సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు.
వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి.
ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
Comments
Please login to add a commentAdd a comment