మెయిజీ చక్రవర్తి జపాన్‌ను పరిపాలిస్తున్నప్పుడు (1868–1912) నాన్–ఇన్ అనే జెన్ సాధకుడు ఉండేవాడు. బౌద్ధంలోని ఒక తత్వం జెన్. ఆ తత్వం గురించి తెలుసుకోడానికి ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ముందుగా అనుమతి తీసుకుని నాన్–ఇన్‌ని కలిశాడు. అయితే నాన్–ఇన్ ఏం చెప్పినా, దానిని ఆచార్యులవారు ఖండిస్తూ ఉన్నారు. పూర్తిగా వినకుండానే, వివరణలోకి పోనివ్వకుండానే నాన్–ఇన్‌ను అడ్డుకుంటూ ఉన్నాడు. నాన్–ఇన్ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు. ఆచార్యుడు చికాకు తెప్పిస్తున్నాడు.‘‘ఆచార్యా.. కాస్త తేనీరు సేవించి, తిరిగి చర్చను కొనసాగిద్దాం’’ అని, ఆచార్యుని ముందున్న కప్పులో తేనీరు ఒంపాడు నాన్–ఇన్. కప్పు నిండిపోయింది. అయినప్పటికీ ఒంపుతూనే ఉన్నాడు.
తేనీరు కప్పు అంచుల నుంచి పొంగి పొర్లిపోతున్నా ఆపడం లేదు.‘‘ఇంకెక్కడ పోస్తారు మహానుభావా.. నింyì , పొర్లుతోంది చూడండి’’ అన్నాడు ఆచార్యుడు.నాన్–ఇన్ నవ్వి, ‘‘ఈ కప్పులాగే మీ బుర్ర కూడా మీరు నా దగ్గరికి వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలతో పొంగిపొర్లుతోంది. ముందు దానిని ఖాళీ అవనివ్వండి. అప్పుడు నేను చెప్పేది ఎక్కుతుంది’’ అన్నారు. ఆచార్యులవారికి తత్వం బోధపడింది. ఎలాగూ తేనీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే చిన్న మాట. తేనీటి విరామం మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని శాస్త్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. అన్నట్లు.. ఇవాళ ‘వరల్డ్ టీ డే’ కూడా.
తేనీటి విందుకు పిలవండి
Published Thu, Dec 14 2017 11:49 PM | Last Updated on Thu, Dec 14 2017 11:49 PM
Comments
Please login to add a commentAdd a comment