ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు.
కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్
భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్‌లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్‌బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్‌తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
.
Comments
Please login to add a commentAdd a comment