AP: CM YS Jagan Gave Feast to Union Minister Nitin gadkari at Tadepalli - Sakshi
Sakshi News home page

CM YS Jagan: కేంద్ర మం‍త్రి నితిన్‌ గడ్కరీకి సీఎం వైఎస్‌ జగన్‌ విందు

Published Fri, Feb 18 2022 10:05 AM | Last Updated on Fri, Feb 18 2022 1:06 PM

CM YS Jagan Gave Feast to Union Minister Nitin gadkari at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గౌరవార్దం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విందు ఇచ్చారు. గురువారం పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ విందు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల ప్రాజెక్టులపై ఆయన సీఎంతో చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడే విశాఖపట్నం–భీమిలి–భోగాపురం బీచ్‌ కారిడార్‌ గురించి వైఎస్‌ జగన్‌ సమగ్రంగా వివరించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రఖ్యాత కన్సల్టెన్సీలతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

ఆ మేరకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులను ఆదేశించారు. ఇతరత్రా అన్ని ప్రతిపాదనలకు కూడా గడ్కరీ ఆమోదం తెలుపడం పట్ల సీఎం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ, ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కేంద్ర రోడ్డు రవాణా ప్రాంతీయ అధికారి ఎస్‌.కె.సింగ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మహబీర్‌ సింగ్, ఆర్‌.కె.సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (Sheik Rashid: జగన్‌ సార్‌ నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement