Viral Video: Mumbai Man Arrested For Riding Scooter With 7 Children - Sakshi
Sakshi News home page

వార్నీ..! రద్దీ రోడ్డులో స్కూటీపై ఏడుగురు పిల్లలతో ప్రయాణం..వీడియో వైరల్..

Published Mon, Jun 26 2023 2:54 PM | Last Updated on Mon, Jun 26 2023 3:14 PM

Mumbai Man Arrested For Riding Scooter With 7 Children Video Viral - Sakshi

ముంబయి: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు మాత్రం తమ పంథా మార్చుకోరు. జరిమానాలు విధించినా రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారు. రహదారులపై ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. 

అయితే తాజాగా ముంబయిలో ఓ వ్యక్తి తన స్కూటీపై ఏకంగా ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని రద్దీగా ఉండే రహదారిపై వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

ఇదీ చదవండి: పిల్లాడి టైమ్‌ టేబుల్‌.. చదువుకు కేటాయించిన టైమ్‌ చూస్తే నవ్వాపుకోలేరు!

ముంబయి లాంటి నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాంటి రద్దీగా ఉండే రోడ్లపై ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను స్కూటీ మీద ఎక్కించుకున్నాడు. స్కూటీ ముందు భాగంలో ఇద్దరు పిల్లలు, సీటుపై ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. మరో ఇద్దరు పిల్లలు స్కూటీ వెనక భాగంలో కేవలం కడ్డీ మీదే నిలబడ్డారు. ఇంత ప్రమాదకరంగా ఏడుగుర్ని ఎక్కించుకుని రహదారిపై వెళ్తున్న సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. 

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ ‍అయింది. అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలు తీయడానికే ఇలా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తారని మండిపడ్డారు. ఈ సంఘటనపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్‌.. నిశ్చేష్టుడైన వరుడు!

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement