మాంటిస్సోరిలో ఓనమ్
గుంటూరు ఎడ్యుకేషన్: కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్ వేడుకలను బుధవారం లక్ష్మీపురం 4వ లైనులోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేరళ సంస్కతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రధారణతో ఉపాధ్యాయినులు ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ఓనమ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రీయులు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ ఓనమ్ అని తెలిపారు. పురాణాల ప్రకారం బలి చక్రవర్తి పాతాళం నుంచి భూమి పైకి వస్తారనే నమ్మకంతో ఆయనకు ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతూ జరుపుకునేదే ఓనమ్ అని తెలిపారు. అనంతరం సంప్రదాయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.