బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు.
మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది.
రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి.
డీఆర్‌ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment