మృతి చెందిన చిన్నారులు
ముంబై : అప్పటివరకు సందడిగా ఉన్న ఊరిలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. విందు భోజనం ఆ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుడ్ పాయిజన్‌కు గురై ముగ్గురు చిన్నారులు చనిపోగా 88 మంది ఆస్పత్రి పాలైన సంఘటన సోమవారం రాత్రి మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయిగఢ్ జిల్లా మహద్ గ్రామంలో సోమవారం సుభాష్ మానె ఇంట్లో జరిగిన గృహప్రవేశ విందుకు దాదాపు 150 మంది హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తికి కడుపునొప్పి, వాంతులు రావటంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత కొద్ది సేపటికి ఒక్కొక్కరిగా కడుపు నొప్పి, వాంతులకు గురవ్వటం మొదలయ్యింది. సాయంత్రం సమయంలో విందు భోజనాలు చేసిన దాదాపు 90మంది అస్వస్థకు గురవ్వటంతో మహాత్మా గాంధీ మిషన్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కళ్యాణి సింగోట్ అనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ప్రగతి, రిషికేష్ అనే మరో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఇంటి యాజమాని సుభాష్ మానెను, వంట వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.
.
Comments
Please login to add a commentAdd a comment