ఢిల్లీ : యూపీఎస్సీ అభ్యర్థులు దుర్భుర జీవితాన్ని గడుపుతున్నారంటూ యూపీఎస్సీ అభ్యర్థి అవినాష్ దూబే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత వారం సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే విద్యార్ధుల మృతికి కారణమైన అధికారులు, ఇతర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవూ చంద్రచూడ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ వంటి ప్రాంతాలలో పేలవమైన మౌలిక సదుపాయాలపై అవినాష్ దూబే ధ్వజమెత్తారు.మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం,డ్రైనేజీ సమస్యలు నిర్లక్ష్యం వల్ల తరచూ సంభవించే వరదలు వల్ల నివాసితులు,విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నివాసితులు, విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరారు.
స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
మరోవైపు ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల మృతి ఘటనపై రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. నిర్లక్ష్యం జరిగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవడం మన బాధ్యత అని వ్యాఖ్యానించారు.
#WATCH | Union Education Minister Dharmendra Pradhan in Rajya Sabha speaks on the incident of death of 3 UPSC aspirants in Delhi
"...There was negligence. Only when accountability is fixed, there will be a solution...It is our responsibility to ensure that such an incident is… pic.twitter.com/PTE3ghhe8n— ANI (@ANI) July 29, 2024
Comments
Please login to add a commentAdd a comment