తల్లీబిడ్డలను కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయాడు | Auto Driver Dies In Process Of Save Woman Her Baby From Drowning | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డలను కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయాడు

Published Wed, Dec 26 2018 8:15 PM | Last Updated on Wed, Dec 26 2018 8:16 PM

Auto Driver Dies In Process Of Save Woman Her Baby From Drowning - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను, ఆమె బిడ్డను కాపాడే క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ మహిళ, తన కొడుకుతో కలిసి శనివారం మీథాపూర్‌ కెనాల్‌లో దూకింది. అదే సమయంలో ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్‌ వాళ్లిద్దరిని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. తాను కూడా వెంటనే నీళ్లలో దూకాడు. అయితే వారిద్దరిని ఒడ్డుకు చేర్చడం తన వల్ల కాకపోవడంతో సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు.

ఈ క్రమంలో అక్కడి చేరుకున్న ముగ్గురు వ్యక్తులు మానవ హారంగా ఏర్పడి సదరు మహిళను, చిన్నారిని కాపాడగలిగారు. కానీ అప్పటికే ఆటో డ్రైవర్‌ పూర్తిగా మునిగిపోవడంతో అతడిని రక్షించలేకపోయారు. కాగా ప్రస్తుతం ఆ తల్లీకొడుకుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్‌ శవం దొరకలేదని, అతడి ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇద్దరి ప్రాణాలు కాపాడి, తాను అమరుడైన ఆ వ్యక్తి పేరును జీవన్‌ రక్ష సాహస అవార్డుకు సిఫారసు చేస్తామని వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement