ఎన్‌సీసీ సంబరాలు ఆరంభం
ఎన్‌సీసీ సంబరాలు ఆరంభం
Published Fri, Nov 25 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
తొలిరోజున మొక్కలు నాటిన కేడెట్లు, అధికారులు
తెనాలి అర్బన్: ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా స్థానిక అయితానగర్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ మున్సిపల్ హైస్కూలులో మూడురోజుల ఎన్‌సీసీ సంబరాలు శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమానికి ఎన్‌సీసీ 22 (ఎ) బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ జె.ఎ.మిర్ హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయిని ఎస్.అలివేలుమంగమ్మ, ఎన్‌సీసీ అధికారులు బెల్లంకొండ వెంకట్, అనసూయ, ఎన్‌సీసీ కేడెట్లు తొలుత మొక్కలు నాటారు. స్కూలు గార్డెన్‌ను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మిర్ మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయరాదనీ, వీటికి రోజూ నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. శనివారం 500 మందితో వ్యర్థాల నిర్వహణపై ర్యాలీ జరుగుతుందనీ, బాయ్‌నెట్ ఫైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పీఈటీ నాగయ్య, కోటిరెడ్డి, శ్రీను, శరత్‌బాబు, ఎస్‌ఎం బ్రిజ్‌లాల్, పీఐ స్టాఫ్ నాగేశ్వరరావు, సోమశేఖర్ పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ బీవీ రమణ పర్యవేక్షించారు.
శ్రీ చైతన్య స్కూల్‌లో..
దేవిచౌక్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లో శుక్రవారం సోషల్ విక్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన అమరవీరుల వేషధారణాలతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి అందరిని అలరించారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయులు ఉదయ్‌చంద్రిక, పూర్ణిమ, మహేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement