కుచ్చుపాపలో మాంసపు విందు భోజనం వడ్డిస్తున్న తెలుగు తమ్ముళ్లు
వైఎస్‌ఆర్ జిల్లా, కుచ్చుపాప(చాపాడు): స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతితో పాటు భారత జాతీయదినాలలో ఒకటైన గణతంత్ర దినాన ప్రభుత్వం మద్యం, మాంసం నిషేధాన్ని ప్రకటించింది. అయితే శుక్రవారం తెలుగుతమ్ముళ్లు జాతిని అవమానపరుస్తూ మండలపరిధిలోని కుచ్చుపాప గ్రామంలో జరిగిన మాంసపు విందులో పాల్గొన్నారు. వీరితో పాటు వారి నాయకుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ కూడా పాల్గొన్నారు.
రిపబ్లిక్‌డే సందర్భంగా మైదుకూరులోని పార్టీ కార్యాలయంలో పుట్టా జాతీయజెండాను ఎగుర వేసి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత కుచ్చుపాపలో రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు టీడీపీలో చేరుతూ విందును ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గణతంత్ర దినోత్సవం అని కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా విందులో పాల్గొని మాంసపు వంటలను ఆరగించారు. అధికారులు సైతం పట్టించుకోకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment