drowning
-
ఢిల్లీ ప్రమాదం: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు ఇవి ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి చేరిన వరద నీటిలో ముగ్గురు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతో పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #UPDATE | Delhi: The death toll in the Old Rajender Nagar incident rises to three after the rescue teams recovered a third body from the basement: Delhi Fire Department— ANI (@ANI) July 27, 2024 ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతోపాటు పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. నీటిని బయటకు పంపుతున్నామని, బేస్మెంట్లో ఇంకా ఏడు అడుగుల మేర నీరు నిలిచివుందన్నారు. అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 7.15 గంటలకు తమకు సమాచారం అందిందని, మొత్తం ఐదు వాహనాలతో సహా వచ్చిన సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంత భారీగా నీరు బేస్మెంట్లోకి ఎలా చేరిందన్న విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు. #WATCH | Delhi: On the Old Rajender Nagar incident, DCP Central M Harshavardhan says, "... The bodies have been sent to the hospital for further legal action. Rescue operations are still underway. The water is being pumped out. There is still about 7 feet of water in the… pic.twitter.com/37un19ApIJ— ANI (@ANI) July 27, 2024 ఈ ఘటనపై ఆప్ నాయకురాలు అతిషి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రెవెన్యూ మంత్రి అతిశీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పరిస్థితిని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సంఘటనా స్థలంలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: Fire Officer Atul Garg says, "... A total of 5 fire vehicles reached the sport after we received the information at around 7.15 pm... We pumped the water out and recovered the dead bodies of two girls. Around three children were… pic.twitter.com/p453wAD21L— ANI (@ANI) July 27, 2024 -
సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. -
రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్లి..
అనంతగిరి: సరదాగా విహారయాత్ర కోసం బయలుదేరిన వారిని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో రోడ్డు సరిగా కనబడక.. కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురిలో నలుగురు ఈదుకుంటూ బయటికిరాగా.. ఒకరు నీట మునిగి మృతి చెందారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి వెళదామని బయలుదేరి.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్ (24), వైజాగ్‌కు చెందిన సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లాకు చెందిన పూజిత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ ఐదుగురూ స్నేహితులు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి అనంతగిరి గుట్టలకు విహారయాత్ర కోసం బయలుదేరారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ చెరువు వద్ద ప్రయాణిస్తున్న సమయంలో పొగ మంచు దట్టంగా అలుముకుని ఉంది. దీనితో రోడ్డు సరిగా కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈత వచ్చిన రఘు నీట మునిగిపోతున్న సాగర్‌ను బయటికి తీసుకువచ్చాడు. కారు నడుపుతున్న మోహన్, పూజిత కూడా సురక్షితంగా బయటికి రాగలిగారు. గుణశేఖర్ నీటిలో మునిగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. కారు చెరువులో పడిన సమయంలో తమను కాపాడాలని కేకలు వేసినా.. ఒడ్డున ఉన్న కొందరు సెల్ఫోన్లలో వీడియో తీసుకుంటూనే నిలబడ్డారని బాధితులు పేర్కొన్నారు. సుదీర్ఘ గాలింపు తర్వాత.. గజ ఈతగాళ్లతో గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలను వేగిరం చేయాలని సూచించారు. సుమారు 11 గంటలపాటు గాలించిన తర్వాత సోమవారం సాయంత్రం గుణశేఖర్ మృతదేహం లభ్యమైంది. -
సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్...
ముంబయి: ముంబయిలోని జుహు బీచ్‌లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడారు. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కానిస్టేబుల్ ధైర్య సాహసాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. వర్షాల ధాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని జుహు బీచ్‌లో ఇద్దరు పిల్లలు అలల వేగానికి తట్టుకోలేక మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే పరిస్థితిని గమనించి రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కానిస్టేబుల్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. #WATCH | Santacruz Police station constable Vishnu Bhaurao Bele safely rescued two drowning children aged 7&10 from the sea at Juhu's Koliwada, Juhu Beach. pic.twitter.com/wnjVGJU6FP — ANI (@ANI) June 24, 2023 కాగా.. ముంబయిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం కురిసిన కుండపోత వర్షానికి ఇద్దరు మరణించారు. తీవ్ర గాలులకు చెట్లు నేలకూలాయి. రహదారులు చెరువులను తలపించాయి. కాలనీలు నీటమునిగాయి. థాణె జిల్లాలో ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇదీ చదవండి: కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా.. -
తండ్రి నీట మునుగుతుంటే వీడియో తీసి..
పెంట్లవెల్లి: కళ్ల ముందే కన్నతండ్రి నీటమునుగుతుంటే ఒడ్డునే ఉన్న కుమారులు కాపాడాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. తండ్రి మరణ దృశ్యాన్ని ఏకంగా వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఆపై ఏమీ ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెంట్లవెల్లికి చెందిన కేశంపోగుల కృష్ణయ్య, గోవిందమ్మ దంపతులకు రవితేజ, ఉదయ్‌కుమార్ అనే కుమారులతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మంగళవారం గ్రామంలో పెద్ద దేవర్ల పండగ జరగ్గా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణయ్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ సాయంత్రం వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చౌవుట చెరువు వద్ద కుమారులకు తండ్రి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని ఇంటికి రావాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో మరోసారి తండ్రికి, కుమారులకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మద్యం వాలని తండ్రి అడగడంతో.. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి వరకు ఈదుకుంటూ వెళ్తే మద్యం ఇప్పిస్తామని కుమారులు పందెం కాశారు. మత్తులో ఉన్న కృష్ణయ్య అందుకు ఒప్పుకొని చెరువులోకి దిగి.. ఈదడం మొదలుపెట్టాడు. సగ దూరం వెళ్లాక.. ఈదలేక నీటిలో మునిగిపోయాడు. చెరువు ఒడ్డున ఉండి ఇదంతా సెల్ఫోన్లో వీడియో తీసున్న కుమారులు.. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లి అందరితో కలిసి పండుగలో సందడి చేశారు. బుధవారం సాయంత్రం వరకు కృష్ణయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గోవిందమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆయన కోసం ఆరా తీశారు. గ్రామస్తుల సమక్షంలో కుమారులు రవితేజ, ఉదయ్‌కుమార్‌ను గట్టిగా నిలదీయగా వారు తండ్రి నీటిలో మునిగిపోతున్న వీడియోను గ్రామస్తులకు చూపించారు. గోవిందమ్మ గురువారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం చెరువులో తేలిన మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
విహారయాత్రలో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
రాయ్‌పుర్: వారాంతంలో సరదగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు కొటడాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్‌దాహా వాటర్‌ఫాల్స్ వద్దకు ఆదివారం పిక్నిక్కు వచ్చినట్లు చెప్పారు. జలపాతం కింద స్నానం చేస్తుండగా అక్కడి నీటిలో ఏడుగురు తప్పిపోయినట్లు ఆదివారం సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో ఇద్దరిని రక్షించించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం మిగిలిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను వెలికితీశారు. సోమవారం వెలికి తీసిన మృతులు.. శ్వేత సింగ్(22), శ్రద్ధా సింగ్(14), అభయ్ సింగ్(22)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నీటిలోకి దిగి స్నానం చేయకూడదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. టూరిస్టులు స్నానం చేసేందుకు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: గుంతలో పడి అదుపుతప్పిన బైక్.. లారీ తొక్కటంతో యువకుడు మృతి! -
చిమ్మ చీకటిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో వైరల్
Daring Midnight Rescue: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నది మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులను భారత ఆర్మీ రక్షించింది. అర్ధరాత్రి చిమ్మచీకటిలో సాహసోపేతమైన రెస్క్యూ చేపట్టి మరీ వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్, బబ్లూలు, జేసీబీ వాహనంలో చీనాబ్ నది దాటుతుండగా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. పైగా నీటిమట్టం క్రమంగా పెరగడంతో రక్షించేంత వరకు వాహనంపై కూర్చోవాలని అధికారులు సూచించారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఆర్మీ జవాన్లు ముమ్మరంగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆర్మీకి చెందిన సుమారు 17 మంది రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎట్టకేలకు అర్ధరాత్రి చిమ్మ చీకటిలోనే ఆ యువకులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పౌరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. #IndianArmy carried out rescue of two youth stuck in #Chenab river near village Sohal, #Kishtwar, #JammuKashmir. The water level was rising at fast pace, Soldiers rappelled across the river & rescued the youth to safety.@adgpi @Whiteknight_IA @ANI @ABPNews pic.twitter.com/aewQKQLKWJ — NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) May 8, 2022 (చదవండి: ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో) -
త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి
కెలమంగలం (కర్ణాటక): మరికొద్దినెలల్లో ఇద్దరూ మూడుముళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ విధి వైపరీత్యానికి బలయ్యారు. నీట మునిగి కాబోయే భార్యభర్తలు మృతి చెందారు. అంచెట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకొంది. వివరాల మేరకు అంచెట్టి తాలూకా ఉరిగంకు చెందిన శివమాదన్ కొడుకు శివ (21), డెంకణీకోట అణ్ణానగర్‌కు చెందిన చిన్నరాజ్ కూతురు అభి (18)లకు నిశ్చితార్థం జరిగింది. మే నెలలో పెళ్లి నిర్ణయించారు. బుధవారం ఉరిగంలో మారియమ్మ జాతరలో పాల్గొనేందుకు అభి వెళ్లింది. గురువారం ఉదయం శివ, అభి దగ్గరిలోని వాగులో ఈతకెళ్లారు. అభి నీటిలో మునిగిపోతుండగా శివ ఆమెను రక్షించేందుకు యత్నించారు. ఇరువురికీ ఈతరాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. ఇరుకుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ఘనంగా మంత్రి కుమారుడి వివాహం) -
ఈత.. కడుపుకోత! నీట మునిగితే కష్టమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఈ నెల 2న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు వద్ద గోదారిలో ఉగాది రోజున పుణ్యస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతై మరుసటి రోజు శవాలై తేలారు. మృతుల్లో ఆకుదారి సాయివర్దన్(17), డొంగిరి సందీప్(13), బెడిక సతీష్(16) ఉన్నారు. తాజాగా.. జనగామ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి రంజిత్ (14) గురువారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి యశ్వంతాపూర్ వాగు సమీప ఓడల బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. బావిలో దూకిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయాడు. ...ఇలా ఈత సరదా విద్యార్థులు, యువకుల ప్రాణాలను హరిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోనే నీటి ప్రమాదాల కారణంగా మూడేళ్లలో సగటున ఏటా 69 మంది చనిపోతుండగా.. ఈ ఏడాది ఏడు ప్రమాదాల్లో 22 మంది గోదావరి, చెరువుల్లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. ఈసారి కూడా గతేడాదికి ఏమాత్రం తీసిపోకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో మొదటిసారి ఈరెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటింది. వేసవిలో చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. పెద్దలు సైతం వీలు చూసుకుని ఈత కొలనులు, బావులు, వంకకు వెళతారు. ఈత మంచి వ్యాయామం. ఆరోగ్యకరం. కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలో దిగడం ప్రమాదకరం. ఫలితంగా అనేక మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మచ్చుకు కొన్ని.. ► ములుగు జిల్లాలో గతనెల 15న హోలీ పండుగ రోజు మంగపేట మండలం మల్లూరులోని సమీపంలో రావుల కార్తీక్(23) అనే యువకుడు మృత్యువాతపడ్డారు. శివరాత్రి రోజున భూక్య సాయి(19) కుటుంబ సభ్యులతో కలిసి మంగపేట మండలం కమలాపూర్ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. ► జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్‌లో గతేడాది సరదాగా నీటిలోకి దిగిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సుమలత, లకావత్ సంగీత, అవినాష్ బొమ్మకూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. సరదాగా నీటిలోకి దిగారు. ఒక్కసారిగా లోతులోకి వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. నిఘాలేదు.. పర్యవేక్షణ లేదు.. నీటి కుంటలు, బావుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు ఈత వచ్చినవారే ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీస్‌శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెళకువలపై అవగాహన కల్పించాలి. అప్పుడే.. ఈత సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నీట మునిగితే ప్రాణాలతో బయట పడటం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తేనే నిరోధించవచ్చు వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రామాల్లోని చెరువులు, బావులు, పంట కాలువలు, కెనాల్స్‌లో ఈత వెళ్లి మృత్యువాతపడుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు డ్రైవింగ్ నేర్పించిన విధంగా ఈత నేర్పిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. ప్రస్తుతం కాళేశ్వరం, ఇతరత్రా ప్రాజెక్టుల వల్ల గ్రామాల్లో చెరువులు, కాలువలు, కెనాల్స్ నిండుగా ప్రవహిస్తున్నాయి. వీటిల్లో ఈతకు వెళ్లేందుకు పిల్లలను అనుమతించొద్దు. గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత సమయంలో గుంతలు ఏర్పడ్డాయి. ఇలాంటి చెరువుల్లోకి దిగితే లోతు తెలవకుండా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చెరువుల వద్ద, కెనాల్స్‌పై పోలీసులు హెచ్చరిక బోర్డులు.. పెట్టించడం తరచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తే కొంత మేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించవచ్చు. -భగవాన్‌రెడ్డి, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ వరంగల్ -
తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరోడికి కాటి భయం... పొరుగోడికి నీటి భయం...’ నీరు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ నానుడి చాలు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్లో ఏకంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వేసవి తాపానికి తోడు ఇతర పరిణామాల నేపథ్యంలో ఆహ్లాదం కోసం అనేక మంది ‘నీటి’ని ఆశ్రయిస్తున్నారు. ఆయా చెరువులు, కుంటలు, కాలువలు తదితరాలపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు... ఇలా వివిధ కారణాలతో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా అశువులు బాస్తున్న వారిలో చిన్నారులు, యువతే ఎక్కువగా ఉంటున్నారు. కనిపించని అగాథాలు ఎన్నో... సాధారణంగా చెరువులు, కుంటలు ఓ దశలో ఎండిపోతుంటాయి. ఆ సమీపంలో నివసించే ప్రజలు ఆయా సమయాల్లో వాటిలోని మట్టిని తవ్వి చిన్న చిన్న అవసరాలకు వాడుతుంటారు. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో గోతులు ఏర్పడుతుంటాయి. ఎండిన సమయంలో ఈ గుంతలు కనిపించినా.. నీరు చేరినప్పుడు అవీ నిండిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడ గొయ్య ఉందో, ఎక్కడ ఎత్తు ఉందో ఆ ప్రాంతంతో పరిచయం లేని వాళ్లు ఈ విషయాలు గుర్తించడం అసాధ్యం. ఈత రాని వారు నీళ్లల్లో దిగినప్పుడు మొల్లగా నడుచుకుంటూ మెడ లోతు వరకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఇలా నడుస్తున్న క్రమంలో హఠాత్తుగా నీటి లోపల ఉన్న గుంటలోకి వెళ్తే... తేరుకునే లోపే మునిగిపోతున్నారు. వచ్చీరాని ఈతతో ముప్పే... ఏ మాత్రం ఈతరాని వారి పరిస్థితి ఇలా ఉంటే... వచ్చీరాని ఈతతో చెరువులు, కుంటలు తదితరాల్లోకి దిగేవాళ్లూ మృత్యువాత పడుతున్నారు. ఈతపై పూర్తి పట్టులేకపోవడంతో కొంతసేపు జోష్‌తో చెరువులో కొంత దూరం వెళ్తున్నారు. ఆపై అలసిపోవడంతో వెనక్కు రాలేక నీట మునిగిపోతున్నారు. మరోపక్క తమ బృందంలో ఒకరు మునిగిపోతున్నట్లు గుర్తించిన ఇతరులు వారిని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా రక్షించే సమయాల్లో సమయస్ఫూర్తి, నైపుణ్యం లేక వీరు కూడా మునిగిపోయి చనిపోతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం... ►కొత్త ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో దిగేప్పుడు వాటి వివరాలు స్థానికుల్ని అడిగి తెలుసుకోవాలి. ►స్నానం/ఈత కోసం అంతా ఒకేసారి చెరువుల్లో దిగకూడదు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కొందరైనా గట్టుపై ఉండాలి. ►ఈత రాని, దానిపై పట్టు లేని వాళ్లు నీటిలో దిగేప్పుడు ట్యూబు, గాలితో నింపిన ప్లాస్టిక్ సంచులు... కనీసం ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను తమ వెంట ఉంచుకోవాలి. ►గట్టుపై ఉండే వాళ్లు తాడు, కర్రలు వంటిని సిద్ధంగా ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపకరిస్తాయి. ►నీటిలో మునిగిపోతున్న వారిని అనాలోచితంగా, ఎలాంటి ఉపకరణాలు లేకుండా రక్షించడానికి ప్రయత్నించడమూ ప్రమాదహేతువే. ►నీళ్లల్లో మునిగిపోతున్న వారిని రక్షించేప్పుడు ముందుగా వారి వద్దకు వెళ్లిన వెంటనే కంగారు పడద్దని, రక్షించే వ్యక్తి కాళ్లు, చేతులు పట్టుకోవద్దని ధైర్యం చెప్పాలి. ►నీటిలో మునిగిపోతున్న వారిని వెనుక నుంచి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయాలి. తాడుతో పాటు ఈతకు ఉపకరించే ఉపకరణాలు అందించడం ఉత్తమం. ►ఇటీవల కాలంలో యువతకు సెల్ఫీ మోజు పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఈ ఫొటోలు దిగుతున్నాయి. అయితే చెరువులు వంటి వాటి వద్ద వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. -
తల్లడిల్లిన కన్నపేగు.. ఆశలన్నీ ఆవిరయ్యాయి
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు...తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుని కష్టమేంటో తెలియకుండా పెంచారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగానే చదువుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్రజేసింది. నేలబావి రూపంలో ఉసురుతీసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బంధాన్ని తెంపేసింది. ఈత సరదా ఆకుటుంబాలను కన్నీటి పాల్జేసింది. సాక్షి, పెదగంట్యాడ/అగనంపూడి (గాజువాక): ఆనందపురంలో సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హర్షశ్రీ సంతోష్, సాయి పవన్‌లు తరగతులు ముగిసిన తరువాత నీళ్లకుండీల వద్ద నేలబావిలో ఈత కొట్టేందుకు దిగి మృతి చెందారు. సాయిపవన్‌కు ఈత రాకపోవడం...రక్షించే క్రమంలో హర్షశ్రీ సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం నవ్వుతూ కళ్లముందు తిరిగిన వీరిద్దరూ ఇప్పడు లేరన్న వార్తను తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తట్టుకోలేకపోతున్నారు. పెదగంట్యాడ సమీపంలోని చిననడువూరులోని రామాలయం వీధిలో సంతోషి కుటుంబ ఉంటోంది. నర్సీపట్నానికి చెందిన మలసాల వెంకునాయుడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం పిల్లలతో సహా చిననడుపూరు వచ్చేశారు. వెంకునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడికి పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు హర్షశ్రీ సంతోష్ (17), చిన్నకుమారుడు నిరుపమ్. పెద్ద కుమారుడు పాలిటెక్నిక్, చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. వెంకునాయుడు కుమారులిద్దరికీ ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. కన్నీరుమున్నీరుగా.. వడ్లపూడి నిర్వాసిత కాలనీ సంతమామిడితోట శివాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కఠారి వెంకట సాయి పవన్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పవన్ తండ్రి రాంబాబు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు సాయి పవన్ ఆనందపురంలోని ప్రైవేటు పాలిటెక్నిక్‌లో మొదటి సంవత్సరం డిప్లమో చేస్తున్నాడు. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఇంతలో మృతి చెందాడన్న విషాద వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: వివాహేతర సంబంధం: షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో.. -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,కర్నూలు(ఓర్వకల్లు): ఆనందంగా ప్రకృతిలో విహరిద్దామని వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యుఒడి చేరారు. ఈ విషాద ఘటన ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ అసద్ ఉసామా(30), సయ్యద్ అమీరుద్దీన్(25), డి. షకీల్ అహ్మద్, సయ్యద్ మహ్మద్ అఖిల్ స్నేహితులు. ఇటీవల బక్రీద్ పండుగను జరుపుకున్న ఆనందంలోసరదాగా పిక్నిక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నలుగురు యువకులు రెండు బైక్‌లపై 9.30 గంటలకు రాక్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంట్రీ పాసులు తీసుకొని స్థానిక లింగం వారి చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో సరదాగా ఈత కొట్టాలని నీటిలోకి దిగారు. చెరువులోకి దిగిన ఐదు నిమిషాలలోనే కర్నూలు మమతా నగర్‌కు చెందిన సయ్యద్ అన్వర్ బాషా కుమారుడు సయ్యద్ అసద్ ఉసామా, నరసింగరావు పేటకు చెందిన సయ్యద్ అనిషుద్దీన్ కుమారుడు సయ్యద్ అమీరుద్దీన్‌కు ఈత సరిగ్గా రాకపోవడంతో నీట మునిగి పోయారు. విషయం గమనించిన తోటి మిత్రులు స్థానిక హరితా రెస్టారెంట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి వెళ్లి చెరువులో మునిగిపోయిన ఇద్దరు యువకుల కోసం గాలించగా అప్పటికే మృతి చెంది కనిపించారు. మృత దేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కర్నూలు డీఎస్పీ మహేష్, రూరల్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో చెరువు వద్దకు చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. సయ్యద్ అసద్ ఉసామా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య అమీనా బేగం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అమీరుద్దీన్‌కు పెళ్లి కాలేదు. నగరంలో అమెజాన్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండేవాడు. ప్రమాద స్థలం వద్ద మృతుల కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
చేపలు పడుతూ.. ఊబిలో చిక్కుకుని
బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ఓ బాలిక, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో బుధవారం ఈ ఘటన జరిగింది. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడేనికి చెందిన ఎం.కల్యాణి (15) ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుండగా, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రామిరెడ్డిగూడేనికి చెందిన ఎం.మహాలక్ష్మి (31) ఉపాధి పనుల కోసం వంకావారిగూడేనికి వచ్చింది. వర్షాలు బాగా పడుతుండటంతో స్థానికులతో కలిసి వీరు జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులోకి దిగి వలతో చేపలు పడుతూ ముందుకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఊబిలో చిక్కుకుని మృతి చెందారు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తీరని శోకం: నీటికుంటలో మృత్యుఘోష
మండ్య: ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులను నీటికుంట మింగేసింది. వారి తల్లులకు కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన పాండవపుర తాలూకా, బళెఅత్తిగుప్పె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహదేవప్ప, భారతి దంపతుల కుమారులు చంద్రు(11), కార్తీక్(9), మల్లికార్జున, సుమా దంపతుల కుమారుడు రితేష్(8)లు ఇంటి వద్ద ఆడుకుంటూగ్రామ సమీపంలోని నీటికుంటలో ఈతకు కొట్టడానికి వెళ్లారు. నీరు లోతుగా ఉన్న ప్రదేశంలో చిక్కుకుపోయి జలసమాధి అయ్యారు. సమీపంలోని రైతులు అటుగా వెళ్తూ బావిలోకి తొంగి చూడగా బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. బావి లోపలకు దిగి గాలించగా మిగతా ఇద్దరు బాలురు విగతజీవులై కనిపించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఒక్కసారిగా దుఃఖం ఉప్పొంగింది. మృతదేహాలపై పడి రోదించడం అందరినీ కలచి వేసింది. వారిని సముదాయించేందుకు ఎవరితరం కాలేదు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే సి.ఎస్.పుట్టరాజు, కలెక్టర్ అశ్వథి, తహసీల్దార్ ప్రమోద్ పాటిల్, సీఐ కే.ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చదవండి: పురుగుల మందు తాగి ఉద్యోగిని ఆత్మహత్య -
గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం
సాక్షి,ఆదిలాబాద్: కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం విధుల్లో ఉన్న ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గూడెం వైపుకు నాటు పడవలో వస్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో పడవనడిపే నావికుడు పాణె లింగయ్య, సహాయకుడు పేదం అర్జయ్య, ప్రయాణికుడు సూర కత్రయ్య, ముగ్గురు అటవీశాఖ బీట్ అధికారులు సద్దాం, ముంజం బాలక్రిష్ణ, బానావత్ సురేష్ నాయక్‌లు ఉన్నారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని గూడెం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బీట్ అధికారులు తమ విధుల్లో భాగంగా పర్యవేక్షిస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కాలినడకన ప్రాణహిత నదికి ఆవలివైపుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాటు పడవలోకి నీరు రావడంతో బయటకు తోడే క్రమంలో పడవ మునిగింది. లింగయ్య , సహాయకుడు అర్జయ్య, కత్రయ్య సమీపంలోని చెట్ల సహాయంతో బయటకు వచ్చారు. కాగా బీట్ అధికారి సద్దాం ఈదుకుంటూ బయటకు రాగా ముంజం బాలక్రిష్ణ, సురేష్ నాయక్‌లు నీటమునిగారు. ముంజం బాలక్రిష్ణ స్వస్థలం కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు కాగా బానావత్ సురేష్ నాయక్ కెరమెరి మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయితీ టెంమ్లగూడ గ్రామానికి చెందినవాడు. సమాచారం అందుకున్న చింతలమానెపల్లి ఎస్సై రాం మోహన్, అటవీశాఖ అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ స్వామి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్ అధికారి విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. అటవీ అధికారుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం చీకటి పడడంతో గా లింపు చర్యలు నిలిపి వేసినట్లు ఎస్సై రాంమోహన్ తె లిపారు. నదిలో ప్రమాదం నుంచి బయటపడ్డ సద్దాం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. పడవ నావికుడు లింగయ్య, అర్జయ్యలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం. పడవ నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. పడవ నడిపే లింగయ్య, సహాయకుడు అర్జయ్యలు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిరోజు గూడెం నుంచి అహెరి ప్రాంతానికి అహెరి నుంచి అహెరి వైపుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి ఇంజన్లను బిగించిన పెద్ద సైజు పడవలను వినియోగిస్తుంటారు. ఉదయం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో చేపల వేటకు వినియోగించే చిన్న నాటుపడవలో వీరిని తరలించేందుకు ప్రయత్నించారు. పడవ ప్రమాదకరంగా ఉండడంతో పడవలోకి నీళ్లు రాగా తోడే క్రమంలో పడవ బోల్తా పడింది. ఆందోళనలో కుటుంబసభ్యులు. బీట్ అధికారులు గల్లంతయిన ప్రమాదంపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి బీట్ అధికారుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. బాలక్రిష్ణ తండ్రి ముంజం మల్లయ్య, సోదరుడు శివ, చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఇతర బంధువులు నది వద్దకు చేరుకున్నారు. బాలక్రిష్ణ గత జూలై నెలలో బీట్ అధికారిగా విధుల్లో చేరగా, సురేష్ గత అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. బాలక్రిష్ణకు భార్య దుర్గారాణి, 6 నెలల కుమారుడు రుద్రాంశ్ ఉన్నారు. సురేష్ నాయక్‌కు భార్య మనీషా 4సంవత్సరాల కుమారుడు గణేష్ ఉన్నాడు. కాగా సురేష్ భార్య మనీషా 9నెలల గర్భిణి. కళ్లముందే నీట మునిగారు విధుల్లో భాగంగా నదికి ఆవలివైపునకు నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి నడిచి వెళ్లాం. తిరిగి వచ్చేక్రమంలో వంతెనపై నుంచి కాకుండా పడవలో బయలుదేరాం. ప్రయాణికులు లేకపోవడంతో నాటు పడవలో వెళ్లాలని పడవ నిర్వాహకులు చెప్పడంతో పడవలోకి ఎక్కాం. నది మధ్యలోకి వెళ్లగానే పడవలోకి నీరు రావడంతో సహాయకుడు నీరు బయటకు తోడే క్రమంలో పడవ మునిగిపోయింది. చెట్ల సహాయంతో నేను, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం. మా కళ్ల ముందే ఇద్దరు బీట్ అధికారులు నదిలో మునిగిపోయారు. –సద్దాం, బీట్ అధికారి -
