సౌదీ అరేబియాలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్‌లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు.
మక్కా: సౌదీ అరేబియాలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్‌లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు. మక్కా నగరంలోని ప్రధాన మసీదులో ఈ వారం మత ప్రాథమిక సంప్రదాయాలు నిర్వహించిన తరువాత యాత్రికులు మీనాకు బయల్దేరారు.ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బస్సుల్లో, కొందరు కాలినడకన బయల్దేరారు. ఆదివారం పవిత్ర మౌంట్ అరాఫత్‌కు చేరుకుంటారు. సైతానుపై రాళ్లు రువ్వే కార్యక్రమం మీనాలో సోమవారం మొదలవుతుంది.