వేద పరీక్షలు ప్రారంభం
వేద పరీక్షలు ప్రారంభం
Published Wed, Aug 9 2017 11:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM
రాజమహేంద్రవరం కల్చరల్ : వేదశాస్త్రపరిషత్ ఆధ్వర్యంలో టి.నగÆర్Šలోని హోతావారి భవనంలో బుధవారం వేదపరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడునుంచి కూడా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. దుర్భాకుళ గురునాథ ఘనపాఠి, విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి, కడియాల సీతారామావధాని ఘనపాఠి, మంగిపూడి వేంకట శాస్త్రి ఘనపాఠి పరీక్షాధికారులుగా వ్యవహరించారు. తొలిరోజున అధర్వవేదంలో ఇద్దరు విద్యార్థులు, కృష్ణయజుర్వేదంలో సుమారు 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈనెల 13వ తేదీ వరకు జరుగుతాయి. సంయుక్త కార్యదర్శి పీసపాటి వేంకట సత్యనారాయణశాస్త్రి, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాల్, సభ్యులు కల్లూరి శ్రీరాములు తదితరులు హాజరయ్యారు.
‘క్రమ’పరీక్షకు హాజరవుతున్నాను
మాది తమిళనాడుకు చెందిన కుంభకోణం పట్టణం. నా వయసు 18 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదంలో క్రమ పరీక్షకు హాజరవుతున్నాను. వేదవిద్యను బోధించాలన్నది నా లక్ష్యం.
-శివరామకృష్ణన్
‘సంహిత’ పరీక్షకు హాజరవుతున్నాను
మాది చెన్నయ్. నా వయసు 13 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదం ‘సంహిత పరీక్ష’కు హాజరవుతున్నాను. వేదపండితుని కావాలని, వేదవిద్యను ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను.
-వారణాసి శ్రీనాథ్
Advertisement
Advertisement