సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్‌... | Constable Saves Two Children From Drowning At Mumbai Juhu Beach | Sakshi
Sakshi News home page

సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్‌...

Published Sun, Jun 25 2023 2:52 PM | Last Updated on Sun, Jun 25 2023 3:08 PM

Constable Saves Two Children From Drowning At Mumbai Juhu Beach - Sakshi

ముంబయి: ముంబయిలోని జుహు బీచ్‌లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడారు. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కానిస్టేబుల్ ధైర్య సాహసాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. వర్షాల ధాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని జుహు బీచ్‌లో ఇద్దరు పిల్లలు అలల వేగానికి తట్టుకోలేక మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే పరిస్థితిని గమనించి రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కానిస్టేబుల్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. 

కాగా.. ముంబయిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం కురిసిన కుండపోత వర్షానికి ఇద్దరు మరణించారు. తీవ్ర గాలులకు చెట్లు నేలకూలాయి. రహదారులు చెరువులను తలపించాయి. కాలనీలు నీటమునిగాయి. థాణె జిల్లాలో ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు.  

ఇదీ చదవం‍డి: కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్‌’.. బండారం బయటపడిందిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement