కిక్కిరిసిన విద్యార్థులతోపాటు ఒళ్లో కూడా విద్యార్థిని కూర్చోబెట్టి తీసుకువెళ్తున్న ఆటోడ్రైవర్
పిల్లలను స్కూళ్లకు తీసుకెళుతున్న ఆటోలు, బస్సులు భద్రత ఎంత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాణాలు పాటించని వాహనాలలో చిన్నారులను ఎక్కించి వారిని ప్రమాదపుటంచులకు చేరవేస్తున్నారనే ఆందో ళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 ఆటోలు పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లెడానికి వినియోగిస్తున్నారు. చిన్న ఆటోల్లో కేవలం నలుగురు పిల్లలు, అదే పెద్ద ఆటో అయితే ఆరుగురు పిల్లలు మాత్రమే ప్రయాణించ వచ్చు. కానీ చిన్న ఆటోలో తొమ్మిది మంది, పెద్ద ఆటోలో దాదాపు పదిహేనుమంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ పక్కన, ఇరువైపులా ఉన్న ఇనుప చువ్వలపైనా ఎక్కడపడితే అక్కడ బస్తాల్లా కుక్కి తీసుకుళెతున్నారు. పైగా పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోలలో డ్రైవర్లకు కనీసం లైసెన్స్ కూడా లేనివి ఎన్నో ఉన్నాయి. ఇరువైపులా రక్షణగా ఏర్పాటు చేయవలసిన గ్రిల్స్ కనిపించవు, బ్యాగులు చుట్టూ వేలాడుతూ దర్శనమిస్తాయి. పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలైనా కనీసం బస్సులకు కూడా ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిస్థాయిలో చేయలేదంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్న ఆటోల్లో పిల్లలు ప్రయాణించడం ఎంతవరకు సమంజసమనే విషయం గురించి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాక్షి, అమరావతి బ్యూరో: పిల్లలను అల్లారు ముద్దుగా పెంచాతాం...వారికి ఏ చిన్న అపాయమైనా తల్లడిల్లిపోతాం. తల్లిదండ్రుల ప్రేమంటే కేవలం వారికి బాధకలిగిన తర్వాత ఏడ్వడమా..? లేక ఏ ఆపదా రాకుండా జాగ్రత్తపడటమా..! రక్షణ లేని బస్సులు, బోట్లు, ఆటోల్లో ప్రయాణాలు చేయించడం జరగకూడనిదేదైనా జరిగాక గుండెలు బాదుకోవడం. అలోచించండి కనీస ప్రమాణాలు పాటించని వాహనాలలో పిల్లలను పంపి వారిని ప్రమాదపుటంచులకు చేరవేస్తున్నాం. తల్లిదండ్రులుగా పిల్లలను మంచి పాఠశాలలకు పంపుతున్నామా అని ఆలోచిస్తున్నారు. అలాగే ఎలాంటి వాహనాలలో పంపుతున్నామని కూడా ఒకసారి గమనించండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,500 ఆటోలు పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లడానికి వినియోగిస్తున్నారు. వీటిలో ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారన్న విషయాన్ని రవాణాశాఖ అధికారులు వద్ద కూడా సరైన సమాచారం లేదు. ఎటువంటి అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్న ఆటోల్లో పిల్లలు ప్రయాణించడం ‘రైటే’నా అన్న ప్రశ్నను తల్లిదండ్రులు ఒక్కసారి వేసుకోవడం మంచిది.
అంతులేని నిర్లక్ష్యం
స్కూల్ పిల్లలను తరలించే ఆటోడ్రైవర్లు చాలా నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. కానీ ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఎక్కడ చూసిన అంతులేని నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్న ఆటోల్లో కేవలం నలుగురు పిల్లలు, అదే పెద్ద ఆటో అయితే ఆరుగురు పిల్లలు మాత్రమే ప్రయాణించవచ్చు. కానీ చిన్న ఆటోలో తొమ్మిది మంది, పెద్ద ఆటోలో దాదాపు పదిహేనుమంది పిల్లలను కుక్కుతున్నారు. డ్రైవర్ పక్కన, ఇరువైపులా ఉన్న ఇనుప చువ్వలపైనా ఎక్కడపడితే అక్కడ బస్తాల్లా కుక్కి తీసుకుళెతున్నారు. పిల్లలు ప్రయాణించే ఆటో డ్రైవర్లకు కనీసం లైసెన్స్ కూడా లేనివి ఎన్నో ఉన్నాయి. ఇరువైపులా రక్షణగా ఏర్పాటు చేయవలసిన గ్రిల్స్ కనిపించవు. బ్యాగులు చుట్టూ వేలాడుతూ దర్శనమిస్తాయి. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోని బస్సులు దాదాపు వంద వరకు ఉన్నాయని సమాచారం. ఇక ఆటోలకైతే లెక్కేలేదు. రవాణా శాఖాధికారులు అక్కడక్కడా ఆటోలపై దాడులు చేసి జరిమానాలు వేస్తున్నప్పటికి జాగ్రత్తపడాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. తక్కువ డబ్బుకే వస్తాయనో, ఇంటి ముందే వచ్చి ఆగుతాయనో కారణాలతో ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
నిబంధనలివే
⇔ చిన్న ఆటోలో డ్రైవర్ మినహా నలుగురు విద్యార్థులు ఉండాలి.
⇔ పెద్ద ఆటోలో అయితే ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి.
⇔ ఆటో నడుపుతూ డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు.
⇔ డ్రైవర్ ఎటువంటి మత్తుపదార్థాలు తీసుకోని వాహనం నడపరాదు.
⇔ ప్రతి ఏడాది ఆటోను రవాణాశాఖ కార్యాలయంలో ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేయించి, పత్రాలను పొందాలి.
⇔ క్రమం తప్పకుండా ఇన్సూరెన్సును పునరుద్ధరించుకోవాలి. ఆటో నడుపుతున్న వ్యక్తికి ఇరువైపులాపిల్లలను కూర్చోబెట్టుకోకూడదు.
⇔ ఆటోలో ఎటువంటి లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదు.
⇔ జాతీయ రహదారుల్లో స్కూల్‌పిల్లలతో ఉన్న ఆటోలు నడపకూడదు.
⇔ ప్రయాణికులకు కూర్చొవడానికి ఉన్న సీటు తప్ప ఇతర ప్రత్యేకమైన ఏర్పాటుచేసి విద్యార్థులను కూర్చొబెట్టరాదు.
⇔ ఆటోకు ఒక వైపు పూర్తిగా మూసివేసేలా గ్రిల్స్, మరోవైపు తాత్కాలికంగా రక్షణ కల్పించేలా గ్రిల్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.
⇔ స్కూల్ బ్యాగ్‌లు, లంచ్ బాక్స్‌లు, క్రీడా సామగ్రిని బయటకు వేలాడదీయకూడదు.
⇔ పాఠశాల విద్యార్థులను తరలించే ఆటోల్లో తప్పనిసరిగా ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో స్కూలు పిల్లలను ఎక్కించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవు. ఇటీవల విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించాం. ఓవర్‌లోడ్‌తో ఆటోలు నడపడం చట్టరిత్యా నేరం. ఓవర్‌లోడ్‌లపై మళ్లీ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. స్కూల్ పిల్లలను ఓవర్‌లోడ్ చేసే ఆటోలు పట్టుపడితే సీజ్ చేస్తాం. తల్లిదండ్రులు కూడా సహకరించాలి.
ఇ.మీరాప్రసాద్ ,డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment