feast
-
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
మిలియనీర్లకు మించి అదిరిపోయే విందు : సోషల్‌మీడియాలో సందడే సందడి!
ప్రతిరోజూ ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా, మరికొన్నిఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఒక బిచ్చగాడి కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ భారీ విందు ఇవ్వడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది. స్టోరీ ఏంటంటే..దేవాలయాల వద్ద, వివిధ కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే విన్నాం. చేసే వృత్తి భిక్షాటన అయినా, ఖరీదైన ఆస్తులు, ఇల్లు కలిగి ఉండటం తెలుసు. కానీ స్వయంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక కుటుంబం దాదాపు 20 వేలమందికి పసందైన విందు ఇవ్వడం లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అది కూడా ఇంట్లోని పెద్దావిడ చనిపోయి, 40వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంBeggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 202420వేల మంది అతిథులు, 2 వేల వాహనాలు గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను వేదిక వద్దకు తరలించడానికి సుమారు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కోసం, సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు పలు మాంసాహార వంటకాలను వడ్డించారు. ఇందుకోసం 250 మేకలను వినియోగించినట్టు సమచారం. వీటితోపాటు మటర్ గంజ్ (స్వీట్ రైస్), అనేక తీపి వంటకాలతో అతిథుల నోరు తీపి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు, అటు సానుకూలంగా,ఇటూ ప్రతికూలంగానూ కామెంట్స్ చేశారు. -
‘చరిత్రకెక్కిన మటన్ వార్’.. బీజేపీ ఎంపీ విందుపై అఖిలేష్ చురకలు
లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఇచ్చిన విందులో జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శలు గుప్పించారు. ‘మీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాచుర్యం పొందాయి. కానీ మటన్ వార్ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను.. ఈ మటన్ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ వ్యంగ్యస్థ్రాలు సంధించారు.అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఈ నెల 14వ ఆయన కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పలువురు బీజేపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణించింది. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్ ఈ ఘటనపై స్పందిస్తూ. విందులో చివర్లో మద్యం చేసించిన వారు రావడం వల్ల గొడవ జరిగినట్లు తెలిపారు.మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది -
మటన్ కర్రీ కోసం వరుడి గొడవ.. పెళ్లిని రద్దు చేసిన వధువు..
ఒడిశా:మటన్ కర్రీపై గొడవ కారణంగా పెళ్లిని రద్దు చేసింది ఓ వధువు. వరుడు అతని స్నేహితులు మటన్ కోసం తన కుటుంబంపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా వధువు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది. స్థానిక వివరాల ప్రకారం.. అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూలు, పందిళ్లు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. రుచికరమైన వంటకాలు వడ్డించారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెట్టారు. పెళ్లి అయ్యాక రాత్రిలో వరుడి స్నేహితులు ఆరుగులు భోజనాలకు వచ్చారు. అప్పటికే మటన్ కర్రీ అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంపై వాగ్వాదానికి దిగారు. మటన్ కూర పెట్టాల్సిందేనని వధువు తండ్రిని అవమానించారు. వరుడు కూడా అతని స్నేహితులకు వంత పాడాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. అయితే.. వరుడు జాతీయ స్థాయి బ్యాంకులో పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. 'పెళ్లి అంతా బాగానే అయింది. మటన్‌తో పాటు అన్ని వంటకాలు అందరికీ సరిపోయాయి. చివరగా వచ్చిన ఓ ఆరుగురికి మాత్రం సరిపోలేదు. రాత్రి అయినందున వడ్డించలేకపోయాము. పెళ్లికొడుకుతో సహా అతని స్నేహితులు మా కుటుంబాన్ని అవమానించారు. నాన్నపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించలేనివారితో నేను ఎలా భద్రతను పొందగలను?' అని వధువు అంటోంది. ఇదీ చదవండి:యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి -
మంత్రి విందు భోజనంలో తొక్కిసలాట
మైసూరు: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప తన కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన విందులో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసింపుర తాలూకా హెళవరహుండి సమీంపలో చోటు చేసుకుంది. మంత్రి బాధ్యతలు చేపట్టిన మహాదేవప్ప తన కార్యకర్తల కోసం మాంసాహార విందు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు పది వేల మందికి విందు ఏర్పాటు చేశారు. అంతకు మించి రావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ కాలు విరిగిపోయింది. ఆమెను కేఆర్ ఆస్పత్రికి తరలించారు. -
కల్పవల్లి.. రాట్నాలమ్మ తల్లి
సిరుల తల్లిగా.. కల్పవల్లిగా.. భక్తుల కొంగుబంగారంగా.. కోర్కెలు తీర్చే అమ్మవారిగా పూజలందుకుంటున్నారు రాట్నాలమ్మవారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో అమ్మవారు రక్షణనిచ్చే శక్తిగా ప్రసిద్ధిగాంచారు. ఐదో శతాబ్ధంలో వేంగి రాజ్యాన్ని శత్రువుల బారినుంచి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడారని శాసనాలు వెల్లడిస్తున్నాయి. శనివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పెదవేగి: ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తులు తమ బిడ్డలకు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనం, అక్షరాభ్యాసాలు చేయి స్తుంటారు. పాలుపొంగలి వండి నైవేధ్యం పెట్టి మొ క్కుబడి తీర్చుకుని తలనీలాలు ఇవ్వడం ఆచారం. రైతులు తమ పొలంలో పండిన పంటను కొంత భాగం అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకువెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వ స్తోంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేశామని దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు, ఈఓ కలగర శ్రీనివాస్, కమిటీ సభ్యులు తెలిపారు. మహిమాన్వితం మహిమాన్విత దివ్యక్షేత్రంగా రాట్నాలమ్మ ఆలయం విరాజిల్లుతోంది. వేంగి రాజుల కాలంలో రాజ్యాన్ని కాపాడే శక్తిగా అమ్మవారు అవతరించారు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో అమృత కలశంతో పులి వాహనంపై వెలిశారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి, చదుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, సప్తమాత్రుకలు, వైదేహీ సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఐదు రోజుల ఉత్సవాలు తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. వేకువజామున 4.09 గంటలకు ప్రత్యేక పూజలతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి. 17న అమ్మవారు మహాలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18న అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు పుష్పయాగోత్సవం. 19న అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం. 20న ఫల అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం 10 గంటల నుంచి అన్నసమారాధన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షా విరమణ, అవభృదోత్సవం, కుంభాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం వైఎస్ జగన్ విందు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గౌరవార్దం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విందు ఇచ్చారు. గురువారం పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ విందు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల ప్రాజెక్టులపై ఆయన సీఎంతో చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడే విశాఖపట్నం–భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్ గురించి వైఎస్ జగన్ సమగ్రంగా వివరించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రఖ్యాత కన్సల్టెన్సీలతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆ మేరకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. ఇతరత్రా అన్ని ప్రతిపాదనలకు కూడా గడ్కరీ ఆమోదం తెలుపడం పట్ల సీఎం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ, ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కేంద్ర రోడ్డు రవాణా ప్రాంతీయ అధికారి ఎస్.కె.సింగ్, ఎన్హెచ్ఏఐ అధికారులు మహబీర్ సింగ్, ఆర్.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (Sheik Rashid: జగన్ సార్ నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు) -
ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!
Thailand Monkey Festival: : కొన్ని దేశాల్లో చాలా వింతైన పండుగలు జరుగుతుంటాయి. పైగా ఆ పండుగలను భారీ ఖర్చుతో అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. చూడటానికి కాస్త విడ్డూరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. అచ్చం అలాంటి పండుగే ఒకటి థాయ్‌లాండ్ దేశంలో అట్టహాసంగా జరుగుతోంది. (చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!) అసలు విషయంలోకెళ్లితే.. థాయ్‌లాండ్‌లోని ప్రజలు కోతుల పండుగను అత్యంత అట్టహాసంగానూ, ఆహ్లాదభరితంగానూ నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి పట్టణంలో ఈ పండుగ తిరిగి ప్రారంభమైంది. అంతేకాదు ఈపండుగలో వేలాది కోతులు రెండు టన్నుల అరటిపండ్లు, పైనాపిల్ పళ్లను తింటూ, గెంతుతూ అక్కడ ఉన్న పళ్ల కుప్ప పైకి ఎక్కి కూర్చుంటూ ఆనందంగా ఆరగిస్తాయి. అంతేకాదు ఈ పండుగకు సుమారు రూ 3 వేల డాలర్లు అంటే (దాదాపు రూ. 2లక్షలు) వరకు ఖర్చు పెట్టి మరి ఆకోతులకు ఘనంగా విందు నిర్వహిస్తారు. అయితే ఈ పండుగను ఎందుకు చేస్తారంటే పర్యాటక దేశం అయిన థాయ్‌లాండ్‌ని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంలో తమ వంతుగా సహకరిస్తున్న స్థానిక కోతులకు ధన్యావాదాలు చెప్పే నిమిత్తం ఈ పండుగను నిర్వహిస్తారు. ఇది థాయ్‌లాండ్ వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పండుగను "మంకీ ప్రావిన్స్" అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది పండుగ థీమ్ ఏంటంటే వీల్ చైర్ కోతులు. ఈ థీమ్ ముఖ్యోద్దేశం ఏంటంటే థాయ్‌లాండ్‌లోని యోంగ్యుత్ పేద ప్రజలకు సుమారు వంద వీల్ చైర్లను విరాళంగా ఇవ్వడం. అంతేకాదు నవంబర్‌లో వ్యాక్సినేషన్ తీసుకున్న పర్యాటకుల కోసం నిర్భందరహిత పర్యాటక పథకాన్ని ప్రారంభిన నేపథ్యంలో మళ్లీ గతంలో మాదిరిగా పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. అయితే అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలతో కోతులతో ఆడుకుంటూ కనిపించారు. ఈ మేరకు ఈ సంప్రదాయం మళ్లీ తిరిగి ప్రారంభం కావడం పట్ల అక్కడ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేళ్ళ తర్వాత కోతులు ఈ విధంగా అన్ని రకాల పండ్లు, కూరగాయలను తినడం ఇదే మొదటిసారి అని అక్కడ స్థానికుడు థనిడా ఫుడ్జీబ్ చెప్పారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) -
విందు
శ్రావణమాసం వచ్చింది. పెళ్ళిళ్ళు మొదలయ్యాయి. క్రిందటి ఏడాది శ్రావణంలోనే పెద్దకూతురు అభిసారికకి పెళ్ళి చేశాడు వసంతరాయుడు. రాయుడికి వ్యవసాయంతో పాటు, ఓ పెద్ద ఫాన్సీ దుకాణం, టెంటు హౌస్, వడ్డీ వ్యాపారం కూడా ఉన్నాయి. పైగా పుట్టి పెరిగిన ఊరు కావడంతో .. అతనంటే తెలియని వారు లేరనే చెప్పాలి. డబ్బూ పలుకుబడి ఉన్న వసంతరాయుడి మాటకి చెల్లుబాటు ఎక్కువే. ఎప్పుడూ చేతిలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఆడేవి. బంధువులకీ, స్నేహితులకీ కొదవే లేదు. చుట్టుపక్కల పది గ్రామాలకి పరిచయం అతని పేరు. పెద్దకూతురు అభిసారిక పెళ్ళికి ఆకాశం అంత ‘పందిరీ’ భూదేవంత ‘పీటా’ వేసి, చేసినట్టే చేశాడు. ఫ్యాన్సీ దుకాణానికి అలవాటుగా వచ్చే వారందరూ అతిథులైపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలు. వచ్చినవాళ్ల కార్లు, బళ్లు పెట్టుకోడానికి చోటు చాలక రోడ్డు వారన.. ఊరి పొలిమేర దాటింది లైను. ఇంటి ముందు ఉన్న కాలువగట్టు అంతా లైటింగు ఎరేంజ్ చేసారు. రోడ్డు అంతా దేదీప్యమానంగా పట్టపగలుని తలపించింది. ఇంటి ప్రక్కనే కొబ్బరితోటలో.. షామియానాలు వేసి, ఫౌంటెన్లు, ఆధునిక డెకరేషన్లతో ఎక్కడికక్కడ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, మ్యూజికల్ ప్రోగ్రాములతో, ఎన్ని హంగులు చెయ్యాలో అన్ని హంగులు చేసి అంగరంగ వైభవంగా జరిపించాడు మొట్టమొదటి పెళ్ళని. వంట వాళ్లను విజయవాడ నుంచి రప్పించాడు. తిన్న వాళ్ళకు తిన్నంత అన్నట్లు, వెళ్ళీ వెళ్ళగానే అతిథులకు కప్పుల్లో పోసి .. సూప్స్ అందించారు. ఆ పక్కనే, చాట్లు.. పానీపూరీ, భేల్‌పూరీ, మురీ, జిలేబీలు, కాకినాడ కాజాలు, బ్రెడ్ హల్వా, బూరెలు , పొయ్యిలు పెట్టి అప్పటికప్పుడు తయారుచేసి వడ్డిస్తున్నారు. మరో పక్క పలావు, ఫ్రైడ్ రైసులు, కూరలు, గడ్డ పెరుగు. చివరిగా ఐస్‌క్రీములు, రసగుల్లాలు. ఆ విందు ఘుమఘుమలు మరచిపోక ముందే . ఏడాది తిరిగేసరికి .. రెండో కూతురు మధులతకు కూడా పెళ్లి చేసెయ్యాలని అనుకున్నాడు రాయుడు. మధులత డిగ్రీ చదివింది ‘‘ఇంకా పైకి, ఏమ్మే చదువుతాను నాన్నా. నా ఫ్రెండ్స్ లాగా ఆంధ్రా యూనివర్సిటీ, వైజాగ్ వెళ్లి చదువుకుంటాను’’ అడిగింది గోముగా.. అలా అడిగితే తండ్రి కాదనడని. ‘‘ఎంత చదివించినా.. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే కదమ్మా! మంచి సంబంధం ఎదురొస్తే కాదంటామా! అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగుళూరులో.. నీకు ఈడూ జోడూ బాగుంది. దానంతట అదే వచ్చిన సంబంధాన్ని వదులుకుంటామా’’ బుజ్జగించాడు. ఇది ఇలా ఉండగా రెండు వీధుల అవతల ఉన్న వసంతరాయుడి... చిన్నాన్న కొడుకు, సమీప బంధువు అయిన రామనారాయణరావు కూడా తన కూతురు ప్రజ్వలకి పెళ్ళి తలపెట్టాడు ఆ ఏడాదే. రామనారాయణరావు మొన్నీ మధ్యే .. అన్నగారైన రాయుడి మీద పోటీ చేసి సర్పంచిగా గెలిచాడు. కాస్త చదువుకున్న వాడు, మృదుస్వభావి కావడంతో... ఊరిలో మంచి పేరే ఉంది.. డబ్బూ పరపతి ఉన్న రాయుడి అహంభావం... అతని చదువు ముందు ఓడిపోయింది. నారాయణరావే గనుక అడ్డురాకపోతే.. ఏకగ్రీవంగా గెలిచేవాడు వసంతరాయుడు. ఆయన పరపతి అలాంటిది.ఊరిలో మరో వర్గం వాళ్లు.. చదువుకున్న వాడని రామనారాయణను పోటీకి నిలబెట్టిన.. రోజు నుంచే అన్నదమ్ముల మధ్య చీలిక ఏర్పడింది. బంధుత్వం బీటలు వారింది. వసంతరాయుడు ఆ ఓటమిని జీర్ణించుకోలేక ‘దొంగ ఓట్లు వేయించుకుని గెలిచాడు రామనారాయణ’ అంటూ అనవసరపు ప్రచారం కూడా చేశాడు. ఒకప్పుడు బాగానే కలిసి ఉన్న వాళ్లకి రాజకీయాల కారణంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. కనిపిస్తే తప్పుకు వెళ్ళిపోవడమే.. తప్ప ఇదివరకటి ఆప్యాయతలు లేవు. అలా అని వైరమూ లేదు. అంతా స్తబ్దత. సరిగ్గా తన కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడే.. నారాయణరావూ తన కూతురికి పెళ్లి పెట్టుకోవడం బొత్తిగా నచ్చలేదు. అందుకే లోపాయకారీగా నారాయణరావు కూతురి పెళ్లి కన్నా.. రెండు రోజుల ముందు ముçహూర్తానికి, తన కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టించుకున్నాడు. నారాయణరావు ఇంటి పెళ్లికి వెళ్లకపోతే, తన ఇంటి పెళ్లి పనుల వల్ల వెళ్లలేకపోయాడని ఊళ్లో వాళ్లు అనుకుంటారు.నారాయణరావు తనకి ఎందులోనూ పోటీ కాదని తెలిసినా.. ఏదో న్యూనత. ఇప్పుడు రాజకీయంగా పలుకుబడి పెంచుకుంటూ, ఎదుగుతున్నాడు. తన ఇంట చివరి పెళ్లి వేడుక కాబట్టి, అందరికీ గుర్తుండి పోయేలా ఖర్చు విషయంలో.. రాజీ పడ కూడదనుకున్నాడు.ఈసారి దగ్గరలో ఉన్న సిటీలో.. కళ్యాణమండపం మాట్లాడాడు. కనీసం నాలుగువేలమందికి అయినా సరిపడేలా.. రోజుకి అద్దే రెండు లక్షలు. ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ‘రాత్రి పూట.. చీకట్లో అంత దూరం ఏం వస్తాం రాయుడు’ అంటారని, దగ్గర వాళ్లకి కార్లు ఎరేంజ్ చేసాడు. ఓపెన్ ప్లేస్.. అంతా షామియానాలు, వాటి క్రిందే, వంటలూ. కళ్యాణవేదిక అంతా జలతారు పరదాలు, మెరుపు దారాలు, గాజు పూసలతో అలంకరణ, వాటిపై నిముషానికి ఓ రంగు మారే.. రంగుబల్బుల ఫోకస్. మెరుపు దారాలూ. గాజు పూసలూ క్షణక్షణానికి రంగులు మారి, మిలమిల మెరుస్తూ.. మాయాజగత్తులోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ వింత అందాన్ని వచ్చినవాళ్లు తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ద్వారం దగ్గర నిలబడి, వచ్చేవాళ్లకి వసంతరాయుడు స్వాగతం పలుకుతున్నాడు. వచ్చే జనాల్ని చూసి గర్వంతో ఉప్పొంగుతూ, మీసం మేలేస్తున్నాడు. ద్వారానికి దగ్గరలోనే పెద్ద డయాస్ మీద, ‘అత్తిలి’ వాళ్ళ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేసాడు. మైకుల్లో డ్రమ్స్ వాయిద్యాలు.. సినిమా పాటలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోతోంది. ఎదుటివాళ్ల మాటలు వినిపించనంతగా రణగొణధ్వనులు. అంతా ఇరవై.. ఇరవై అయిదేళ్ల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు. వయసులో ఉన్నారేమో! ఉరకలెత్తే ఉత్సాహం. మిలమిలా మెరిసిపోయే డ్రెస్సులు. వాళ్ల ఊరిలో మాట ఏమోగాని.. బయటకి వచ్చేసరికి అమ్మాయిలకి అతి ఉత్సాహం వచ్చేసింది. సినిమా ప్రోగ్రాముని తలపించేలా.. అబ్బాయిలతో కలిసి పాటలు పడుతూ.. డాన్సు చేస్తూ, అదర గొడుతున్నారు. పల్లెటూరి జనాలు ఉత్సాహంగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఎంతైనా రాయుడిగారి వైభోగమే.. వైభోగం అనుకుంటూ. కొంతమంది.. వెళ్లగానే పండ్లరసాల కౌంటరు దగ్గర క్యూ కట్టారు. పిల్లలు చాట్ల కౌంటరు దగ్గరకు చేరిపోతే, తల్లులూ వాళ్లని అనుసరించారు. శనివారం కావడంతో కొంతమంది టిఫెన్ల వైపు నడిచారు. పెసరట్ల దగ్గర ఎంతకీ ఖాళీ అవడం లేదు. వేడి వేడి పెసరట్లు అంటే ఎవరికి ఇష్టముండదు. ఒకేసారి ఎనిమిది అట్లు కాలుస్తున్నా, అక్కడే ఎక్కువమంది గుమిగూడారు. దానిలోకి ఉప్మా అందరికీ అందడం లేదు. నాకు, నాకంటూ ప్లేట్లు ముందుకు చాచే వారికోసం.. పూరీలు వేసిన వెంటనే తీసెయ్యాల్సి వస్తోంది. ప్లేటులో పడిన పదార్ధాలు.. ఉఫ్, ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆదరాబాదరాగా ముగించేస్తున్నారు. ఏ పదార్ధం అయినా పొయ్యి మీద నుంచి దించిన తరువాత కొద్దిసేపు ఆగి తినాలి. కాస్త చల్లారితేనే తినడానికి వీలుఅవుతుంది. అయితే అక్కడ అంత టైము లేదు. ఇడ్లీలు.. రుచి లేని పిండి ముద్దలు.. చెత్తడబ్బాల్లోకి చేరిపోతున్నాయి. అరటికాయ బజ్జీలతో పాటు వడ్డించిన .. పొట్టి సిమ్లా మిర్చి చురుకు.. నాలిక్కి తగల్లేదు. ఏ పదార్థం తిన్నా ‘నూనెలు’ అవసరాన్ని మించిపోయి ఉన్నాయి. గట్టిగా నొక్కితే ఓడిపోతున్నాయి, డైటింగు చేసే వారి గుండెలు గుబగుబలాడేలా. కాస్త దూరంలో అన్నం, కూరలూ, పచ్చళ్లూ, పొడులూ.. పులుసులూ, అప్పడాలూ, వడియాలూ ఒక్కటేమిటి? తినగలిగే పదార్థాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు. దేశంలో ఆకలికేకలు ఎన్నో వినిపిస్తున్నా.. విందుల్లో మిగిలిన వంటకాలు ‘లేని వాళ్లకు’ పంచుతున్నాం అన్నా. ఇక్కడ అందుకు భిన్నంగా.. గ్రౌండులో తిండి ‘పందేరం’ జరుగుతోందా అన్నట్లు .. అన్నీ వేయించుకుని.. నచ్చితే తిని, లేకపోతే వదిలేస్తున్నారు. ఎక్కడ చూసినా సగం కంచాల్లో వదిలేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఆహారాన్ని వృథాగా పారేయ్యకూడదు అన్న విషయం తెలిసినా తప్పడం లేదు. కడుపు పట్టనన్ని తినలేరుగా. ఏది వెయ్యించుకుంటున్నారో! ఎందుకు వెయ్యించుకుంటున్నారో తెలీదు. అవతల వాళ్లే వడ్డించేస్తున్నారు.. వేయించేసుకుంటున్నారు. వీలుకాకపోతే వేస్టుడబ్బా ఉండనే ఉంది. వచ్చేవాళ్లు వస్తుంటే, వెళ్లేవాళ్లు వెళుతున్నారు. ఎంగిలి కంచాలూ, తాగి పడేసిన గ్లాసులూ, కప్పులతో.. కాస్సేపటికే అక్కడంతా చిత్తడి చిత్తడిగా తయారయ్యింది. రామనారాయణరావు భార్యతో కలిసివచ్చాడు. భోజనం ముగించి రాయుడిని ఉద్దేశించి ‘‘వస్తాను అన్నయ్యా! ఇంకా చెయ్యాల్సిన పెళ్లి పనులు చాలా ఉండిపోయాయి. మర్చిపోకుండా.. ఎల్లుండి మా ఇంటికీ రావాలి’’ వెళుతూ మరోసారి ఆహ్వానించాడు అన్నయ్యని. ఎవరి మాట ఎలా ఉన్నా సర్పంచి .. రామనారాయణరావు, అదే తమ్ముడు రామనారాయణరావు వచ్చి, భోజనం చేసి, తన వైభవాన్ని చూసినందుకు చాలా సంతోషపడ్డాడు రాయుడు. ‘అలాగే లేరా. రాక ఎక్కడికి పోతాను. అప్పటికి మా ఇంట్లో పనులు తెమలక పోతాయా!’ అన్నాడు దర్పంగా నవ్వుతూ. వచ్చిపోయే జనాల్ని ఓరకంట గమనిస్తూ .. వచ్చే వాళ్ళకి అభివాదాలు చేస్తూ. ముహూర్తం అర్ధరాత్రి వేళ కాబట్టి, భోజనాలు చేసి వెళ్ళిపోయేవారే, ఎక్కువ. పెళ్ళిమండపం మేడపై ఉంది. కింద హోరుతో ఏమాత్రం ఇబ్బంది లేని ఏసీ గది. రామనారాయణరావు ఇంట పెళ్లిబాజాలు మ్రోగాయి. గ్రామంలో జనాలు తరలి వచ్చారు సర్పంచి గారింట్లో పెళ్లికి. స్నేహితులన్నవాళ్లు కొంతమంది హాజరయ్యారు. పెంకుటింటి ముందు వాకిట్లో ఉన్న ‘పెళ్లి అరుగు’ మీదే పెళ్లి. ఆ ఇంట్లో ఎన్ని పెళ్లిళ్లు జరిగినా ఆ పెళ్లి అరుగు మీదే చేస్తారు. పల్లెటూళ్లలో ప్రతిఇంటి పెరట్లో తులసికోట ఎలా ఉంటుందో .. వీధి గుమ్మంలో పెళ్లి అరుగూ అలాగే ఉంటుంది. ఇంటి చుట్టూ కొబ్బరాకుల చలువ పందిళ్లు. పచ్చటి కొబ్బరాకుల సందుల గుండా వీచే గాలి.. ఓ కొత్త పరిమళాన్ని చుట్టుప్రక్కల అంతా వ్యాపించి, మనసును చల్లగా సేద తీరుస్తుంది. ఆ పందిరిలో ఓ ప్రక్కగా కుర్చీలు, బల్లలు వేసి, అరిటాకుల్లో భోజనాలు వడ్డించారు. పెళ్లి బాజాలు వింటూ భోజనాలు కానిస్తున్నారు వచ్చినవాళ్లు .. కొసరి కొసరి వడ్డి్డస్తున్నారు కుర్రాళ్లు. భోజనాలు చేసి పాన్ నములుతూ వస్తున్నారు శంకరం అతని స్నేహితుడు జానకిరామయ్య. వారి చేతుల్లో రిటర్న్ గిఫ్ట్‌లు కూడా ఉన్నాయి. మగవాళ్లకి జేబురుమాళ్లు, ఆడవాళ్లకి స్టీలు ప్లేట్లు. ఏం వంటకాలురా! బాబూ! చాలా భేషుగ్గా ఉన్నాయి. పల్లెటూళ్ళలో ఉన్నా మనం అరిటాకు భోజనాలు మర్చిపోయాం. మన నారాయణ మాత్రం భాగా గుర్తు పెట్టుకున్నాడు.. కొబ్బరిబూరెలూ, పులిహోర .. ఆ రుచే వేరు. ఆ పనసపొట్టు కూర అయితే .. మళ్ళీ అడిగి వేయించుకున్నా. కందా బచ్చలి... ఆనపకాయ మజ్జిగ చారు.. ఏదీ వదిలి పెట్టబుద్ధి కాలేదంటే నమ్ము. ఆఖరికి చారు కూడా ఎంతో రుచిగా ఉంది. అందుకే ‘అరగడం కోసం చివరికి పాన్ వేసుకున్నా’ తను పాన్ కూడా తింటున్నందుకు ముక్తాయింపు ఇస్తూ. అవును నాకూ అలానే ఉంది’ చెప్పాడు జానకిరామయ్య తనూ భుక్తాయాసంగా. రాయుడు.. తన పరివారాన్ని వెంట బెట్టుకుని వచ్చాడు.. రాకపోతే ‘ఏం. రాయుడూ.. మీ తమ్ముడి ఇంట్లో పెళ్ళికి వచ్చినట్లు లేదే’ అంటూ ఊరిలో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని. వీధి మొదట నిలిచి అందరినీ ఆహ్వానిస్తున్న రామనారాయణ.. రాయుడికి ఎదురొచ్చి ‘రా అన్నయ్యా! వదిన కూడా వచ్చి ఉంటే బాగుండేది’ అన్నాడు వెంట ఉన్న వారిని చూస్తూ, వారిలో వదిన లేకపోవడంతో. ‘ఇంటి నిండా చుట్టాలు. తను రాలేనన్నది’ తను రావడమే ఎక్కువ అన్నట్టు.. నవ్వుతూ. కడుపు నిండా తిన్న సంతోషంలో .. పరిసరాలను గమనించని శంకరం ‘ఆ రోజు మా రాయుడి ఇంటిలో ఏం తిన్నామో! ఏమిటో? అంతా తొడతొక్కిడి భోజనాలు. నిలబడి ఆదరాబాదరాగా తినేశాం. కొన్ని ఉడికితే .. కొన్ని ఉడకలేదు. ఈ రోజు భోజనం మాత్రం అలా కాదు. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి’ మెచ్చుకున్నాడు. ‘అవును. నిజమే’ జానకిరామయ్య కూడా అంతే సంతోషంగా అన్నాడు. వెనుకగా వస్తున్న రాయుడు ఆ మాటలకి ‘ఖంగు’ తిన్నాడు. ఆ మాట అన్నది ఎవరో కాదు. స్వయానా తన మేనత్త కొడుకు శంకరం. తెల్లవారి లేస్తే, తనింటిలోనే ఉంటాడు. అలాంటి వాడికి కూడా తన విందు వెగటు అనిపించింది. ఆరోజు కొన్ని వందల మంది తిన్నారని సంబరçపడుతుంటే, శంకరం ‘తొడతొక్కిడి’ భోజనం అన్నాడు. ప్రక్కన ఉన్న వాడిదీ అదే అభిప్రాయం. అయినవాడే ‘అంతమాట’ అనేస్తే.. ఎవరితో చెప్పుకోవాలి. పెళ్ళి మర్నాడు ఊళ్లో.. రచ్చబండ దగ్గర తన విందు గురించే చర్చ జరిగిందట. కొంతమంది మెచ్చుకుంటే, మరికొంతమంది ‘అదే’ మాట అన్నారట. మెచ్చుకోలు కన్నా విమర్శ ‘కొద్దిదే’ అయినా, అదే ఎక్కువ బాధించింది రాయుడిని. రామనారాయణ అన్నగారు వచ్చినందుకు హడావుడి పడ్డాడు. స్వయంగా తనే వడ్డించాడు. అన్నయ్యకు బూరెలకి రంధ్రం పెట్టి అందులో.. వేడి నెయ్యి వేసి అందించాడు. ఆ ఆప్యాయతకు కరిగిపోయాడు రాయుడు. ఎంతైనా తమ్ముడు తమ్ముడే. ‘పదవి వచ్చిన తరువాత వీడికి గర్వం పెరిగిందనుకున్నాడు. కానీ ఏం మారలేదు’ అనుకుంటూ భోజనం ముగించాడు. అందరి ముఖాల్లోనూ మంచి భోజనం చేసిన సంతృప్తి కొట్టొచ్చినట్లు కనబడటం రాయుడు గమనించాక, మనోగతంలో తన విందు వైభవం.. మరోసారి కదలాడింది. చిన్న కుటుంబమే.. చింతలు లేని కుటుంబంలా.. చిన్న విందే జనాలకి పసందుగా ఉందన్న మాట. అరిటాకు భోజనం రుచే అయినా.. బఫే సిస్టమ్.. నిలబడి తినే భోజనాల్లో ఆకులు ఇవ్వలేరు. లైవ్ భోజనాలు.. మోడ్రన్ కల్చర్. తమ పల్లెటూరిలో కూడా ఆ సంప్రదాయం తీసుకొచ్చానని అనుకున్నా .. అది అందరికీ సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తమ విందులో పారేసిన పదార్థాల విలువ ‘వెలకట్ట’లేనిది. ఫంక్షన్ హాలులో వేసిన షామియానాల బిల్లు కన్నా, వాటర్ బాటిల్స్ బిల్లు తడిసి మోపెడు అయ్యింది. విందుకు ముందు వంట పాత్రలు నిండుగా ఉంటే .. విందు తరువాత డస్ట్ బిన్లు నిండుగా ఉన్నాయి. లైటింగు, డ్రోన్ కెమెరాలు, వంటవాళ్ళ ఖర్చూ, లేబర్ చార్జీలు అన్నీ కలిపి.. లక్షల్లో ఖర్చు. నిజానికి చాలా రోజుల తర్వాత తనూ మంచి భోజనమే చేశాడు. వాము వేసుకునే ఖాళీ ఉంటే ‘మరో గారే తింటాను’ అన్నట్లు .. సుష్టుగా తిన్నాడు. అన్నదాతా సుఖీభవ అనుకునేలా తమ్ముడిని చెయ్యెత్తి దీవించాడు. సుఖప్రదంగా పెట్టిన భోజనం ఎవ్వరికైనా సంతోషాన్నే ఇస్తుంది. - పి.ఎల్.ఎన్. మంగారత్నం -
ఎన్నారై కార్పొరేట్ దిగ్గజాలకు ట్రంప్ విందు
న్యూయార్క్: పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్ నూయితో కలిసి ఇంద్రా నూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్ బంగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న 15 మంది దిగ్గజాల్లో ఫియట్ క్రిస్లర్ సీఈవో మైఖేల్ మాన్లీ, ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ స్మిత్ తదితరులున్నారు. ‘నా ప్రభుత్వ విధానాలతో అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో మీవి కూడా ఉన్నాయి. అలాగే పలు కేసుల్లో మీ సహకారం ఎంతగానో ఉపయోగపడింది. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకు మీ సహాయ, సహకారాలు కావాలి. కొత్త వాణిజ్య ఒప్పందాలతో రాబోయే రోజుల్లో అమెరికా వృద్ధి రేటు అయిదు శాతం స్థాయికి చేరే అవకాశాలున్నాయి‘ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ’అత్యంత శక్తిమంతమైన’ మహిళల్లో ఒకరిగా ఇంద్రా నూయిని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. నూయికి ఇవాంకా ప్రశంసలు..: త్వరలో పెప్సీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఇంద్రా నూయిపై డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పలు సామాజిక విషయాల్లో నూయి తనతో పాటు ఎందరికో స్ఫూర్తి దాత అని కితాబిచ్చారు. -
విషాదం.. ముగ్గురు మృతి.. 88 మందికి అస్వస్థత
ముంబై : అప్పటివరకు సందడిగా ఉన్న ఊరిలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. విందు భోజనం ఆ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుడ్ పాయిజన్‌కు గురై ముగ్గురు చిన్నారులు చనిపోగా 88 మంది ఆస్పత్రి పాలైన సంఘటన సోమవారం రాత్రి మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయిగఢ్ జిల్లా మహద్ గ్రామంలో సోమవారం సుభాష్ మానె ఇంట్లో జరిగిన గృహప్రవేశ విందుకు దాదాపు 150 మంది హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తికి కడుపునొప్పి, వాంతులు రావటంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఒక్కొక్కరిగా కడుపు నొప్పి, వాంతులకు గురవ్వటం మొదలయ్యింది. సాయంత్రం సమయంలో విందు భోజనాలు చేసిన దాదాపు 90మంది అస్వస్థకు గురవ్వటంతో మహాత్మా గాంధీ మిషన్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కళ్యాణి సింగోట్ అనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ప్రగతి, రిషికేష్ అనే మరో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఇంటి యాజమాని సుభాష్ మానెను, వంట వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. . -
విపక్ష నేతలకు సోనియా విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్న విపక్ష పార్టీలన్నీ ఒక్క చోటకు చేరాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తన నివాసం 10 జన్‌పథ్‌లో మంగళవారం ఇచ్చిన విందుకు 20 రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. సాధారణ ఎన్నికలకు సుమారు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఈ విందు భేటీలో చర్చించారు. ఎన్డీయేతర పక్షాల ఐక్యతను సాధించడమే తొలి ప్రాథమ్యంగా ఈ భేటీ జరిగింది. ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(జమ్మూకశ్మీర్), బాబూలాల్ మరండీ, హేమంత్ సోరెన్(జార్ఖండ్), జితన్ రాం మాంఝీ(బిహార్)లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నేత సతీశ్ చంద్ర మిశ్రా, జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీకి చెందిన అజిత్ సింగ్ తదితరులు విందు సమావేశానికి హాజరయ్యారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారత, కొడుకు తేజస్వీ యాదవ్‌లు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నుంచి మహమ్మద్ సలీం, డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి, ఏఐయూడీఎఫ్‌కు చెందిన బద్రుద్దీన్ అజ్మల్, జేడీఎస్ నేత కుపేందర్ రెడ్డి తదితరులు కూడా సోనియా పిలుపు మేరకు ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేడీలకు ఆహ్వానం పంపించలేదని సమాచారం. సోనియాతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోని తదితరులు విందులో పాల్గొన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి కలసి రావాలని గతంలోనూ సోనియా కోరడం తెలిసిందే. తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ విందే. కానీ రాజకీయాల గురించి మేం మాట్లాడలేదు. మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎందుకు రాలేదని సోనియా నన్ను ఆరా తీశారు. ఆమె ముందుగా అనుకున్న కొన్ని పనులు ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పాను’ అని వివరించారు. -
సోనియా విందుకు టీడీపీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈనెల 13న యూపీఏ మిత్ర పక్షాలకు విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు భాగస్వామ్య పక్షాలతో పాటు తెలుగుదేశం వంటి ఎన్డీయే భాగస్వాములకు కూడా ఆహ్వానం అందినట్లు జాతీయ పత్రికలలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటిపేజీలో ప్రముఖంగా ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్ సంక్షోభం వంటి అంశాలపై ఈ విందు సమావేశంలో చర్చిస్తారని వినిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో యూపీఏని పటిష్టపరుచుకోవడంలో భాగంగానే ఈ విందు జరుగుతోందని కూడా వినిపిస్తోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ – తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వినిపిస్తున్నా ఇంకా తెగతెంపులు కాకుండానే యూపీఏ విందుకు తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది నేపథ్యంలో.. అయితే కొద్ది కాలంగా హస్తినలో పరిణామాలను గమనిస్తున్న వారికి మాత్రం ఈ పరిణామం అంతగా ఆశ్చర్యం కలిగించలేదు. కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ కి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న మాట నిజమేనని వారు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఎన్డీయేలో భాగస్వామిగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ రకరకాల కారణాల రీత్యా బీజేపీకి దూరం జరిగేందుకు ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఎన్నికల ఏడాది నేపథ్యంలో తన వైఫల్యాల నెపాన్ని కేంద్రంపై వేసి కన్వీనియెంట్గా తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది కూడా అందరూ చర్చించుకుంటున్న అంశమే. కాంగ్రెస్‌తో టీడీపీ సాన్నిహిత్యం..: టీడీపీ ఎంపీలు, నాయకులు కాంగ్రెస్ నాయకులకు సన్నిహితంగా వ్యవహరిస్తుండడం గత కొంతకాలంగా కనిపిస్తున్నదేన ని విశ్లేషకులంటున్నారు. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ తొలివిడత సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో మాట్లాడడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మంగళవారం నాడు పార్లమెంటు వెలుపల తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సమయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ఒకరు టీడీపీ ఎంపీలకు దగ్గరగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలపడం గమనార్హం. నాలుగు నెలల కిందటే రంగం సిద్ధం.. కాంగ్రెస్–టీడీపీ సాన్నిహిత్యానికి మూడు, నాలుగు నెలల కిందటే రంగం సిద్ధమైందని ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. మూడునాలుగు నెలల క్రితం నుంచే టీడీపీ అనుకూల ‘తోక పత్రిక’లో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రారంభమయ్యాయి. మరో ప్రధాన పత్రిక కూడా ఇటీవలి కాలంలో ఇదే వైఖరితో కథనాలు ప్రముఖంగా ప్రచురించడాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఈ పద్ధతిలో జరగదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్‌కు సంబంధించి, బోయలను ఎస్టీలలో కలపడానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం, తన పార్ట్నర్ పవన్ కల్యాణ్ చేత నిజనిర్ధారణ కమిటీ వేయించి కేంద్రం నిధులివ్వకపోవడం నిజమేనన్నట్లు గణాంకాలు చెప్పించడం, ఆ నిజనిర్ధారణ కమిటీలో కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులుండడం వంటివన్నీ కూడా బీజేపీతో దూరం జరగడానికి తగిన భూమికను సిద్ధం చేసుకోవడంలో భాగమేనని విశ్లేషకులంటున్నారు. ఇవన్నీ గమనిస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ నుంచి విందుకు ఆహ్వానం రావడం ఆశ్చర్యం కలిగించట్లేదని విశ్లేషకులంటున్నారు. -
గణతంత్రం నాడే తమ్ముళ్ల మాంసపు విందు
వైఎస్ఆర్ జిల్లా, కుచ్చుపాప(చాపాడు): స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతితో పాటు భారత జాతీయదినాలలో ఒకటైన గణతంత్ర దినాన ప్రభుత్వం మద్యం, మాంసం నిషేధాన్ని ప్రకటించింది. అయితే శుక్రవారం తెలుగుతమ్ముళ్లు జాతిని అవమానపరుస్తూ మండలపరిధిలోని కుచ్చుపాప గ్రామంలో జరిగిన మాంసపు విందులో పాల్గొన్నారు. వీరితో పాటు వారి నాయకుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ కూడా పాల్గొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా మైదుకూరులోని పార్టీ కార్యాలయంలో పుట్టా జాతీయజెండాను ఎగుర వేసి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత కుచ్చుపాపలో రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు టీడీపీలో చేరుతూ విందును ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గణతంత్ర దినోత్సవం అని కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా విందులో పాల్గొని మాంసపు వంటలను ఆరగించారు. అధికారులు సైతం పట్టించుకోకపోవటం గమనార్హం. -
విందు భోజనం
విందు భోజనానికి రమ్మని రాజప్రాసాదం నుంచి ఓ రోజు ముల్లా నస్రుద్దీన్‌కి ఆహ్వానం అందింది. వెళ్లాడు. అయితే అక్కడి సేవకులెవ్వరూ అతడిని పట్టించుకోలేదు. మాసి, చిరుగులు పట్టిన దుస్తుల్ని ధరించి ఉన్న నస్రుద్దీన్ని ఒక్కరూ భోజనానికి పిలవలేదు. నస్రుద్దీన్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు ఉన్నవాటిలో అతి ఖరీదైన దుస్తులను ధరించి మళ్లీ రాజప్రాసాదానికి చేరుకున్నాడు. ఈసారి ప్రవేశ ద్వారం దగ్గర్నుంచే అతడికి స్వాగతం మొదలైంది! కొందరు సేవకులు నస్రుద్దీన్ వెంటే వుండి అతడిని భోజన బల్లల దగ్గరికి తీసుకెళ్లి, విలాసవంతులు భుజించే వరుసలో కూర్చోబెట్టారు. వెంటనే మరికొందరు సేవకులు వచ్చి నస్రుద్దీన్‌కి భయభక్తులతో వేడివేడి విందు భోజనం వడ్డించారు. అయితే నస్రుద్దీన్ భోజనాన్ని ఆరగించకుండా, ఆహార పదార్ధాలను చేత్తో తీసుకుని, తన దుస్తులకు పూసుకోవడం మొదలుపెట్టాడు! అది చూసి, పక్కనే ఉన్న మరొక అతిథి ఆశ్చర్యపోయి, ‘‘మీరేం చేస్తున్నారో.. మీకు తెలుస్తోందా?’’ అని అడిగాడు. నస్రుద్దీన్ నవ్వాడు. ‘‘తెలుస్తూనే ఉంది’’ అన్నాడు. ‘‘ఏం తెలుస్తోంది? ఆహారాన్ని బట్టలకు అలా పూసుకోవడం ఏంటి?’’ అని అడిగాడు అతిథి. నస్రుద్దీన్ మళ్లీ నవ్వాడు. ‘‘నేను భోజనం చేయడానికి ముందు.. నా బట్టలకు భోజనం పెట్టడం నా ధర్మం అనుకున్నాను. ఎందుకంటే ఈ బట్టల కారణంగానే ఈ రాజప్రాసాదంలో నేను భోజనాన్ని పొందగలిగాను’’అన్నాడు నస్రుద్దీన్. మనం ఎంత గొప్పవాళ్లం అయినా కావచ్చు, ఆ గొప్పదనాన్ని ప్రపంచం చేత గుర్తుపట్టించేవి మనం ధరించే దుస్తులేనని నస్రుద్దీన్ తన సహజమైన వ్యంగ్య ధోరణిలో చక్కగా చెప్పారు. -
తేనీటి విందుకు పిలవండి
మెయిజీ చక్రవర్తి జపాన్ను పరిపాలిస్తున్నప్పుడు (1868–1912) నాన్–ఇన్ అనే జెన్ సాధకుడు ఉండేవాడు. బౌద్ధంలోని ఒక తత్వం జెన్. ఆ తత్వం గురించి తెలుసుకోడానికి ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ముందుగా అనుమతి తీసుకుని నాన్–ఇన్ని కలిశాడు. అయితే నాన్–ఇన్ ఏం చెప్పినా, దానిని ఆచార్యులవారు ఖండిస్తూ ఉన్నారు. పూర్తిగా వినకుండానే, వివరణలోకి పోనివ్వకుండానే నాన్–ఇన్ను అడ్డుకుంటూ ఉన్నాడు. నాన్–ఇన్ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు. ఆచార్యుడు చికాకు తెప్పిస్తున్నాడు.‘‘ఆచార్యా.. కాస్త తేనీరు సేవించి, తిరిగి చర్చను కొనసాగిద్దాం’’ అని, ఆచార్యుని ముందున్న కప్పులో తేనీరు ఒంపాడు నాన్–ఇన్. కప్పు నిండిపోయింది. అయినప్పటికీ ఒంపుతూనే ఉన్నాడు. తేనీరు కప్పు అంచుల నుంచి పొంగి పొర్లిపోతున్నా ఆపడం లేదు.‘‘ఇంకెక్కడ పోస్తారు మహానుభావా.. నింyì , పొర్లుతోంది చూడండి’’ అన్నాడు ఆచార్యుడు.నాన్–ఇన్ నవ్వి, ‘‘ఈ కప్పులాగే మీ బుర్ర కూడా మీరు నా దగ్గరికి వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలతో పొంగిపొర్లుతోంది. ముందు దానిని ఖాళీ అవనివ్వండి. అప్పుడు నేను చెప్పేది ఎక్కుతుంది’’ అన్నారు. ఆచార్యులవారికి తత్వం బోధపడింది. ఎలాగూ తేనీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే చిన్న మాట. తేనీటి విరామం మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని శాస్త్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. అన్నట్లు.. ఇవాళ ‘వరల్డ్ టీ డే’ కూడా. -
కార్మికుల భిక్షాటన.. అధికారుల విందు
ప్రొద్దుటూరు టౌన్ : అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూ ల్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేశామని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ బండి శేషన్నతోపాటు అన్ని సెక్షన్ల సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ ఉత్సవాలకు వారం ముందే ఇతర జిల్లాల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన కార్మికులు తిరిగి వెళ్లేటప్పుడు చార్జీలకు తగినంత డబ్బు ఇవ్వలేదని.. వారు రోడ్ల వెంట భిక్షాటన చేసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏదో సాధించామని విందును మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కడప కార్పొరేషన్, నంద్యాల, తాడిపత్రి మున్సిపాలిటీల నుంచి 160 మంది కార్మికులను ఆరు రోజుల ముందుగానే ఇక్కడికి పిలిపించారు. ఉప రాష్ట్రపతి సభ ముగియగానే ఈ నెల 10న కార్మికులకు తాడిపత్రికి వెళ్లే వారికి చార్జీలకు రూ.100, కడపకు వెళ్లే వారికి రూ.80 ఇవ్వడంతో వివాదం జరిగింది. ఇంత తక్కువ ఇస్తే ఎలా అని కార్మికులు పేర్కొన్నారు. కడప కార్మికులు డబ్బు తీసుకోకుండా గాంధీ రోడ్డులో పలు దుకాణాలు, గృహాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులు చేయించుకొని చార్జీలకు డబ్బు ఇవ్వలేదని భిక్షాటన చేశారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి అధికారుల నిర్వాకాన్ని ఆయన దృష్టికి కెళ్లారు. దీంతో ఆయన స్పందించిన రూ.2000 ఇచ్చారు. -
కబుర్లు.. నవ్వులు.. కాక్టైల్!
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీకి వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఇచ్చిన ఆత్మీయ విందు ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారి విదేశీ ప్రధానికి ఇచ్చిన ఈ విందుకు బ్లూరూమ్ వేదికైంది. విందు సందర్భంగా నవ్వులు పూయడంతో పాటు.. ట్రంప్, మోదీలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఇక వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి నివాస ప్రాంతాల్ని ట్రంప్ దగ్గరుండి మోదీకి చూపించారు. విందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీరిచ్చిన విందు ఆహ్వానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.. నిజానికి నేను అమెరికాలో చాలా తక్కువ సమయం గడిపినా.. ఉన్నంతసేపూ భారత్‌లో ఉన్నట్లే గడించింద’ని ఆనందం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ విందులో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు రక్షణ మంత్రి జేమ్స్ మాటీస్, విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, రెవెన్యూ మంత్రి స్టీవ్ మ్యుచిన్, జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్మస్టర్లు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రైన్స్ ప్రీబస్, సీనియర్ సలహాదారు జరద్ కుష్నర్లు పాల్గొన్నారు. యూపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ విందులో మోదీ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా.. ప్రధాని మోదీ అమెరికాకు ఇంతకుముందే రావా ల్సింది. అప్పుడు భారత్‌లో కొన్ని చోట్ల ఎన్నికలు జరగడంతో ఇప్పుడు వచ్చారు. అది ఓ చిన్న ప్రాంతంలో జరిగిన ఎన్నిక’ని పేర్కొన్నారు. నిజానికి ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే అతిఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ను ఉద్దేశించి చిన్న ప్రాంతంగా ట్రంప్ పేర్కొన డం గమనార్హం. వెంటనే మోదీ స్పందిస్తూ..‘ఆ ఎన్నికల్లో మా పార్టీ గెలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీలో మూడొంతుల మెజార్టీ సాధించామ’ని చెప్పారు. అది అద్భుతమైన విజయమని ట్రంప్ ప్రశంసించారు. మెలానియా కాక్టైల్ విందు ముందుగా మోదీకి మెలానియా ట్రంప్ కాక్ టైల్ విందు ఇచ్చారు. మెలానియా విందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..‘నా గౌరవార్థం అమెరికా ప్రథమ మహిళ ఈ విందు ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్‌లో దక్కిన గౌరవం నాకొక్కడికే కాదు. మొత్తం 125 కోట్ల భారతీయులకు కూడా’ అని మోదీ కృతజ్ఞతలు చెప్పారు. వెంటనే ట్రంప్ అందుకుని.. మీడియా వెళ్లగానే నేను కూడా ఘనంగా విందు ఇస్తానని చెప్పగా నవ్వులు పూశాయి. ‘చాలా ప్రత్యేకమైన విందుకు వెళ్లబోతున్నాం. ఘనమైన ఆత్మీయ విందు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. మీరంతా వైట్‌హౌస్‌లో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ రోజు సమావేశాలు విజయవంతంగా, గొప్పగా సాగాయ’ని ట్రంప్ అన్నారు.. వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి నివాస సముదాయాల్ని దగ్గరుండి మోదీకి ట్రంప్ చూపించారు. లింకన్ బెడ్రూం, ఆయన చేసిన గెట్టీస్‌బర్గ్ ప్రసంగ పాఠం, రాసేందుకు లింకన్ వాడిన బల్ల ప్రాముఖ్యతను మోదీకి వివరించారు. మోదీ భార్య రాలేదా!! ప్రధాని మోదీ శ్వేతసౌధానికి వెళ్లినప్పుడు ఓ తమాషా సంఘటన జరిగింది. మోదీకి స్వాగతం పలికేందుకు అప్పటికే అక్కడ అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియాలు సిద్ధంగా ఉన్నారు. మోదీ కారు వైట్‌హౌస్ వద్దకు వచ్చి ఆగింది. వెంటనే గార్డు వచ్చి ట్రంప్ నిల్చొని ఉన్న వైపుకు కారు డోర్ తీశాడు. కారు నుంచి దిగి మోదీ ట్రంప్‌తో మాట్లాడుతుండగా మరో గార్డు కారుకు అవతలి వైపున ఉన్న డోర్ తీసి అయోమయంగా లోపలకు చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు..బహుశా మోదీ భార్య కూడా వచ్చి ఉంటారని భావించి గార్డు డోర్ తెరిచి ఉంటాడనీ, ఆమె కనిపించకపోయే సరికి తెల్లమొహం వేశాడని సరదాగా వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ దంపతులకు శాలువా, బ్రేస్లెట్ ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ పలు బహుమతులు అందించారు. వైట్‌హౌస్‌లో ఇరు నేతల మధ్య ముఖాముఖి సమావేశం సందర్భంగా.. అబ్రహం లింకన్ స్మారక ప్రత్యేక తపాలా స్టాంప్‌ను మోదీ బహూకరించారు. అబ్రహం లింకన్ జ్ఞాపకార్థం 1965లో భారత ప్రభుత్వం ఈ తపాలా స్టాంప్‌ను విడుదల చేసింది. అలాగే ఒక పెట్టెలో హిమాచలి సిల్వర్ బ్రేస్లెట్, హిమాచల్ప్రదేశలోని కంగ్రా లోయ నుంచి తీసుకువచ్చిన టీ పొడి, కశ్మీరీ తేనెను అందచేశారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో చేతితో తయారుచేసిన శాలువాల్ని ట్రంప్ దంపతులకు బహూకరించారు. భారత్‌కు రండి: మోదీ ఆహ్వానం వైట్‌హౌస్‌లో విందు అనంతరం రోజ్ గార్డెన్వద్ద మోదీ మాట్లాడుతూ.. ట్రంప్ దంపతుల ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్, మెలానియాల్ని కుటుంబ సమేతంగా భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. మోదీ ఆహ్వానాన్ని ట్రంప్ అంగీకరించారని, అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదని చెప్పారు. కాగా ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహించాల్సిందిగా మోదీ కోరారు. ఈ ఆహ్వానాన్ని ఇవాంకా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. అనంతరం ట్విటర్లో ఇవాంకా స్పందిస్తూ... ‘సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు ప్రాతినిథ్యం వహించాలని మోదీ కోరడం సంతోషంగా ఉంది, నన్ను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇబ్బంది నుంచి తప్పించిన దోవల్ శ్వేతసౌధంలో మీడియా సమావేశంలో మోదీకి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆయనను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తప్పించారు. అధ్యక్ష భవనంలోని ‘రోజ్ గార్డెన్’లో మీడియా సమావేశం జరుగుతోంది. మోదీ చేతిలో మీడియా వారికి ఇవ్వడానికి ముందుగానే సిద్ధం చేసిన కొన్ని పేపర్లు ఉన్నాయి. ట్రంప్ మాటలను మోదీ శ్రద్ధగా వింటుండగా పెద్ద గాలి వచ్చి, ఆ పేపర్లు మోదీ చేజారి చెదిరిపోయాయి. అక్కడే ఉన్న అజిత్ దోవల్ వెంటనే వాటిని తీసుకుని మోదీకి అందించారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైంది. రెండోసారి కూడా దోవల్ పేపర్లను మోదీకి అందించి, ఆయనకు ఇబ్బందిని తప్పించారు. సోషల్ మీడియాలో మేమే లీడర్స్ సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ, తాను ప్రపంచ నేతలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఇద్దరు నేతలకు ట్వీటర్, ఫేస్‌బుక్‌ల్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను గర్వంగా చెబుతున్నాను. భారతీయులకు, అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, నేను సోషల్ మీడియాలో ప్రపంచ నేతల’మని వైట్‌హౌస్ రోజ్ గార్డెన్ వద్ద మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇరు దేశాల పౌరులకు పాలకులు చెప్పదలచుకున్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ప్రజా సమస్యల్ని కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలనేది మా ఇద్దరి అభిమతం. రెండు దేశాల్లో ఈ విధానం విజయమైందని నా నమ్మక’మని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌కు ట్విటర్లో 3.28 కోట్లు, మోదీకి 3.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఫేస్బుక్లో ట్రంప్‌కు 2.36 కోట్లు, మోదీకి 4.18 కోట్ల మంది ఉన్నారు. -
మైనారిటీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత
ఇప్తార్ విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ విభాగం, మైనారిటీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని ఆదివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో పాటు ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు. వారు జిల్లాలోని ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ దీక్షలు, ప్రార్థనలు మానవీయతను మేల్కొలిపి శాంతి సౌభ్రాతృత్వాలను నింపుతాయన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలకు జిల్లా యంత్రాంగం సదా అండగా ఉంటుందని, ఇఫ్తార్ విందుకు తనతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సీనియర్, ఉన్నతాధికారులు తరలిరావడం దీనికి నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, డీఎఫ్ఓ నందిని సలారియా, ఓఎస్డీ అద్నాన్ నయీమ్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ శాస్త్రి, మైనారిటీ సంక్షేమాధికారి డీఎస్ సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగరంలోని వివిధ మసీదుల పెద్దలు పాల్గొన్నారు. -
మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు
-
మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో తన భేటికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించొద్దని బిహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం ఇచ్చిన విందుకు గైర్హాజరైన నితీశ్.. శనివారం మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఇరువురి కలయిక కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందన్న కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. మారిషస్ ప్రధాని గౌరవార్థం జరిగిన విందుకు ప్రధాని తనను ఆహ్వానించారని చెప్పారు.మారిషస్‌లో సగానికి సగం బిహార్ మూలాలున్న ప్రజలున్నారని చెప్పారు. బిహార్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తాను ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. -
అమెరికాలో అగ్రనేతల భేటీ
చైనా అధ్యక్షుడికి ట్రంప్ విందు వాషింగ్టన్/పామ్ బీచ్: చైనా తమ అర్థిక వ్యవస్థను దోచుకుంటోందని ఇటీవలి వరకు తీవ్ర విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనతో గొప్ప అనుబంధం మొదలు కాబోతుందని పేర్కొన్నారు. భార్యతో సహా రెండురోజుల అమెరికా పర్యటనకు వచ్చిన జిన్ పింగ్‌కు ట్రంప్ ఫ్లోరిడాలోని తన మారా లాగో రిసార్టులో విందు ఇచ్చారు. జిన్ పింగ్‌ను, ప్రముఖ గాయకురాలైన ఆయన భార్య పెంగ్ లియూయాంగ్ అమెరికాకు వచ్చినందుకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. జిన్ పింగ్‌తో తనకు గొప్ప అనుబంధం మొదలుకాబోతోందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ ఏడాదిలో తమ దేశంలో పర్యటించాలని జిన్ పింగ్ కోరగా ట్రంప్ అందుకు అంగీకరించారు. ఇరు దేశాల సంబంధాలు ఫలవంతం అవుతాయని, వాటికి భంగం కలిగే అవకాశం లేదని జిన్ పింగ్ అన్నారు. -
నాగార్జునకొండలో విదేశీయుల సందడి
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండలో ఆదివారం 40 మంది విదేశీ విద్యార్థులు సందడి చేశారు. వీరు శాంతిసిరి లాంచీలో కొండకు చేరుకుని మ్యూజియంతో పాటు మాన్యుమంట్స్‌ను తిలకించారు. అనంతరం సాగర్ చేరుకుని అనుపు, ఎత్తిపోతల జలపాతాలు వీక్షించారు. యెమన్, సుడాన్, సోమాలియా, సౌదీఆరేబియా దేశానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. -
నూతనోత్సాహం
-
అనుపు సంబరం