makka
-
హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
ఇస్లాంలో హజ్ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్, జకాత్. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది? ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్ మొహమ్మద్ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్ ఇబ్రహీమ్ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్ర ఈద్ ఉల్ అజహ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు జిల్-హిజాలోని 8వ తేదీన.. ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు. హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే.. హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహ్రమ్, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు. ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు. -
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
-
కేఎస్ఎస్ ట్రావెల్స్ ఘరానా మోసం
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా (మక్కా) యాత్ర చేయాలనే కోరిక ప్రతి ముస్లింకు ఉంటుంది. అయితే ఖర్చుతో కూడుకుంది కావడంతో స్థోమత కలిగిన వారే ఉమ్రా, హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇటీవల ఒక ట్రావెల్ ఏజెంట్ రూ. 14 వేలకే ఉమ్రా యాత్ర చేయిస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది ముస్లింలు డబ్బు చెల్లించారు.ఇంత తక్కువ డబ్బుతో ఎలా ఉమ్రాకు తీసుకెళ్తారని చాలా మందిలో సందేహం రావడంతో వారిలో నమ్మకం కలిగించడానికి ఏజెంట్ ఒక బ్యాచ్‌ను తీసుకెళ్లాడు. చివరకు ఉమ్రా పేరుతో డబ్బువసూలు చేసుకొని పవిత్ర రంజాన్ మాసంలో అతను పాపానికి ఒడిగట్టాడు. నమ్మకం కలిగించి.. దోచుకొన్న ఏజెంట్ కడపకు చెందిన ఆలీ అనే వ్యక్తి ఒక పార్టీకి జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలోనే అతను కేఎస్ఎస్ పేరుతో ట్రావెల్స్‌ను ఏర్పాటు చేశాడు. కడపలో హెడ్‌ఆఫీసును ఏర్పాటు చేసుకొని ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను తెరిచాడు. ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున ఏజెంట్లను నియమించుకున్నాడు. అన్ని చోట్ల రూ. 14 వేలకే ఉమ్రాకు పంపిస్తామని ఫ్లైక్సీలను ఏర్పాటు చేశాడు. కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశాడు. ఉమ్రా యాత్రకు ట్రావెల్స్ నిర్వాహకులు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. ఇంత తక్కువ డబ్బుతో ఎలా పంపిస్తారని అడిగిన వారితో అతను వాదిస్తూ వచ్చాడు. ‘ ఇందులో నేను ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోను.. ఇంకా అంతో ఇంతో నాకే చేతి నుంచి పడుతుంది.. పేద, మధ్య తరగతి వారికి కూడా ఉమ్రా దర్శన భాగ్యం కల్పించాలన్నదే నా ఉద్దేశం’ అని చెబుతూ వచ్చాడు. ఇందులో భాగంగా అతను కొన్ని రోజుల క్రితం అన్ని ప్రాంతాల నుంచి కొంత మందిని ఎంపిక చేసుకొని ఉమ్రాకు పంపించాడు. వారు తిరిగి వచ్చిన తర్వాత నమ్మ కం కలగడంతో డబ్బు కట్టడానికి ట్రావెల్స్ వద్ద క్యూలో నిల్చున్నారు. డబ్బు కట్టడానికి వచ్చిన కొందరిని రెండు, మూడు రోజుల తర్వాత రమ్మ ని కూడా సిబ్బంది చెప్పేవారు. ఇలా ఒక్కో ప్రాం తం నుంచి రూ. కోట్లలో వసూలు చేసుకున్నాడు. డబ్బు కట్టిన కొందరికి ఉమ్రాకు వెళ్లే తేది కూడా చెప్పాడు. అయితే అతను చెప్పిన గడువు తీరడంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. విమానాలు దొరకడం లేదని, నెల, రెండు నెలలు ఆలస్యం అయినా ఉమ్రాకు పంపిస్తానని నమ్మబలికే వాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో స్థానిక ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. సుమారు 20 రోజులుగా ప్రధాన ఏజెంట్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో కింది స్థాయి వారిలో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ప్రొద్దుటూరు, కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రావెల్స్ కార్యాలయాలను మూసి వేశారు. రూ, కోట్లలో వసూలు.. అతను ఉమ్రాకు పంపిస్తానని పేద, మధ్య తరగతి ప్రజల వద్ద నుంచి రూ. కోట్లలో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే వారందరూ రూ.14 వేల చొప్పున డబ్బు చెల్లించిన వారు కూడా ప్రొద్దుటూరు, కర్నూలులో ఉన్నారు. ప్రొద్దుటూరులోనే సుమారు రూ. 6 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కడప, కర్నూలు, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, అనంతపురం తదితర ప్రాంతాల్లో కూడా రూ.కోట్లలో వసూలు చేసినట్లు సమాచారం. రోజు రోజుకు స్థానికంగా ఉన్న బ్రాంచ్ కార్యాలయాల ఏజెంట్లపై ఒత్తిడి అధికం కావడంతో వారు కూడా కార్యాలయాలకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేఎస్ఎస్ ట్రావెల్స్ ప్రధాన ఏజెంట్ ఆలీ బెంగళూరులో ఉన్నాడని తెలియడంతో ఏజెంట్లే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమతో పాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో కూడా అతను బ్రాంచ్ కార్యాలయాలను తెరచినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలోనే అతను అందరి వద్ద వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కడపలో ఆస్తులు కూడగట్టుకున్న ఏజెంట్ ఏజెంట్ ఇటీవల కడపలో పెద్ద ఎత్తున ఆస్తులను కొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంలో ఉన్న పాఠశాలను రూ. 1.5 కోట్లు చెల్లించి అతను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పాఠశాలలో చేరాలని కడపలో ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొన్నాడు. ఉన్నట్టుండి అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే సందేహం అతని బంధువులు, సన్నిహితుల్లో కూడా నెలకొంది. -
హజ్‌యాత్ర పుణ్యకార్యం
– అల్హాజ్ ముఫ్తి అబ్దుర్‌రహిమాన్ – రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రికులకు శిక్షణ తరగతులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర పుణ్యకార్యమని దారుల్ ఉలూమ్ ఐనుల్ హుదా ప్రిన్సిపల్ అల్హాజ్ ముఫ్తి అబ్దుర్ రహిమాన్ సాహబ్ పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ మక్కాకు వెళ్లిరావాలని సూచించారు. రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హజ్ యాత్రికులకు స్థానిక మెరీడియన్ ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రలో చేసే దువా తప్పకుండా ఫలిస్తుందని, అక్కడ లోక కల్యాణం కోసం ప్రార్థించాలని సూచించారు. కార్యక్రమానికి రబ్బాని గోదాము అధినేత అల్హాజ్ తాటిపాడు మహబూబ్‌బాషా, మెరీడియన్ ఫంక్షన్ హాల్ అధినేత బషీర్‌అహ్మద్, మౌలానా సులేమాన్ నద్వి, చాంద్‌బాషా (గద్వాల), ముస్తాఖ్అహ్మద్ (ఆదోని) తదితరులు అతిథులుగా హాజరై మాట్లాడారు. -
పవిత్రయాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా యాత్ర పవిత్రమైనదని అల్‌హరమైన్ హజ్–ఒ–ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక భాగ్యనగర్‌లోని కార్యాలయంలో ఉమ్రా యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్రా యాత్రికుల ఫ్లైట్ ఈనెల 16వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతుందన్నారు. అనంతరం యాత్రికులకు బ్యాగులు, ట్యాగులు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం.ఎ.ఆరిఫ్‌పాషా కూడా పాల్గొన్నారు. -
పవిత్ర యాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా.. పవిత్రయాత్ర అని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. అల్‌హరమైన్ హజ్, ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్రా యాత్రికులకు స్థానిక పెద్ద మార్కెట్ సమీపంలోని ఉర్దూ ఘర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. నూర్ అహ్మద్ ఖాన్‌తో పాటు నాయబ్ ఖాజీ సలీం అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత ఉమ్రా యాత్ర చేయాలన్నారు. సంస్థ ఎండీ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా, సభ్యుడు ఎం.ఎ.ఆరిఫ్ మాట్లాడుతూ 49 మంది యాత్రికులతో ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్ బయలుదేరనున్నట్లు తెలిపారు. -
హజ్ యాత్ర ప్రారంభం
మక్కా: సౌదీ అరేబియాలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు. మక్కా నగరంలోని ప్రధాన మసీదులో ఈ వారం మత ప్రాథమిక సంప్రదాయాలు నిర్వహించిన తరువాత యాత్రికులు మీనాకు బయల్దేరారు.ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బస్సుల్లో, కొందరు కాలినడకన బయల్దేరారు. ఆదివారం పవిత్ర మౌంట్ అరాఫత్‌కు చేరుకుంటారు. సైతానుపై రాళ్లు రువ్వే కార్యక్రమం మీనాలో సోమవారం మొదలవుతుంది. -
మహా గడియారం...
తిక్క లెక్క గడియారాల్లో రకరకాలు చూసి ఉంటాం. నానా ఫ్యాషన్ల చేతి గడియారాలు, నానా పరిమాణాల గోడ గడియారాలు ఇళ్లలో సామాన్యంగా వాడుతూనే ఉంటాం. నగరాలు, పట్టణాల కూడళ్లలోని క్లాక్టవర్లపై నలుదిశలా కనిపించే బండిచక్రం పరిమాణంలోని గడియారాలను చూసినప్పుడు.. అబ్బో..! ఎంత పెద్ద గడియారమో! అని అలవాటుగా ఆశ్చర్యపోతుంటాం. అయితే, వీటన్నింటినీ తలదన్నే మహా గడియారం ఒకటి గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది. ముస్లింల పవిత్ర నగరమైన మక్కాలో కాబా ఎదురుగా ఉండే అబ్రజ్ అల్బైత్ టవర్స్ హోటల్ భవనానికి 601 మీటర్ల ఎత్తున గల పై అంతస్తు గోడలకు నాలుగు వైపులా బయటకు కనిపించేలా అమర్చిన ఈ గడియారం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని వ్యాసం ఏకంగా 43 మీటర్లు.