అన్నదమ్ముల ప్రాణం తీసిన పండుగ సెలవులు
సాక్షి, కురవి: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు రావడంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన అన్నదమ్ములను ఈత సరదా రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కురవి మండలం సూదనపల్లికి చెందిన పొల్లూరి లక్ష్మీ, సోమయ్య దంపతులకు వేణుమాధవ్(18), వరుణ్‌తేజ్(14) సంతానం. కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. దసరా సెలవులు రావడంతో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ అమ్మమ్మ పద్మతో కలసి గురువారం కురవిలోని చిన్నమ్మ గుండేటి రాధిక, రవి ఇంటికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత చిన్నమ్మ కొడుకు ధనుష్, అతడి స్నేహితులు జక్కుల గణి, నద్దునూరి వెంకటేశ్‌తో కలసి ఈత కొట్టడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో సమీపంలోని మండలి వీరయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్దకు చేరారు. వెంకి, గణి బావిలోకి దిగి ఈతకొడుతుండగా ధనుష్ ఒడ్డున ఉన్నాడు. ఈ క్రమంలో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ ఒడ్డున ఉన్న కట్టెను పట్టుకుని బావిలోకి దిగే ప్రయత్నంలో నీళ్లలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతుండగా.. అప్పటికే బావిలో ఉన్న వెంకి, గణి భయంతో బయటకు వచ్చి ధనుష్‌తో కలసి పరుగున ఊర్లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. రాధికతో పాటు భర్త రవి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం గ్రామస్తులు, చుట్టుపక్కల వారికి తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎస్సై శంకర్రావుకు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానిక యువకుల సాయంతో మృతదేహాల కోసం గాలించారు. మానుకోట నుంచి అగ్నిమాపక శాఖ అధికారి కొమురయ్య, సిబ్బంది వచ్చి రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మృతదేహాలను బయటకు తీసి ఆటోలో వారి చిన్నమ్మ రాధిక ఇంటికి తరలించారు. ఏం పాపం చేశాం బిడ్డా.. ‘ఏం పాపం చేశాం బిడ్డా.. మమ్ములను అన్యాయం చేసి వెళ్లిపోయారా?’.. అంటూ అక్కడికి చేరుకున్న తల్లి లక్ష్మీ మృతదేహాలపై పడి బోరున విలపించింది. ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూపిన ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కురవితోపాటు సూదనపల్లిలో విషాదం అలుముకుంది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శంకర్రావు తెలిపారు. సంఘటన స్థలానికి మానుకోట ఆర్డీఓ కొమురయ్య, ఇన్చార్జ్ తహసీల్ధార్ శేషగిరిస్వామి, సీఐ వెంకటరత్నం చేరుకుని వివరాలను సేకరించారు. ఎమ్మెల్యే పరామర్శ.. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కురవికి చేరుకుని మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీ చిన్నంభాస్కర్, టీఆర్ఎస్ నాయకులు బాదావత్ రాజునాయక్, సోమిశెట్టి శ్రీనివాస్, మేక నాగిరెడ్డి, తుకారాంనాయక్ ఉన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం ఇద్దరు చిన్నారులు బావిలో పడిపోయి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. -
గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, దుబ్బాక: సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కరుణాకర్ (14) అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత సరిగా రాక చెరువులో ప్రమాదకరంగా ఉన్న జేసీబీ గుంతలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం పాఠశాలలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం ఎలుగోయ గ్రామానికి చెందిన అలిగె వసంత, అశోక్ దంపతుల ఏకైక కుమారుడు కరుణాకర్ (14) మండల పరిధిలోని చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి ‘బి’ సెక్షన్ చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. కరుణాకర్ చిన్న తనంలోనే తల్లి అనారోగ్యంతో చనిపోగా, తండ్రి ఇంటి నుంచి ఎటో వెళ్లి పోయాడు. దీంతో కరుణాకర్ యోగ క్షేమాలను తన బాబాయ్ ప్రేమ్ కుమార్ అన్నీ తానై చెప్యాలలోని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నాడు. గోడదూకి ఈతకు వెళ్లి.. మంగళవారం రోజున కరుణాకర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కలిసి రహస్యంగా ఎవ్వరికి చెప్పకుండా పాఠశాల ప్రహరీ గోడ దూకి అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిననట్లు సమాచారం. అందులో ఇద్దరు విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లగా, కరుణాకర్ సాయంత్రమైనా పాఠశాలకు వెళ్లలేదని తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి పాఠశాలలో కరుణాకర్ కనిపించడం లేదని గ్రహించిన ఉపాధ్యాయులు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్లతో గాలింపు.. సాయంత్రం అల్వాల శివారులోని జింకని చెరువులో కరుణాకర్‌కు చెందిన బట్టలు, చెప్పులు లభ్యమయ్యాయి. అనుమానంతో రాత్రి వరకు జేసీబీ గుంతలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. తిరిగి బుధవారం తెల్లవారు జామున దుబ్బాక సీఐ హరికృష్ణ, మిరుదొడ్డి ఎస్ఐ ఎండీ. జమాల్, భూంపల్లి ఎస్ఐ రాజేష్‌ల నేతృత్వంలో తాళ్ళు, వలలు వినియోగించి గజ ఈతగాళ్ళతో చెరువులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తరువాత కరుణాకర్ మృత దేహాన్ని వెళికి తీశారు. అదృశ్యమయ్యాడనుకున్న విద్యార్థి చెరువులో శవమై తేలడంతో గురుకుల పాఠశాలలో విషాదం అలుముకుంది. విద్యార్థి కరుణాకర్ మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చెరువులో పడి మృతి చెందిన కరుణాకర్ మృతదేహాన్ని తమకు చూపించకుండా, ఎలాంటి సమాచారం అందించకుండా పోస్టు మార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని మృతుడు విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుకుల పాఠశాల ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ బృందం సభ్యులు మద్ధతు తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చనిపోయిన విద్యార్థిని పాఠశాల వద్దకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయాన్ని అడిగి తెలుసుకుందామని వచ్చిన ఆర్సీఓ నిర్మల కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆర్సీఓతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లేకనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరవింద్, భిక్షపతి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జోగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ఘ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులతో వాగ్వివాదాలు జోరందుకోవడంతో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగేలా చర్యలు గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కేసుకు సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే తమకు పిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని దుబ్బాక సీఐ హరికృష్ణ విద్యార్థి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమనిగింది. కాగా గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై ఎంపీపీ గజ్జెల సాయిలుతో పాటు, తహసీల్దార్ పద్మారావు, ఎంఈఓ జోగు ప్రభుదాసు, ఎంపీడీఓ సుధాకర్ రావు, ఆర్ఐ శ్రీనివాస్, అల్వాల, చెప్యాల సర్పంచులు ఎనగంటి కిషయ్య, మాసపురం లక్ష్మిలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, ఆళ్లపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో కారు దూసుకెళ్లి బోల్తా పడి ఇద్దరు యువకులు మృత్యువాతకు గురైన సంఘటన ఆదివారం ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన అరెం రాజబాబు (26), సీతారాంపురం గ్రామానికి చెందిన పాయం రవి (35) అవివాహితులు. ఇరువురు తమ స్నేహితుడు బట్టు సారయ్యను కారులో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇప్పనపల్లిలో దింపి తిరిగి వస్తున్న సమయంలో అతివేగం కారణంగా ఆళ్లపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద అదుపుతప్పి మొద్దుల చెరువులో బోల్తా పడి డోర్లు లాక్ పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాదచారులు చెరువులో బోల్తా పడి ఉన్న కారుని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. అరెం రాజబాబు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని రాజకీయాలకు ఆకర్షితుడై గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి, మండల పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవికి పోటీచేశాడు. పాయం రవి ఉన్నత చదువులు చదుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిరువురి మృతితో మైలారం, సీతారాంపురం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండీ.జలాల్ సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సాబీర్ పాషా సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందిన గిరిజన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆళ్లపల్లికి చెందిన ఆరెం రాజబాబు, పాయం రవి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మృతుల కుటుంబ సభ్యులను సాబీర్‌పాషా పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు ఈసం రమాదేవి, మేది ని లక్ష్మి, రత్నకుమారి, ఐవైఎప్ నాయకులు నదీప్, హఫీజ్ సుబ్బారావు తదితరులున్నారు. -
తల్లీబిడ్డలను కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయాడు
న్యూఢిల్లీ : ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను, ఆమె బిడ్డను కాపాడే క్రమంలో ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ మహిళ, తన కొడుకుతో కలిసి శనివారం మీథాపూర్ కెనాల్లో దూకింది. అదే సమయంలో ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ వాళ్లిద్దరిని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. తాను కూడా వెంటనే నీళ్లలో దూకాడు. అయితే వారిద్దరిని ఒడ్డుకు చేర్చడం తన వల్ల కాకపోవడంతో సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. ఈ క్రమంలో అక్కడి చేరుకున్న ముగ్గురు వ్యక్తులు మానవ హారంగా ఏర్పడి సదరు మహిళను, చిన్నారిని కాపాడగలిగారు. కానీ అప్పటికే ఆటో డ్రైవర్ పూర్తిగా మునిగిపోవడంతో అతడిని రక్షించలేకపోయారు. కాగా ప్రస్తుతం ఆ తల్లీకొడుకుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ శవం దొరకలేదని, అతడి ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇద్దరి ప్రాణాలు కాపాడి, తాను అమరుడైన ఆ వ్యక్తి పేరును జీవన్ రక్ష సాహస అవార్డుకు సిఫారసు చేస్తామని వెల్లడించారు. -
పట్టు తప్పి చేపల చెరువులో మాజీ ఎమ్మెల్యే మునక
లక్నో : బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే వారిస్ అలీ బహ్రెచ్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ చేపల చెరువులో పడి మరణించారు. అలీ 2007 నుంచి 2012 వరకూ నన్పారా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన అలీ తిరిగి ఓటమి పాలయ్యారు. కాగా ఆదివారం ఉదయం రోజూలాగే తన ఇంట్లో ని వ్యవసాయ క్షేత్రంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన అలీ ఎప్పటిలాగే చేపలచెరువు చుట్టూ తిరుగుతుండగా పట్టు కోల్పోయి చెరువులో పడినట్టు పోలీసులు తెలిపారు. ఈత రానందున ఆయన చెరువులో మునగడంతో మరణించారని చెప్పారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే మరణానికి సంబంధించి పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత సరైన కారణాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి అత్యంత సన్నిహితుడైన వారిస్ అలీకి మైనారిటీ నేతగా మంచి గుర్తింపు ఉంది. కాగా, పార్టీ నేత మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
భర్తను ప్రేమించడం లేదని మరిదిని దారుణంగా....
కోల్‌కతా : ఎనిమిదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోల్‌కతాకు చెందిన దుఖ్రామ్ దాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుబ్రతా దాస్(22)కు ప్రియాంక(19)తో వివాహం జరిగింది. అయితే దుఖ్రామ్ దాస్ తన చిన్న కుమారుడు రిజు(8)ను చాలా గారాబంగా చూసుకునేవాడు. రిజును గారాబం చేస్తూ.. ఎప్పుడూ అతడి భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ మామగారు తన భర్తపై ప్రేమానురాగాలు చూపించకుండా..నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రియాంక భావించేది. ఈ క్రమంలో మరిదిపై ఆమె ద్వేషాన్ని పెంచుకుంది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల 29న రిజు స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న డ్రమ్‌లో నీళ్లను తోడుకునేందుకు అందులోకి వంగి చూస్తుండగా.. అతడి వెనకాలే వెళ్లిన ప్రియాంక రిజును నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసింది. అనంతరం అతడిని డ్రమ్‌లో పడేసి మూత బిగించింది. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తే రిజు డ్రమ్‌లో పడిపోయాడని అంతా భావించారు. కానీ రిజు మరణించిన నాలుగు రోజుల తర్వాత పశ్చాత్తాప పడిన ప్రియాంక తన భర్త ముందు అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రిజు తండ్రి దుఖ్రామ్ దాస్ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం ద్వేషం కారణంగానే ప్రియాంక రిజును హత్య చేసిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తీరంలో అద్భుతం: మానవహారంగా ఏర్పడి..!
అమెరికా ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్‌లో మానవత్వం పరిమళించే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే ఓ కుటుంబం నీళ్లలో కొట్టుకుపోవడాన్ని చూసి అక్కడి వారంతా క్షణాల్లో స్పందించి ఆ కుటుంబాన్ని కాపాడారు. రాబెర్టా ఉర్స్ రే అనే మహిళ బోట్ రైడ్ చేస్తుండగా అది నీటిలో మునిపోయింది. అందులోని వారు నీటిలో కొట్టుకుపోతూ 'హెల్ప్ హెల్ప్' అంటూ అరిచారు. వారికి సాయం చేసేందుకు ఓ దంపతులు ముందుకొచ్చారు. వారిని కాపాడేందుకు ఈదుకుంటూ వెళ్లారు. వాళ్లని చూసి మరో ఇద్దరు, ఇంకో నలుగురు.. ఇలా దాదాపు 80 మంది నీటిలోకి వెళ్లారు. చేయిచేయి కలిపి మానవహారంలా మారి.. కుటుంబాన్ని రక్షించారు. జులై 8న జరిగిందీ ఘటన. రాబెర్టా ఉర్స్‌రే అనే మహిళ తన కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేస్తుండగా.. బోట్ మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తున్న ఉర్స్‌రే కుటుంబాన్ని జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు చూశారు. ఆ సమయంలో అక్కడ హెల్పింగ్ గార్డ్స్ గానీ.. పోలీసులు గానీ లేరు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా జెస్సికా నీళ్లలోకి దూకింది. జెస్సికాకు ఈత బాగా వచ్చు. అనంతరం డెరెక్ కూడా ఆమె వెంట వెళ్లాడు. ఇంతలో మరి కొందరు నీళ్లల్లో ఈదుకుంటూ అక్కడికి చేరారు. నా చేయి పట్టుకోండి అంటూ జెస్సికా వెనుక ఉన్నవారికి చెప్పింది. అలా ఒక్కొక్కరుగా 80 మంది మానవహారంలా ఏర్పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని గుర్తించడం ముందు కాస్త కష్టమైంది. అయితే వారి అరుపులు.. నీటిలో మునిగిపోతుండగా వారి తలలను గుర్తించి జెస్సికా ఆ దిశగా ఈత ప్రారంభించింది. ఆమెను అనుసరించి మిగతా వాళ్లంతా చేయిచేయి పట్టుకుని ఈదుతూ వచ్చారు. అలా గంట పాటు శ్రమించి.. మొత్తం 10 మందిని రక్షించి.. తీరానికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 67 ఏళ్ల మహిళ కూడా ఉంది. నీటిలో మునగడంతో ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఉర్స్‌రే మీడియాతో మాట్లాడుతూ.. జెస్సికానే లేకపోతే ఈ రోజు తామంతా బతికే వాళ్లం కాదని.. వారికి రుణపడి జీవితాంతం ఉంటామని చెప్పారు. ఎవరితో ఎవరికీ పరిచయం లేకపోయినా.. వారంతా ఒక్కటై తమను రక్షించారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
నదిలో పడిపోయిన స్కూల్ బస్సు
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు.