కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా? | Indian Man Cuts 550 Cakes in Mumbai for His Birthday | Sakshi
Sakshi News home page

Birth Day Celebrations : కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా?

Published Thu, Oct 14 2021 10:09 AM | Last Updated on Thu, Oct 14 2021 1:12 PM

Indian Man Cuts 550 Cakes in Mumbai for His Birthday - Sakshi

ముంబై: ఎవరి పుట్టినరోజు వేడుక వారికే ‍ప్రత్యేకం. ఎవరికి వారు ఇతరులకు భిన్నంగా తమ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావిస్తారు. అయితే కొందరు చేసే పనులు మాత్రం సోషల్‌ మీడియాలో వైరలయి.. అందరిని ఆకట్టుకుంటాయి. ఈ కోవకు చెందిన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు నాడు మహా అయితే 1,2 కేకులు కట్‌ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూడబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 550 కేకులు కట్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ముంబైకి చెందిన సౌర్య రాటూరి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్‌ చేశాడు. అవి కూడా వేర్వేరు సైజుల్లో.. షేపులు, ఫ్లేవర్స్‌ ఉన్న కేక్‌లు కట్‌ చేశాడు. ఈ కేకులన్నింటిని.. ఓ పెద్ద టేబుల్‌ మీద పెట్టి.. వరుసగా వాటన్నింటిని కట్‌ చేసుకుంటూ వెళ్లాడు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు సౌర్య చుట్టూ చేరి అతడిని ఎంకరేజ్‌ చేయసాగారు. 
(చదవండి: బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు)

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ప్రశంసిస్తుండగా.. చాలా మంది మాత్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఇంత అట్టహాసం అవసరమా.. పుట్టిన రోజు అంటే ఏదైనా పనికి వచ్చే పని చేయాలి కానీ.. ఇలాంటి పనులు ఎందుకు అని విమర్శిస్తున్నారు. 
చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement