
దాదాపు పది వేల మందికి విందు ఏర్పాటు చేశారు. అంతకు మించి రావడంతో తీవ్ర తొక్కిసలాట
మైసూరు: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప తన కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన విందులో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసింపుర తాలూకా హెళవరహుండి సమీంపలో చోటు చేసుకుంది. మంత్రి బాధ్యతలు చేపట్టిన మహాదేవప్ప తన కార్యకర్తల కోసం మాంసాహార విందు ఏర్పాటు చేశారు.
కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు పది వేల మందికి విందు ఏర్పాటు చేశారు. అంతకు మించి రావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ కాలు విరిగిపోయింది. ఆమెను కేఆర్ ఆస్పత్రికి తరలించారు.