రాజస్థాన్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బావిలోకి తోసేశాడు పొరుగింటి వ్యక్తి. అయినా, బావిలోపల ఉన్న ఓ మెట్టును పట్టుకుని వేలాడుతూ ఆమె 15 గంటల పాటు తట్టుకుంది. తర్వాత ఆమె ఆరుపులు విన్న కొంతమంది ఆమెను కాపాడారు. భిల్వారాకు చెందిన ఆ బాలిక పొలంలో పనిచేసుకోడానికి వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగింది.
మర్నాడు ఉదయం ఆమె అరుపులు వినడంతో అటుగా వెళ్తున్నవాళ్లు బావిలోకి చూడగా.. అక్కడ బాలిక వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పారిపోయిన ఆ పొరుగింటి వ్యక్తిపై పోలీసులు అత్యాచారం, హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. తాను రాత్రంతా నీళ్లలోనే ఉన్నానని, రాత్రి భారీ వర్షం కూడా కురవడంతో తన అరుపులు ఎవరికీ వినపడలేదని బాధితురాలు చెప్పింది.
అత్యాచారం చేసి.. బావిలోకి తోసేశారు!
Published Mon, Jul 21 2014 1:13 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement