ఢిల్లీ ప్రమాదం: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ | Delhi Fear of Drowning of Many Students | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ప్రమాదం: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

Published Sun, Jul 28 2024 7:03 AM | Last Updated on Sun, Jul 28 2024 1:52 PM

Delhi Fear of Drowning of Many Students

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు ఇవి ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్‌ అకాడమీ బేస్‌మెంట్‌లోకి చేరిన వరద నీటిలో ముగ్గురు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతో పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక  చర్యలు కొనసాగుతున్నాయి. 
 

 

 ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతోపాటు పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. నీటిని బయటకు పంపుతున్నామని, బేస్‌మెంట్‌లో ఇంకా ఏడు అడుగుల మేర నీరు నిలిచివుందన్నారు. అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 7.15 గంటలకు తమకు సమాచారం అందిందని,  మొత్తం ఐదు వాహనాలతో సహా వచ్చిన సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌ సెంటర్‌లో 30 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంత భారీగా నీరు బేస్‌మెంట్‌లోకి ఎలా చేరిందన్న విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు.

 

 

 ఈ ఘటనపై ఆప్ నాయకురాలు అతిషి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై మెజిస్ట్రీరియల్ విచారణకు  ఆదేశించామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రెవెన్యూ మంత్రి అతిశీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పరిస్థితిని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సంఘటనా స్థలంలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement