ఘనంగా ఓనమ్ వేడుకలు
నూనెపల్లె: క్రాంతినగర్‌లోని నంది అకాడమీ పాఠశాలలో ఓనమ్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కాదంబరి తెలిపారు. కేరళ రాష్ట్రంలో పదిరోజుల పాటు ఓనమ్ వేడుకలను జరుపుకుంటారన్నారు. తమ పాఠశాలలో కేరళ ఉపాధ్యాయులు ఉండడంతో అక్కడి సంప్రదాయాలు విద్యార్థులకు తెలిసేందుకు వేడుకలను కొనసాగించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీషా రెడ్డి, డాక్టర్ సుప్రజా మాలపాటి ముఖ్యఅతిథులుగా హాజరవ్వగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం సంప్రదాయ కేరళ వంటకాలను విద్యార్థులకు వడ్డించారు కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది దివ్వ అండ్రూస్, మౌలాబి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.