
నదిలో పడిపోయిన స్కూల్ బస్సు
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు.