ప్రొద్దుటూరు టౌన్ : అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూ ల్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేశామని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో కమిషనర్ బండి శేషన్నతోపాటు అన్ని సెక్షన్ల సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ ఉత్సవాలకు వారం ముందే ఇతర జిల్లాల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన కార్మికులు తిరిగి వెళ్లేటప్పుడు చార్జీలకు తగినంత డబ్బు ఇవ్వలేదని.. వారు రోడ్ల వెంట భిక్షాటన చేసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఏదో సాధించామని విందును మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కడప కార్పొరేషన్, నంద్యాల, తాడిపత్రి మున్సిపాలిటీల నుంచి 160 మంది కార్మికులను ఆరు రోజుల ముందుగానే ఇక్కడికి పిలిపించారు. ఉప రాష్ట్రపతి సభ ముగియగానే ఈ నెల 10న కార్మికులకు తాడిపత్రికి వెళ్లే వారికి చార్జీలకు రూ.100, కడపకు వెళ్లే వారికి రూ.80 ఇవ్వడంతో వివాదం జరిగింది. ఇంత తక్కువ ఇస్తే ఎలా అని కార్మికులు పేర్కొన్నారు. కడప కార్మికులు డబ్బు తీసుకోకుండా గాంధీ రోడ్డులో పలు దుకాణాలు, గృహాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులు చేయించుకొని చార్జీలకు డబ్బు ఇవ్వలేదని భిక్షాటన చేశారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి అధికారుల నిర్వాకాన్ని ఆయన దృష్టికి కెళ్లారు. దీంతో ఆయన స్పందించిన రూ.2000 ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment