సోలాపూర్: దత్తు నగర్‌లోని దత్తు మందిర్ దేవస్థానం కమిటీ దివంగత వెంకటనరసు వీరయ్య సింగం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీపావళి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను అప్రతిమంగా తయారుచేసి తీర్చిదిద్దారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త గణేశ్ రంగయ్య గుడుమల్ పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు సకినాలు, గారెలు, మడుగులు, శంకరపల్లిలు, లడ్డూ వంటి ఫలహారాల పాకెట్లను పంపిణీ చేశారు. అలాగే సంజయ్ మడూర్ తరఫున ఉపాధ్యాయులకు దీపావళి బహుమతులు అందజేసి సన్మానించారు. (ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి)
ఈ సందర్భంగా దత్త మందిర్ దేవస్థానం సంస్థ కమిటీ అధ్యక్షుడు మహేశ్ దేవసాని, సంజయ్ మడూర్, కిశోర్ దేవసాని, గణేశ్ దేవసాని, నరేశ్ దేవరశెట్టి, దామోదర్ మాచర్లను దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ దేవసాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పర్వదినాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలు పేదలు కూడా సనాతన కాలంగా వస్తున్న దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment