రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్‌ను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి లేపాక్షి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికే రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యో తిరావు పూలే బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. బుధవా రం ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్ 2016–17 పోటీలను ఆయన ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు లేపాక్షిలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. లేపాక్షి దేవాలయ చరిత్ర దేశస్థాయిలో పేరుగాంచినదని ఇలాంటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి 32 పాఠ శాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృ త్వపు, పె యింటింగ్స్, క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి లేపాక్షి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా టేకులోడు, నసనకోట, పేరూరు, ప్రిన్సిపాళ్లు ప్రసాద్, సంగీతకుమారి, సంజీవరావు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెరుగైన విద్యను అందిస్తాం అనంతరం ఎంజేపీఏపీ బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ విలేకరులతో మాట్లాడారు. రాష్టం లోని మహాత్మా జ్యోతిరావుపూలే ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 2015–16 సంవత్సరానికి 32 పాఠశాలలకు గానూ 17 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు సాధించగా 15 పాఠశా లల్లో 97 శాతం ఫలితాలు సాధించామన్నారు. జి ల్లాలో నసనకోట, గుడిబండ, గుండుమల, రాయదుర్గం ప్రాంతాల్లో ఎంజేపీఏపీ విద్యాలయాలు మంజూరు అ య్యాయని, నసనకోట మినహా మిగిలిన మూడింటికి సిబ్బంది కొరతతో పనిచేయలేదన్నారు. -
ఓపెన్ చెస్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: వెనిగండ్ల విలేజి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అరండల్‌పేటలోని జిల్లా గ్రంథాలయంలో కె.శ్రావణి మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్లో 50 మంది రేటెడ్ క్రీడాకారులతో పాటు మొత్తం 90 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు చెస్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెస్ మేధోశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. చెస్‌లో రాణించే క్రీడాకారులు చదువుల్లోను రాణిస్తారని చెప్పారు. టోర్నమెంట్ నిర్వహకుడు కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రూ.7వేలు నగదు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
మర్రిగూడ : పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రీడాలో ఉన్న నైపుణ్యాన్ని బయటితీయడానికి నిర్వహించనున్న మండల స్థాయి క్రీడాపోటీలు సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. మొదటి రోజు బాలురులకు అండర్ –14, అండర్ –17 లో భాగంగా ఖోఖో, కబడ్డీ, ఇతర పోటీలు నిర్వహించారు. ఈ నెల 30న ఇవే పోటీలను బాలికలకు నిర్వహించనున్నారు. ఇందులో గెలిపొందిన విద్యార్థులు డివిజన్ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల పీఈటీలు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: హాకీ మంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కారించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. డీఎస్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ 27వ తేదీన హాకీ, జిమ్నాస్టిక్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం జరిగే కార్యక్రమంలో బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు. -
ఎస్సీ వర్గీకరణకు రిలే దీక్ష ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ జరపాలని డిమాండ్ చేస్తూ మాదిగ ఉద్యోగ సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ ఉద్యోగ సమాఖ్య ఉపాధ్యక్షుడు దాసరి నాగయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరపాలని మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 17 రోజులుగా జరుగుతున్న దీక్షలకు మద్దతుగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రిజర్వేషన్ ఫలాలను పొందడంలో మాదిగలు ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. మహా ధర్నాకు తరలివెళ్లాలి.. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు మాదిగ ఉద్యోగులు వారి కుటుంబాలతో తరలిరావాలని సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మురికిపూడి దేవపాల్ పిలుపునిచ్చారు. రిలే దీక్షలో మాదిగ ఉద్యోగ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వంగూరి అశోక్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.నాగరాజు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కూచిపూడి రామారావు, నగర అధ్యక్షుడు కువ్వారపు మనోహర్‌బాబు, బిరుదు పాపయ్య, జి.రాంబాబు, విజయబాబు, ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు చలివేంద్రం వెంకటేశ్వర్లు, ప్రేమానందం, రావెల వరప్రసాద్, మాదిగ యువసేన జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మూరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మాచర్ల: విద్యార్థులు విద్యనభ్యసించటంతో పాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. శనివారం స్థానిక సెయింట్‌ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పునీత అన్నమ్మ పేరుతో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సాప్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వెనుకబడిన పల్నాటిలో సెయింట్ ఆన్స్ విద్యాసంస్థ ఉత్తమ బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. ఆర్సీఎం చర్చి పాస్టర్ పెట్ల మరియదాసు, ఎంఈవో వేముల నాగయ్య, జిల్లా సాప్ట్‌బాల్ కార్యదర్శి నరసింహారెడ్డికి పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పోటీల్లో జిల్లా నుంచి వచ్చిన 14 టీంలు పాల్గొన్నాయి. -
క్రీడా పాఠశాలకు ఎంపికలు
గుంటూరు స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్ క్రీడా పాఠశాలలో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలలో 89 మంది బాలబాలికలు పాల్గొన్నారు. శాప్ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత ముఖ్యఅతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించారు. శాప్ ఓఎస్డీ, జిల్లా ఇన్చార్జ్ డీఎస్డీఓ ప్రత్తిపాటి రామకృష్ణ క్రీడా ఎంపికలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడా ప్రవేశ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన బాలబాలికలను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ఎంపికకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ శిక్షకుడు పాండురంగారావు, జిమ్నాస్టిక్స్ శిక్షకుడు సురేష్, టేబుల్ టెన్నిస్ శిక్షకుడు రాజేష్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యయులు మైనేని నాగేశ్వరరావు, వై.శ్రీనివాసరావు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎఫ్ సిబ్బందికి యోగా శిక్షణ!
హరిద్వార్ః దేశంలోనే అతిపెద్ద కాపలా శక్తిగా ఉన్న సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ ఎఫ్) కు యోగాలో శిక్షణనిస్తున్నారు. గురు రాందేవ్ బాబా శిక్షణలో సుమారు 1900 మంది కి ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. శరీరానికి మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు ఎంతగానో సహకరించే యోగా...ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడితో, కష్టించి పనిచేయాల్సిన సరిహద్దు భద్రతా బలగాలకు సైతం యోగా శిక్షణనిచ్చేందుకు నిర్ణయించారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి పదిరోజులపాటు కొనసాగే యోగా శిక్షణా కార్యక్రమం శనివారం హరిద్వార్ లో ప్రారంభమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సిబ్బందికి ఇచ్చే శిక్షణలో భాగంగా యోగాను కూడా నేర్పించనున్నట్లు ఇటీవల ఢిల్లీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ వెల్లడించారు. తమ బలగాలకు యోగాలో కూడా తర్ఫీదునిచ్చేందుకు నిర్ణయించామని, ప్రతి ప్లాటూన్ లోనూ ఓ శిక్షకుడు ఉండేట్లుగా పారామిలటరీ బలగాలకు శిక్షణనివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్లాటూన్ లోని ఒక్కో టీమ్ సుమారు 35 మంది సిబ్బందితో కూడి ఉండేట్లుగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఒత్తిడినుంచి ఉపశమనం కలిగించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తాజా సెషన్ ప్రారంభం సందర్భంగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. సరిహద్దు కాపలా విధులు నిర్వహించడంలో భాగంగా బీఎస్ఎఫ్ లో పనిచేసే పురుషులు, మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో విధినిర్వహణ ఎంతో కఠినంగా ఉంటుందని ఆ పరిస్థితుల్లో పనిచేసేవారికి యోగా ఒత్తిడిని తగ్గించే మంచి ఆయుధంగా పనిచేస్తుందని వివరించారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ :ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్టియర్ విద్యార్థులు సెట్-3 ప్రశాశ్నపత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒడియా పేపర్లకు పరీక్ష రాయగా, రెండో ఏడాది విద్యార్థులు సెట్-1 ప్రశ్నపత్రంతో పరీక్ష రాశారు. తొలిరోజు ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. 370 మంది డుమ్మా ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీకి హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించినప్పటికీ చాలామంది పరీక్షకు గైర్హాజరయ్యారు. తొలిరోజు 370 మంది డుమ్మా కొట్టారు. ప్రథమ సంవత్సరం 4,902 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,617 మంది పరీక్ష రాశారు. 285 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్స రం 608 మంది ఫీజు చెల్లించగా 85 మంది డుమ్మా కొట్టారు. కాగా ఆర్ఐవో ఎ.అన్నమ్మ పట్టణంలోని శాంతి నికేతన్, చైతన్య సహకార, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల కేంద్రాలను తనిఖీచేయగా, డీఈసీ కమిటీ సభ్యులు ఆమదాలవలసలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్, సిట్టింగ్ బృందాలు వేర్వేరుగా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఉక్కపోతతో తడిసిముద్దయ్యారు మండే ఎండలతోపాటు ఉక్కపోతతో విద్యార్థులు తడిసిముద్దయ్యారు. సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఆయా రూట్లలో నడపాల్సిన బస్సులు సమయపాలన పాటించకపోవడంలో మరిన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్ని రూట్లలో అసలు బస్సులే నడపలేదని విద్యార్థులు వాపోయారు. దీనికితోడు పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. మంగళవారం ఇంగ్లిషు పరీక్ష జరగనుంది.