విందుకు పిలవలేదు
మాజీ ప్రియుడి నుంచి విందుకు పిలుపు రాలేదని అందాల భామ నయనతార తన సన్నిహితుల వద్ద వాపోయిందట. ఇప్పుడామె గోడు చెప్పుకుంటోంది రెండో ప్రియుడు ప్రభుదేవా గురించే.
మాజీ ప్రియుడి నుంచి విందుకు పిలుపు రాలేదని అందాల భామ నయనతార తన సన్నిహితుల వద్ద వాపోయిందట. ఇప్పుడామె గోడు చెప్పుకుంటోంది రెండో ప్రియుడు ప్రభుదేవా గురించే. ప్రభుదేవా కోలీవుడ్‌లో పోకిరి, విల్లు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లోనూ కొన్ని హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆ తరువాత బాలీవుడ్‌పై కన్నేశారు. ప్రస్తుతం అక్కడ ప్రముఖ దర్శకుడిగా ప్రకాశిస్తున్నారు. దీంతో ముంబాయికి మకాం మార్చిన ప్రభుదేవా వీలు కుదిరినప్పుడల్లా చెన్నైకి వచ్చి తన పిల్లలను కలిసి వెళుతుంటారు.
అయితే బాలీవుడ్‌లో ఇప్పుడు బిజీ బిజీ అయినందున కోలీవుడ్‌లోని స్నేహితులకు దూరం పెరిగిందని భావించారు. దీంతో కోలీవుడ్‌లో సత్సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి రెండు రోజుల క్రితం చెన్నైలో తోటి కళాకారులకు మంచి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు పార్టీలో ప్రముఖ దర్శకుడు శంకర్, నటుడు విజయ్, విశాల్, జయం రవి, సిద్దార్ధ్, నటీమణులు లక్ష్మీరాయ్, మీనా, సంగీత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అయితే తన మాజీ ప్రియురాలు నయనతారను మాత్రం ప్రభుదేవా ఆహ్వానించలేదట. ఈ విందు విషయం తెలిసిన నయనతార తనకు ఆహ్వానం పంపకపోవడంపై సన్నిహితులముందు బోరుమంటోందట. ఇంక ఎంత ఏడ్చి మాత్రం ఏం లాభం లే. జరగాల్సింది జరిగింది కదా!