bhilwara
-
‘తపాడియా’ దారుణ హత్య.. సీఎం సంచలన నిర్ణయం
రాజస్తాన్‌లో రోజురోజుకు ఉద్రిక్తర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భిల్వారాలో ఓ వర్గానికి చెందిన యువకుడిని మరో వర్గానికి చెందినవారు దారుణ చంపడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. దీంతో సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను గురువారం ఉదయం వరకు నిలిపివేశారు. వివరాల ప్రకారం... భిల్వారాకు చెందిన ఆదర్శ్ తపాడియా(22)ను ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తపాడియాను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తపాడియాను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భిల్వారాలో పోలీసు బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తపాడియా మృతి కారణంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా రాజస్తాన్ ప్రభుత్వం భిల్వారాలో గురువారం ఉదయం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. Rajasthan | A 22-year-old man was allegedly stabbed to death in Kotwali Police Station area of Bhilwara last night. Police forces deployed in the area. Internet services in Bhilwara to remain suspended till 6 am on Thursday, 12th May in wake of the incident. pic.twitter.com/lStcjtqiNP — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 11, 2022 ఇది కూడా చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి! -
నిలుస్తున్న ప్రాణాలు..భిల్వారా మోడల్ అంటే ఏమిటి?
జైపూర్: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్.. మరోవైపు ఆక్సిజన్ అందక ఎంతోమంది అభాగ్యులు తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. అయితే ఈ ఆపత్కాలంలో భిల్వారా మోడల్ సాయంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించుకోవచ్చు. ఈ స్ట్రాటజీని ఉపయోగించే రాజస్థాన్ లోని 8 వేల మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించి ప్రాణాల్ని నిలబెట్టడం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఇలా మొదలైంది.. గతేడాది భిల్వారా జిల్లాలో 430 పడకలున్న మహత్మాగాంధి ఆస్పత్రిలో 300 బెడ్లు కరోనా బాధితులతోనే నిండిపోయాయి. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు లేక స్ట్రెచ్చర్ల మీద, కారిడార్లలో వైద్యం కోసం నిరీక్షిస్తూ పేద కుటుంబాలు పడిగాపులు కాస్తూ కనపడ్డాయి. అయితే ఆ సమయంలో బెడ్ల సంగతి పక్కనపెడితే.. ఆక్సిజన్ సరఫరా చేస్తే కరోనా నుంచి బాధితులను రక్షించవచ్చని గాంధీ ఆస్పత్రి వైద్యులు భావించారు. వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల సలహాతో ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సీజన్ ప్లాంట్ ఇప్పుడు రాజస్తాన్‌లో 8 వేల మంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందిస్తోంది. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర అరుణ్ గౌర్ మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాధిగ్రస్తుల్ని రక్షించాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. బెడ్ల లేవని గాబరా పడేకంటే.. బాధితులకు సత్వరం ఆక్సీజన్ అదించడం ముఖ్యం. గతేడాది అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం అశోక్ గహ్లోత్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకుంటోంది. కరోనా బాధితులు పెరుగుతున్నప్పటికీ అందరికీ ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాం. ప్రస్తుతం మేము సొంతంగా ఏర్పాటు చేయించిన ఫ్లాంట్ లో ప్రతిరోజు 100 ఆక్సిజన్ సిలిండర్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర ఆక్సిజన్ ఫ్లాంట్ల నుంచి సిలిండర్లను తెప్పించుకుంటున్నాము. గతంలో మా ఆస్పత్రిలో 30 నుంచి 40 ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించే వాళ్లం. ఇప్పుడు 400 నుంచి 450 సిలిండర్లను ఉపయోగించాల్సి వస్తుంది. వీటిలో 100 సిలిండర్ల వరకు సొంత ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన వాటినే వినియోగించుకుంటున్నాం. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలుతున్నాం ’ అని అరుణ్ గౌర్ పేర్కొన్నారు. (చదవండి: రాజస్థాన్ సీఎంకు కరోనా పాజిటివ్) -
నదిలో పడిపోయిన స్కూల్ బస్సు
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం
భిల్వారా: 'టెక్స్ టైల్ సిటీ ఆఫ్ రాజస్థాన్'గా పేరుపొందిన భిల్వరాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాం జరిగింది. పెళ్లి బృందం వెళుతోన్న ట్రాక్టర్ ను ఓ లారీ ఢీకొట్టడంతో 13 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. భిల్వారాలో వివాహవేడుకలో పాల్గొన్న బృందం.. ట్రాకర్ లో స్వగ్రామానికి బయలుదేరింది. సరిగ్గా విజయ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్లర్ ను లారీ ఢీకొట్టింది. లారీ నేరుగా ట్రాక్లర్ ట్రక్కునే ఢీకొట్టడం వల్ల చాలామంది అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని అజ్మీర్ లోని పెద్దాసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. -
అత్యాచారం చేసి.. బావిలోకి తోసేశారు!
రాజస్థాన్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బావిలోకి తోసేశాడు పొరుగింటి వ్యక్తి. అయినా, బావిలోపల ఉన్న ఓ మెట్టును పట్టుకుని వేలాడుతూ ఆమె 15 గంటల పాటు తట్టుకుంది. తర్వాత ఆమె ఆరుపులు విన్న కొంతమంది ఆమెను కాపాడారు. భిల్వారాకు చెందిన ఆ బాలిక పొలంలో పనిచేసుకోడానికి వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగింది. మర్నాడు ఉదయం ఆమె అరుపులు వినడంతో అటుగా వెళ్తున్నవాళ్లు బావిలోకి చూడగా.. అక్కడ బాలిక వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పారిపోయిన ఆ పొరుగింటి వ్యక్తిపై పోలీసులు అత్యాచారం, హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. తాను రాత్రంతా నీళ్లలోనే ఉన్నానని, రాత్రి భారీ వర్షం కూడా కురవడంతో తన అరుపులు ఎవరికీ వినపడలేదని బాధితురాలు చెప్పింది.